విభజనను ఎదిరించిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్ | ys jagan mohan reddy is only fighter fot samaikyandhra | Sakshi
Sakshi News home page

విభజనను ఎదిరించిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్

Published Wed, Mar 5 2014 2:52 AM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM

ys jagan mohan reddy is only fighter fot samaikyandhra

నిడదవోలు, న్యూస్‌లైన్ :
 నిడదవోలులో నిర్వహించిన జనభేరి సభలో పార్టీ నిడదవోలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.రాజీవ్‌కృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై అడ్డగోలుగా రాష్ట్ర విభసనకు పూనుకున్నాయన్నారు. రాష్ట్రంలో ఏ నాయకుడు చేయని విధంగా జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ స్థాయిలో ఈ అన్యాయాన్ని ఎదిరించారని చెప్పారు. ఓటు అనే ఆయుధంతో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెబుదామని, పేదల కష్టాలను దగ్గరుండి చూసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేద్దామన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షులు జీఎస్ రావు మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ దుర్మార్గానికి ఒడిగట్టి సీమాంధ్రుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. రాష్ట్ర విభజన వద్దని పోరాటం చేసిన నాయకుడు ఒక్క జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే అన్నారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రం తిరిగి స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారుతుందనే నమ్మ కం ప్రజలకు కలిగిందన్నారు.
 
  వైఎస్ మరణానంతరం రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడిచిందని పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాల రాజు పేర్కొన్నారు. అన్నివర్గాల ప్రజ లకు అడిగిందే తడవుగా సంక్షేమ ఫలాలను అందించిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు.  ఆ ఫలాలను సీమాంధ్ర ప్రజలు తిరిగి పొందాలంటే జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయటమే మార్గమన్నారు.  పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పరీశీలకులు బొడ్డు అనంత వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనకు చేసిన కాం గ్రెస్, అందుకు వత్తాసు పలికిన బీజేపీ, టీడీపీలు  సీమాంధ్రుల కన్నీటిలో  కొట్టుకుపోతాయని పేర్కొన్నారు.  సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు అందాలంటే జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని అన్నారు.
 
 వైఎస్ బతికుంటే తెలాంగాణ  అడిగే ధైర్యం ఉండేది కాదని పార్టీ ఉండి నియోజకవర్గ సయన్వయకర్త పాతపాటి సర్రాజు పేర్కొన్నారు. రెండు కళ్ల సిద్ధాంతంతో చంద్రబాబు సీమాంధ్రులకు తీరని అన్యాయం చేశారన్నారు.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తుపానుకు కాంగ్రెస్, టీడీపీలు కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడిందని, ఆ రెండు పార్టీలను నామ రూపాలు లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ తండ్రిలానే మడమతిప్పని, మాట తప్పని నైజం జగన్‌మోహన్‌రెడ్డిదని చెప్పారు. రాష్ట్ర విభజన పాపానికి టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు పుట్టగతులు లేకుండా పోతాయని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement