swarnandhra pradesh
-
ఒక్క చాన్స్ ఇస్తే.. స్వర్ణాంధ్రను చేస్తా: చంద్రబాబు
సాక్షి, నెల్లూరు: ‘‘నాకు ఒక్క అవకాశం ఇస్తే సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తా.. తెలంగాణను సామాజిక తెలంగాణ చేస్తా.. సీమాంధ్ర నుంచి 25 పార్లమెంట్ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాల్లో గెలిపిస్తే మళ్లీ ఢిల్లీలో చక్రం తిప్పుతా’’ అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు అధికారమిచ్చిన ప్రతిసారీ ఆ పార్టీ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రం నుంచి 33 ఎంపీ స్థానాలు పొంది అధికారాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞత మరచి తెలుగుజాతి మధ్య చిచ్చుపెట్టిందని మండిపడ్డారు. రాష్ట్ర విభజన ఎంతో బాధ కలిగించిందన్నారు. విభజనతో నదీజలాల సమస్య వస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తానని శపథం చేశారు. టీడీపీ ఐదో ప్రజాగర్జనను బాబు బుధవారం నెల్లూరు జిల్లా కేంద్రంలోని వీఆర్సీ గ్రౌండ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది టీడీపీ ఒక్కటేనన్నారు. ‘‘హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది నేనే.. ఈ దొంగ కాంగ్రెస్, కేసీఆర్ కాదు’’ అని పేర్కొన్నారు. తనకు ప్రధాని పదవి ఇస్తామని చెప్పినా తెలుగుజాతి కోసం వదులుకున్నానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని అడ్రస్ లేకుండా చేయాలన్నారు. సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో తన ప్రజాగర్జన ఎన్నికల శంఖారావంలా మారిందని బాబు పేర్కొన్నారు. అంతకుముందు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని ఓ కల్యాణ మండపంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. నెల్లూరు సభలో బాబు పలు ఎన్నికల హామీలను కుమ్మరించారు. అవేమిటంటే... * రైతులను ఆదుకునేందుకు రుణాలను రద్దు చేస్తా. * డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా. * వృద్ధులకు రూ.1000, వికలాంగులకు రూ.1500 చొప్పున పింఛన్లు ఇస్తా. * బీసీలకు 100 అసెంబ్లీ సీట్లు ఇస్తాం. * బీసీ డిక్లరేషన్ తెస్తాం.. బడ్జెట్లో సబ్‌ప్లాన్ అమలు చేస్తాం. * కాపుల పేదరికాన్ని పోగొట్టేందుకు రూ. వెయ్యి కోట్ల బడ్జెట్. * దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా. * ముస్లింల రిజర్వేషన్లు కొనసాగిస్తా. వారికి రాజకీయ ప్రాధాన్యత * బ్రాహ్మణుల అభివృద్ధికి రూ. 500 కోట్ల బడ్జెట్ కేటాయిస్తాం. * నుంచి బాబు వరుస గర్జనలు చంద్రబాబు ఈ నెల 8 నుంచి నెలాఖరు వరకూ వరుసగా వివిధ వర్గాల గర్జనలు, ప్రజాగర్జనలు నిర్వహించనున్నారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు ఈ నెల 8న హైదరాబాద్‌లో మహిళ , 16న గుంటూరులో రైతు, 18న అనంతపురంలో బీసీ, 20న హైదరాబాద్‌లో యువ, 23న వరంగల్‌లో ఎస్సీ,ఎస్టీ, 28న ఆదిలాబాద్‌లో గిరిజన గర్జన నిర్వహిస్తారు. 12న విశాఖ, 15న ఖమ్మం, 17న కృష్ణా, 19న కర్నూలు, 21న శ్రీకాకుళం, 22న తూ.గో., 24న కరీంనగర్, 25న మహబూబ్‌నగర్, 27న కడపల్లో ప్రజాగర్జనలు నిర్వహిస్తారు. బాబును కలసిన సబితారెడ్డి: మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం చంద్రబాబును కలిశారు. ఈ నెల 9న హైటెక్స్‌లో జరిగే తన కుమారుడి వివాహానికి ఆయనను ఆహ్వానించారు. ఇదిలావుంటే.. ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డి మంగళవారం బాబుతో భేటీ అయ్యారు. వీరిద్దరూ ఎప్పటి నుంచో టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. -
విభజనను ఎదిరించిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్
నిడదవోలు, న్యూస్‌లైన్ : నిడదవోలులో నిర్వహించిన జనభేరి సభలో పార్టీ నిడదవోలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.రాజీవ్‌కృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై అడ్డగోలుగా రాష్ట్ర విభసనకు పూనుకున్నాయన్నారు. రాష్ట్రంలో ఏ నాయకుడు చేయని విధంగా జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ స్థాయిలో ఈ అన్యాయాన్ని ఎదిరించారని చెప్పారు. ఓటు అనే ఆయుధంతో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెబుదామని, పేదల కష్టాలను దగ్గరుండి చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేద్దామన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షులు జీఎస్ రావు మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ దుర్మార్గానికి ఒడిగట్టి సీమాంధ్రుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. రాష్ట్ర విభజన వద్దని పోరాటం చేసిన నాయకుడు ఒక్క జగన్మోహన్రెడ్డి మాత్రమే అన్నారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రం తిరిగి స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారుతుందనే నమ్మ కం ప్రజలకు కలిగిందన్నారు. వైఎస్ మరణానంతరం రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడిచిందని పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాల రాజు పేర్కొన్నారు. అన్నివర్గాల ప్రజ లకు అడిగిందే తడవుగా సంక్షేమ ఫలాలను అందించిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు. ఆ ఫలాలను సీమాంధ్ర ప్రజలు తిరిగి పొందాలంటే జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయటమే మార్గమన్నారు. పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పరీశీలకులు బొడ్డు అనంత వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనకు చేసిన కాం గ్రెస్, అందుకు వత్తాసు పలికిన బీజేపీ, టీడీపీలు సీమాంధ్రుల కన్నీటిలో కొట్టుకుపోతాయని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు అందాలంటే జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని అన్నారు. వైఎస్ బతికుంటే తెలాంగాణ అడిగే ధైర్యం ఉండేది కాదని పార్టీ ఉండి నియోజకవర్గ సయన్వయకర్త పాతపాటి సర్రాజు పేర్కొన్నారు. రెండు కళ్ల సిద్ధాంతంతో చంద్రబాబు సీమాంధ్రులకు తీరని అన్యాయం చేశారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తుపానుకు కాంగ్రెస్, టీడీపీలు కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడిందని, ఆ రెండు పార్టీలను నామ రూపాలు లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ తండ్రిలానే మడమతిప్పని, మాట తప్పని నైజం జగన్మోహన్రెడ్డిదని చెప్పారు. రాష్ట్ర విభజన పాపానికి టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు పుట్టగతులు లేకుండా పోతాయని పేర్కొన్నారు. -
బాబు స్వర్ణాంధ్రప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యలు
పరకాల, న్యూస్‌లైన్: చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్రప్రదేశ్ పాలనలో రైతుల ఆత్మహత్యలు అధికంగా జరిగాయని, ప్రజలు వలసపోయూరని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. పరకాలలో శుక్రవారం ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ ‘నా ఓటుతోనే నా లేఖతోనే తెలంగాణ వచ్చింది’ అనిని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు.. రాష్ట్రం రాకుండా ఎవరేవరి ఇంటికి వెళ్లారో.. ఎన్ని గడపలు తొక్కారో మనందరికీ తెలుసునన్నారు. ఇప్పుడు సామాజిక తెలంగాణ నిర్మాణం అవకాశం కల్పించాలని కోరడం సిగ్గు చేటన్నారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో సీట్లు ఏ వర్గానికి కేటాయించారో తెలిసిందేనన్నారు. రెండు రాష్ట్రాల్లో ఉన్న పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న బాబు.. తెలంగాణలో మోత్కుపల్లి నర్సింహులుకు అధ్యక్ష పదవి ఇచ్చి తన సామాజిక నిబద్ధతను చాటుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా గొంగళి పురుగును ముద్దాడుతానని, అవసరమైతే కాంగ్రెస్‌తో బేషరతుగా కలిసి పనిచేస్తానని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. వరంగల్ ఎంపీ రాజయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ విచిత్రమైన పార్టీగా మారిందన్నారు. దొంగతనం చేసిన వాడే దొంగ..దొంగని అరిచినట్లుగా టీడీపీ నాయకుల ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. నీచమైన టీడీపీని తెలంగాణ రాష్ట్రంలో సమూలంగా సమాధి చేయూలని రాజయ్య పిలుపునిచ్చారు.