‘తమిళ’ హెచ్ఆర్సీ చీఫ్‌గా మీనాకుమారి
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్ పర్సన్‌గా మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి. మీనాకుమారి నియమితులయ్యారు. తమిళనాడు గవర్నర్ రోశయ్య ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామక ఉత్తర్వులను జారీ చేశారు. గతంలో ఈమె మేఘాలయ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి గత ఏడాది రిటైరయ్యారు. అంతకుముందు ఈమె ఆంధ్రప్రదేశ్, మద్రాస్, పాట్నా రాష్ట్ర హైకోర్టులలో న్యాయమూర్తిగా పనిచేశారు. తెలుగు వ్యక్తి అయిన ఈమె రిటైరయ్యాక హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.