Tandur Municipality
-
కదిలిన శివారు విలీన ఫైల్..!
మున్సిపల్‌శాఖ అమోదం పోంది సచివాలయానికి చేరిన ఫైల్ ప్రస్తుత పట్టణ వైశాల్యం 5.8 చ.కి.మీ. 23.33 చ.కి.మీ. అదనం 29.19 చ.కి.మీకు పెరగనున్న వైశాల్యం 65532 నుంచి 75008కు పెరగనున్నజనాభా మున్సిపల్‌కు త్వరలో మహర్ధశ తాండూరు : తాండూరు పట్టణశివారులోని కాలనీలు ,గ్రామపంచాయతీలు త్వరలో విలీనం కానున్నాయి. గతేడాది తాండూరు మున్సిపల్ అధికారులు పట్టణశివారు ప్రాంతాలనువిలీనం చేసేందుకు మున్సిపల్ అధికారులు పిపించిన ఫైల్‌ను కలెక్టర్ అమోదముద్ర వేశారు. అక్కడి నుంచి మున్సిపల్ శాఖ అమోదం తెలపడంతో సచివాలయానికి చేరుకుంది. దీంతో మున్సిపాలిటీకి మహర్ధశపట్టనుంది. విలీనంతో తీరనున్న సమస్యలు.. కనీస సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్న పట్టణ శివారు కాలనీలకు మహార్థశ పట్టనున్నది. గ్రామపంచాయతీలు,మున్సిపాలిటీల మధ్య పరిధి వివాదాలతో నిర్లక్ష్యానికి గురైన శివారు కాలనీలు అభివృద్ధి బాటపట్టనున్నాయి. సమస్యలో కాలం వెల్లదీసిన సుమారు పది వేల మంది శివారు ప్రజలు తీరనున్నాయి. ఏళ్లుగా కాగితాలకే పరిమితమైన శివారు కాలనీ విలీనానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. జిల్లా కలెక్టర్ దివ్య శివారు కాలనీల విలీనానికి ఆమోద ముద్ర వేశారు. దాంతో 14ఏళ్లుగా నిరీక్షిస్తున్న ప్రజల కల నెరవేరే రోజు అసన్నమైంది. ఈ నేపథ్యంలో తాండూరు పట్టణం కొత్త రూపును సంతరించుకోనున్నది. గతేడాది తాండూరు మున్సిపల్ అధికారులు శివారు కాలనీల విలీనంపై కలెక్టర్‌కు ప్రతిపాదనలు చేశారు. ఈ ప్రతిపాదనలు పరిశీలించిన కలెక్టర్ ఆమోదం తెలిపారు. కలెక్టర్ నుంచి మున్సిపల్‌శాఖ కమిషనర్ అండ్డైరెక్టర్కు అక్కడి నుంచి ప్రభుత్వానికి విలీన ప్రతిపాదనలు చేరుకున్నాయని మున్సిపల్ చైర్పర్సన్ సునితసంపత్ తెలిపారు. విలీనం కానునున్న కాలనీ/ప్రాంతాలు కోకట్, అంతారం, గౌతాపూర్, చెన్‌గేష్‌పూర్ గ్రామ పంచాయతీల పరిధిలోని కొంత భాగం, రసూల్పూర్ రెవెన్యూ విలేజ్‌తో, సాయిపూర్, మల్రెడ్డిపల్లి ప్రాంతాలు పూర్తిగా మున్సిపాలిటీలో విలీనం కానున్నాయి. ఆయా ప్రాంతాల్లోని ఎన్టీఆర్ నగర్, రాజీవ్ గృహకల్ప, ఇందిరమ్మ కాలనీ, ఆదర్శనగర్ తదితర కాలనీ ప్రజల కష్టాలు తీరనున్నాయి. ఆయా గ్రామ పంచాయతీల పరిధికి ఎలాంటి ఇబ్బంది కాకుండా మున్సిపాలిటీకి ఆనుకొని ఉన్న సదరు పంచాయతీల పరిధిలోని కొంత భాగాలను మాత్రమే విలీనం చేస్తూ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. అదనంగా 23.33 చదరపు కి.మీ. ప్రస్తుతం తాండూరు మున్సిపాలిటీ పరిధి 5.82 చదరపు కి.మీ. తాజా ప్రతిపాదనల నేపథ్యంలో శివారు కాలనీలు, ప్రాంతాల విలీనంతో 23.33 చదరపు కి.మీ. అదనంగా చేరనున్నది. దాంతో మొత్తం పరిధి 29.19 చదరపు కి.మీ.కు పెరగనున్నది. 75,008కు పెరగనున్న జనాభా... 2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపాలిటీ జనాభా 65532. శివారు కాలనీల విలీనంతోఅదనంగా 9476 జనాభా చేరనున్నది. దాంతో పట్టణ జనాభా 75008కు పెరగనున్నది. తగ్గనున్న జన సాద్రత... ప్రస్తుతం ఒక కి.మీ.కు 11,259 జనసాద్రత ఉండగా... కి.మీ.2569కి తగ్గనున్నది. 20వేల గృహాలు..25వేల కుటుంబాలు మున్సిపాలిటీలో 13వేల గృహాలకుగాను 18వేల కుటుంబాలు నివసిస్తున్నాయి. తాజా ప్రతిపాదనల ప్రకారం గృహాలు 20వేలకు, కుటుంబాల సంఖ్య 25వేలకు పెరగనున్నది. తీరనున్న సమస్యలు ఇవే.. ఆయా కాలనీలను అంతర్గత రోడ్లు, మురుగు కాల్వలు, వీధి దీపాలు, చేతి పంపులు, పైప్లైన్ల మరమ్మతులు, పోలీసు,రెవెన్యూ, ఇళ్ల నిర్మాణ సమస్యలు తీరనున్నాయి. పంచాయతీలు, మున్సిపాలిటీల మధ్య పరిధి వివాదంతో ఆయా కాలనీల్లో అక్రమ నిర్మాణాలకు ఆస్కారం కలిగింది. విలీనంతో అక్రమ నిర్మాణాలు తగ్గి, మున్సిపాలిటీకి ఆదాయం సమకూరనున్నది. ముఖ్యంగా విలీనంతో ఇందిరమ్మ,ఆర్జీకే కాలనీలు అర్భన్ ఠాణా పరిధిలోకి రానుండటంతో భద్రత సమస్య తీరనున్నది. ప్రభుత్వఅమోదిస్తేఅన్నివిధాలమేలు.. పట్టణ శివారు ప్రాంతాల విలీనం చేసేందుకు ఫైల్ప్రభుత్వానికి చేరుకుంది. తాండూరు మున్సిపాలిటీకి ఆదాయంతోపాటు ప్రజలకు మేలుచేకూరుతుంది మంత్రి చొరవ తీసుకుంటే వెంటనే అమోదం పోందుతుంది. పట్టణ శివారుప్రాంతాలు భివృద్దిచెందుతాయి. సునితసంపత్, చైర్పర్సన్, తాండూరు మున్సిపాలిటీ -
పింఛన్లకు బయోమెట్రిక్ విధానం
డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ సర్వేశ్వర్‌రెడ్డి తాండూరు: బయోమెట్రిక్ విధానం ద్వారా ఆసరా పథకం కింద పింఛన్ల పంపిణీ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తోందని డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ వి.సర్వేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన తాండూరు మున్సిపాలిటీని సందర్శించారు. చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ గోపయ్యలతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. బోగస్ పింఛన్లను తొలగించి, అర్హులైన పేదలకు లబ్ధి చేకూర్చడం కోసమే బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు. వచ్చే రెండు,మూడు నెలల్లో ఈ విధానం అమల్లోకి వచ్చే ఆస్కారం ఉందన్నారు.మున్సిపాలిటీల పరిధిలో లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా పింఛన్ల డబ్బులను వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నదన్నారు. 95శాతం మందికి ఖాతాలు ఉంటే ఆన్లైన్లో జమ చేసే విధానం అమలు చేయాలని సర్కారు ఆలోచన చేస్తున్నట్టు వివరించారు. పింఛన్ల పంపిణీపై అన్ని స్థాయిల్లో విచారణతో పాటు సోషల్ ఆడిట్ కూడా ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. 10వరకు పింఛన్లు.. వచ్చే నెల నుంచి మండలాలు, మున్సిపాలిటీల్లో 5-10వ తేదీ వరకు పింఛన్లు పంపిణీ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందని పీడీ తెలిపారు. అర్హత ఉన్నా ఆ దారు కార్డులో వయసు తక్కువ ఉన్న వారు మెడికల్‌బోర్డు ద్వారా వయసు ధ్రువీకరణ పత్రం తీసుకొని దరఖాస్తు చేసుకుంటే పింఛన్లు వస్తుందన్నారు. స్థానిక అధికారులకు వయసు ధ్రువీకరణ చేసే అధికారం లేదన్నారు. గత ఏడాది చివరిలో కొన్ని నెలల పింఛన్ డబ్బులు యాక్సెస్ బ్యాంకు నుంచి డ్రా చేసినప్పటికీ లబ్ధిదారులకు పంపిణీ చేయని వ్యవహారంపై విచారణ జరుగుతోందన్నారు. లబ్ధిదారుల ఎంపికపై సందిగ్ధం నెలకొన్నందున అభయహస్తం పింఛన్లను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసిందన్నారు. జిల్లాలో రూ.31.34కోట్ల పింఛన్లు జిల్లాలో జనవరి నెలకు సంబంధించి 2,50,977 మందికి రూ.31.34కోట్ల పింఛన్లు మంజూరు అయ్యాయని పీడీ చెప్పారు. స్వ యం ఉపాధి కోసం నిరుద్యోగ యువతకు కంప్యూటర్స్, అకౌంటింగ్, బ్యూటీ పార్లర్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇవ్వడానికి వికారాబాద్, చిలుకూరులో శిక్షణకేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వచ్చే నెలలో తాండూరులో జాబ్‌మేళా నిర్వహిస్తామన్నారు. బ్యాంకు లింకే జీ కింద జిల్లాలో మహిళా పొదుపు సంఘాలకు రూ.248కోట్ల రుణ లక్ష్యానికి గాను రూ.201 కోట్ల రుణాల లింకేజీ జరిగిందని వివరించారు. బంట్వారం, బషీరాబాద్ మండలాల్లో రుణాల రికవరీ తక్కువగా ఉందన్నారు. సమావేశంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ సాజిద్‌అలీ పాల్గొన్నారు. -
ఆన్లైన్లో వివరాల నమోదు
జిల్లాలో మొదటిసారిగా తాండూరు మున్సిపాలిటీలో అమలు అవినీతికి కళ్లెం పడే అవకాశం తాండూరు: ఆస్తిపన్ను వసూలుకు అధికారులు సరికొత్త పంథాను ఎంచుకున్నారు. మాన్యువల్ పద్ధతికి బదులు స్పాట్ బిల్లింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకు రానున్నారు. గతంలో ఆస్తిపన్ను చెల్లించినా మళ్లీ బకాయి ఉన్నట్లు బిల్లులు రావడం, పన్ను చెల్లింపు వివరాలు రికార్డుల్లో నమోదు కాకపోవడం తదితర సమస్యలు వచ్చేవి. ఇకముందు తాండూరు మున్సిపాలిటీలో ఈ పరిస్థితి కనిపించదు. మున్సిపాలిటీలో ఆస్తిపన్ను(ప్రాపర్టీ టాక్స్) చెల్లింపునకు స్పాట్ బిల్లింగ్ విధానం అమల్లోకి రానుంది. తాండూరు, వికారాబాద్ మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను చెల్లింపుదారులు, బకాయిలు, జరిమానాలు తదితర వివరాలన్నీ ఇప్పటికే మున్సిపాలిటీ వెబ్సైట్లో నమోదయ్యాయి. ఈ రెండింటిలో కొత్త విధానాన్ని ముందుగా తాండూరులో అమలుచేయాలని అధికారులు నిర్ణయించారు. 11,013 భవనాలు.. రూ.2.40కోట్ల పన్ను తాండూరు మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 31 వార్డులు ఉన్నాయి. మున్సిపాలిటీలో మొత్తం అసెస్మెంట్ చేసిన గృహాలు, భవనాలు, ఫంక్షన్ హాళ్లు 11,013 ఉన్నాయి. ఏడాదికి సుమారు రూ.2.40 కోట్ల ఆస్తిపన్ను వసూలు కావాల్సి ఉంది. ప్రస్తుతం 8 మంది బిల్కలెక్టర్లు ఆస్తిపన్ను వసూలు చేస్తున్నారు. బిల్ కలెక్టర్లు ఇంటింటికీ తిరుగుతూ ఆస్తిపన్ను వివరాలు తెలియజేస్తూ చెల్లించిన డబ్బులకు రసీదునిస్తారు. ఈ విధానంలో అవినీతికి చోటుండటంతోపాటు వివరాలు తప్పుగా నమోదవుతుండటంతో స్పాట్ బిల్లింగ్ యంత్రాన్ని తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. కొత్త విధానం ఇలా... కొత్త విధానంలో స్పాట్ బిల్లింగ్ యంత్రంలో బిల్‌కలెక్టర్ ఇంటి నంబరు కొట్టగానే చెల్లించాల్సిన ఆస్తిపన్ను, బకాయి, జరిమానా తదితర వివరాలు వస్తాయి. వెసులుబాటును బట్టి అప్పటికప్పుడు లేదా తర్వాతైనా ఇంటి యజమానులు ఆస్తిపన్ను చెల్లించుకోవచ్చు. ఆస్తి పన్ను చెల్లించగానే అందుకు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో నమోదవుతాయి. అనుమానం ఉంటే మళ్లీ మున్సిపాలిటీ అధికారిక వెబ్సైట్లో వివరాలు చెక్‌చేసుకోవచ్చు. ఈ విధానంతో ఆస్తిపన్ను వసూలులో అవినీతికి ఆస్కారం ఉండదని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని సిద్ధిపేట, భువనగిరి మున్సిపాలిటీల్లో ఈ విధానం అమలవుతోంది. వచ్చే నెల నుంచి తాండూరులో కూడా స్పాట్ బిల్లింగ్‌ను అమలు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అందుకు సంబంధించి 8 స్పాట్ బిల్లింగ్ యంత్రాలు కొనుగోలు చేయడంతోపాటు వాటిపై బిల్కలెక్టర్లకు శిక్షణ ఇప్పించాలని అధికారులు యోచిస్తున్నారు.