విజయవాడ రైల్వే ఎస్పీపై సస్పెన్షన్ వేటు
హైదరాబాద్: విజయవాడలో రైల్వే ఎస్పీగా పని చేస్తున్న ఐపీఎస్ అధికారి సీహెచ్ శ్యామ్ప్రసాద్రావుపై సస్పెన్షన్ వేటు పడింది. సీఐడీ నివేదిక ఆధారంగా ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఇన్చార్జ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ మంగళవారం తెలిపారు
. ఇంటి అద్దె భత్యం(హెచ్ఆర్ఏ)లో అవకతవకలకు పాల్పడినట్లు శ్యామ్ప్రసాద్రావుపై సీఐడీ క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. అవక తవకలకు పాల్పడినట్లు తేలడంతో ఇటీవల అందిన నివేదిక ఆధారంగా శ్యామ్ప్రసాద్రావును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.