‘స్వర్ణ శతాబ్దిఎక్స్‌ప్రెస్’కు తప్పిన ప్రమాదం
బులంద్‌షహర్(ఉత్తరప్రదేశ్): స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం ఢిల్లీ- హౌరా మార్గంలో లక్నో వైపు వెళ్తుండగా 5, 6 కోచ్‌ల లింక్ తెగిపోయింది. దీంతో రైలు ఒక్కసారిగా పెద్ద కుదుపునకు లోనయింది. ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్ అత్యవసర బ్రేక్‌లను ఉపయోగించి రైలు వేగాన్ని వెంటనే తగ్గించేశారు.
ఈ ఘటన కారణంగా ప్రయాణికులెవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించలేరు. రైలు నిలిచిపోవటంతో ఈ మార్గంలో వెళ్లే కుల్కామెయిల్ తదితర రైళ్లను ఖుర్జా జంక్షన్ వద్దనే నిలిపివేశారు. రైల్వే సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. సుమారు గంట అనంతరం రైళ్లు తిరిగి యథావిధిగా నడిచాయి.