tamannaah marriage
-
త్వరలో వివాహబంధంలోకి మిల్కీ బ్యూటీ.. వరుడు ఎవరో తెలుసా?
మిల్కీ బ్యూటీ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు తమన్నా. అభిమానుల్లో అంతలా పేరు సంపాదించుకుంది ఈ భామ. శ్రీ మూవీతో తెలుగు తెరపై మెరిసిన ఈ పంజాబీ భామ తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో తనదైన నటనతో ముద్ర వేసిన తమన్నాపై ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ ముంబై ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే తమన్నా చేసుకోబోయే వ్యక్తి ఎవరన్నా దానిపైనే నెట్టింట్లో పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. (చదవండి: తమన్నాకు చెస్ ఆట నేర్పిస్తున్న ప్రభాస్, వైరల్‌గా త్రోబ్యాక్ వీడియో) తమన్నా భాటియా త్వరలో ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అందువల్లే కొత్త ప్రాజెక్టులకు సంతకం చేయడం లేదని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ వార్తలను ఆమె ఇప్పటివరకు ఖండించకపోవడంతో త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని అభిమానులు భావిస్తున్నారు. గతంలో ఎవరిని పెళ్లి చేసుకోవాలో తన తల్లిదండ్రులే నిర్ణయిస్తారని చెబుతూ వస్తోంది మిల్క్ బ్యూటీ. ముంబైకి చెందిన తమన్నా భాటియా.. దక్షిణ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె టాలీవుడ్లో నటించిన చిత్రాల్లో అనేక సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. ఆమె కెరీర్లో భారీహిట్‌గా నిలిచిన చిత్రం 'బాహుబలి'. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్నా భాటియా పెళ్లికి ప్రజలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని అన్నారు. ఆమె 14 ఏళ్ల వయస్సులోనే సినిమాల్లో నటించడం ప్రారంభించింది. కాగా.. తమన్నా ప్రస్తుతం భోళా శంకర్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా నటిస్తోంది. మరోవైపు ఓ తమిళ చిత్రంలోనూ కనిపించనుంది. -
పెళ్లికి వ్యతిరేకిని కాను..!.. త్వరలోనే పిల్లల్ని కనాలనుకుంటున్నా!
పెళ్లెందుకు? మగ తోడు లేకుంటే బతకలేమా? అంతగా కావాలంటే ఆ సమయం వచ్చినప్పుడు చూద్దాంలే. ఇలాంటి మాటలు కొందరు టాప్ హీరోయిన్ల నుంచి వింటునే ఉన్నాం. ఉదాహరణకు నటి శృతిహాసన్ తీసుకుంటే తాను పెళ్లి చేసుకోను అని ఒక సందర్భంలో ఖరాఖండిగా చెప్పారు. ఆ తరువాత బాయ్‌ఫ్రెండ్‌తో బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుని తిరిగి పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పారు. అయితే అది కూడా జరగలేదు. ఇక నటి తమన్నా విషయానికొస్తే ఈమె కూడా ఇప్పటి వరకు పెళ్లి ఊసే ఎత్తలేదు. ఇక నటిగా అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. అందాల ఆరబోతకు కేరాఫ్‌గా ముద్ర వేసుకున్న తమన్నా ఇటీవల నటనకు అవకాశం ఉన్న చిత్రాల్లో నటించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈమె అలా నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం బబ్లీ బౌన్సర్. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ హిందీ చిత్రం ఆ మధ్య విడుదలై నిరాశనే మిగిల్చింది. అదే విధంగా తెలుగులోనూ హిట్ చూసి చాలా కాలమే అయ్యింది. ఇక తమిళంలో చాలా గ్యాప్ తరువాత ఓ చిత్రంలో నటిస్తోంది. రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న జైలర్ చిత్రంలో ఈ భామ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇది ఈమెకు ఇక్కడ రీ ఎంట్రీ చిత్రమే అని చెప్పాలి. ఒక పక్క అవకాశాలు తగ్గుముఖం పట్టడం, మరోపక్క పెళ్లి వయస్సు కూడా దాటిపోతోందని గ్రహించినట్లు ఉంది. తాజాగా ఆమె పేర్కొంటూ.. ఇన్నాళ్లూ చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల పెళ్లి గురించి ఆలోచించే సమయం లేకపోయిందని, అంతేగానీ పెళ్లికి వ్యతిరేకిని కాదని చెప్పుకొచ్చింది. త్వరలోనే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలనుకుంటున్నట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో కాబోయే జీవిత భాగస్వామిని సెట్ చేసుకునే ఉంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. -
పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన తమన్నా!
తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు గుప్పుమన్న వార్తలపై టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా స్పందించింది. అవన్ని వదంతులని, తానెవరినీ పెళ్లి చేసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం సినీ వృత్తిజీవితంలో క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్నానని చెప్పింది. తాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించినప్పుడు తప్పకుండా ప్రపంచానికి తెలియజేస్తానని వెల్లడించింది. తమన్నా కంప్యూటర్ ఇంజినీర్‌ను పెళ్లి చేసుకోబోతున్నదని, పెళ్లి తర్వాత ఆమె నటనకు గుడ్‌బై చెప్పే అవకాశముందని ఒక్కసారిగా కథనాలు వచ్చాయి. ఈ వదంతులు సినీ పరిశ్రమలో హల్చల్ సృష్టించాయి. ఈ నేపథ్యంలో స్పందించిన తమన్నా భాటియా 'ఇవి తప్పుడు కథనాలు. నేను పెళ్లి చేసుకోవడం లేదు. నేను ఎవరినైనా పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు ఆ విషయం మొదట ప్రపంచానికి చెప్తాను. ప్రభుదేవా సినిమా షూటింగ్లో ప్రస్తుతం నేను బిజీగా ఉన్నాను. కొన్ని దక్షిణాది సినిమాల్లోనూ నటిస్తున్నాను' అని తమన్నా ఓ ప్రకటనలో తెలిపింది. తెలుగు, తమిళ చిత్రాల్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న తమన్నా 'బాహుబలి' సినిమాతో బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తాజాగా నటించిన 'ఊపిరి' సినిమా కూడా మంచి మార్కులే తెచ్చిపెట్టింది. బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ సరసన ఓ చిత్రంలో నటించనుందని సమాచారం.