రెహమాన్ సినిమా తొలి పోస్టర్ వచ్చేసింది!
ముంబై: ఆస్కార్ విన్నర్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన తరువాత మరో కీలక అడుగు ముందుకేశారు. తన సంగీతంతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఆయన చిత్ర నిర్మాణ రంగంలో తన మొదటి చిత్రం పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఏఆర్ రెహ్మాన్ సంగీత ప్రధాన కథాంశంతో కూడిన ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమిళంలో 99 పాడల్గళ్ పేరుతో, హిందీలో 99 సాంగ్స్ పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం తొలి పోస్టర్ ను అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఓ కలర్ ఫుల్ పోస్టర్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన అందరి ఆశీస్సులను ఆకాంక్షించారు.
'' మీ అందరి సహకారం, ఆశీస్సులతో .. నా సినిమా మొదటి పోస్టర్.. షేర్ చేస్తున్నా' అని ఆయన ట్వీట్ చేశారు అటు ఈ సినిమా దర్శకుడు ముఖేస్ చాబ్రా కూడా ఈ పోస్టర్ ను తన ట్విట్టర్ పోస్ట్ చేశారు. రెహమాన్ చిత్రంలో భాగస్వామి కావడం తనకు గొప్ప అనుభవాన్ని మిగిల్చిందని తెలిపారు. కాగా ఏఆర్ రెహమాన్ వైఎంసీ అనే చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి తమిళ్, హిందీ భాషలలో తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తన నిర్మాణ సంస్థ ద్వారా భవిష్యత్ లో కొత్త సంగీత దర్శకు లను ప్రోత్సహిస్తానని ప్రకటించారు. అరుదైన ప్రతిభతో రెండు అస్కార్ అవార్డులను సొంతం చేసుకున్న ఏకైక భారతీయుడు ఏఆర్ రెహమాన్ అటు హాలీవుడ్లో కూడా తన హవాను చాటుకుంటున్నారు.
With your support & good wishes, I'm pleased to share my movie's first poster! https://t.co/F7KOZ0bRmv
— A.R.Rahman (@arrahman) March 9, 2016