పరకాల, న్యూస్‌లైన్: చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్రప్రదేశ్ పాలనలో రైతుల ఆత్మహత్యలు అధికంగా జరిగాయని, ప్రజలు వలసపోయూరని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. పరకాలలో శుక్రవారం ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ ‘నా ఓటుతోనే నా లేఖతోనే తెలంగాణ వచ్చింది’ అనిని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు.. రాష్ట్రం రాకుండా ఎవరేవరి ఇంటికి వెళ్లారో.. ఎన్ని గడపలు తొక్కారో మనందరికీ తెలుసునన్నారు. ఇప్పుడు సామాజిక తెలంగాణ నిర్మాణం అవకాశం కల్పించాలని కోరడం సిగ్గు చేటన్నారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో సీట్లు ఏ వర్గానికి కేటాయించారో తెలిసిందేనన్నారు.
రెండు రాష్ట్రాల్లో ఉన్న పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న బాబు.. తెలంగాణలో మోత్కుపల్లి నర్సింహులుకు అధ్యక్ష పదవి ఇచ్చి తన సామాజిక నిబద్ధతను చాటుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా గొంగళి పురుగును ముద్దాడుతానని, అవసరమైతే కాంగ్రెస్‌తో బేషరతుగా కలిసి పనిచేస్తానని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. వరంగల్ ఎంపీ రాజయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ విచిత్రమైన పార్టీగా మారిందన్నారు. దొంగతనం చేసిన వాడే దొంగ..దొంగని అరిచినట్లుగా టీడీపీ నాయకుల ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. నీచమైన టీడీపీని తెలంగాణ రాష్ట్రంలో సమూలంగా సమాధి చేయూలని రాజయ్య పిలుపునిచ్చారు.
బాబు స్వర్ణాంధ్రప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యలు
Published Sat, Mar 1 2014 2:40 AM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM
Advertisement
Advertisement