కదిలిన శివారు విలీన ఫైల్..!
మున్సిపల్‌శాఖ అమోదం పోంది సచివాలయానికి చేరిన ఫైల్
ప్రస్తుత పట్టణ వైశాల్యం 5.8 చ.కి.మీ.
23.33 చ.కి.మీ. అదనం
29.19 చ.కి.మీకు పెరగనున్న వైశాల్యం
65532 నుంచి 75008కు పెరగనున్నజనాభా
మున్సిపల్‌కు త్వరలో మహర్ధశ
తాండూరు : తాండూరు పట్టణశివారులోని కాలనీలు ,గ్రామపంచాయతీలు త్వరలో విలీనం కానున్నాయి. గతేడాది తాండూరు మున్సిపల్ అధికారులు పట్టణశివారు ప్రాంతాలనువిలీనం చేసేందుకు మున్సిపల్ అధికారులు పిపించిన ఫైల్‌ను కలెక్టర్ అమోదముద్ర వేశారు. అక్కడి నుంచి మున్సిపల్ శాఖ అమోదం తెలపడంతో సచివాలయానికి చేరుకుంది. దీంతో మున్సిపాలిటీకి మహర్ధశపట్టనుంది.
విలీనంతో తీరనున్న సమస్యలు..
కనీస సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్న పట్టణ శివారు కాలనీలకు మహార్థశ పట్టనున్నది. గ్రామపంచాయతీలు,మున్సిపాలిటీల మధ్య పరిధి వివాదాలతో నిర్లక్ష్యానికి గురైన శివారు కాలనీలు అభివృద్ధి బాటపట్టనున్నాయి. సమస్యలో కాలం వెల్లదీసిన సుమారు పది వేల మంది శివారు ప్రజలు తీరనున్నాయి. ఏళ్లుగా కాగితాలకే పరిమితమైన శివారు కాలనీ విలీనానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. జిల్లా కలెక్టర్ దివ్య శివారు కాలనీల విలీనానికి ఆమోద ముద్ర వేశారు. దాంతో 14ఏళ్లుగా నిరీక్షిస్తున్న ప్రజల కల నెరవేరే రోజు అసన్నమైంది. ఈ నేపథ్యంలో తాండూరు పట్టణం కొత్త రూపును సంతరించుకోనున్నది. గతేడాది తాండూరు మున్సిపల్ అధికారులు శివారు కాలనీల విలీనంపై కలెక్టర్‌కు ప్రతిపాదనలు చేశారు. ఈ ప్రతిపాదనలు పరిశీలించిన కలెక్టర్ ఆమోదం తెలిపారు. కలెక్టర్ నుంచి మున్సిపల్‌శాఖ కమిషనర్ అండ్‌డైరెక్టర్‌కు అక్కడి నుంచి ప్రభుత్వానికి విలీన ప్రతిపాదనలు చేరుకున్నాయని మున్సిపల్ చైర్‌పర్సన్ సునితసంపత్ తెలిపారు.
విలీనం కానునున్న కాలనీ/ప్రాంతాలు
కోకట్, అంతారం, గౌతాపూర్, చెన్‌గేష్‌పూర్ గ్రామ పంచాయతీల పరిధిలోని కొంత భాగం, రసూల్‌పూర్ రెవెన్యూ విలేజ్‌తో, సాయిపూర్, మల్‌రెడ్డిపల్లి ప్రాంతాలు పూర్తిగా మున్సిపాలిటీలో విలీనం కానున్నాయి. ఆయా ప్రాంతాల్లోని ఎన్‌టీఆర్ నగర్, రాజీవ్ గృహకల్ప, ఇందిరమ్మ కాలనీ, ఆదర్శనగర్ తదితర కాలనీ ప్రజల కష్టాలు తీరనున్నాయి. ఆయా గ్రామ పంచాయతీల పరిధికి ఎలాంటి ఇబ్బంది కాకుండా మున్సిపాలిటీకి ఆనుకొని ఉన్న సదరు పంచాయతీల పరిధిలోని కొంత భాగాలను మాత్రమే విలీనం చేస్తూ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు.
అదనంగా 23.33 చదరపు కి.మీ.
ప్రస్తుతం తాండూరు మున్సిపాలిటీ పరిధి 5.82 చదరపు కి.మీ. తాజా ప్రతిపాదనల నేపథ్యంలో శివారు కాలనీలు, ప్రాంతాల విలీనంతో 23.33 చదరపు కి.మీ. అదనంగా చేరనున్నది. దాంతో మొత్తం పరిధి 29.19 చదరపు కి.మీ.కు పెరగనున్నది.
75,008కు పెరగనున్న జనాభా...
2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపాలిటీ జనాభా 65532. శివారు కాలనీల విలీనంతోఅదనంగా 9476 జనాభా చేరనున్నది. దాంతో పట్టణ జనాభా 75008కు పెరగనున్నది.
తగ్గనున్న జన సాద్రత...
ప్రస్తుతం ఒక కి.మీ.కు 11,259 జనసాద్రత ఉండగా... కి.మీ.2569కి తగ్గనున్నది.
20వేల గృహాలు..25వేల కుటుంబాలు
మున్సిపాలిటీలో 13వేల గృహాలకుగాను 18వేల కుటుంబాలు నివసిస్తున్నాయి. తాజా ప్రతిపాదనల ప్రకారం గృహాలు 20వేలకు, కుటుంబాల సంఖ్య 25వేలకు పెరగనున్నది.
తీరనున్న సమస్యలు ఇవే..
ఆయా కాలనీలను అంతర్గత రోడ్లు, మురుగు కాల్వలు, వీధి దీపాలు, చేతి పంపులు, పైప్‌లైన్‌ల మరమ్మతులు, పోలీసు,రెవెన్యూ, ఇళ్ల నిర్మాణ సమస్యలు తీరనున్నాయి. పంచాయతీలు, మున్సిపాలిటీల మధ్య పరిధి వివాదంతో ఆయా కాలనీల్లో అక్రమ నిర్మాణాలకు ఆస్కారం కలిగింది. విలీనంతో అక్రమ నిర్మాణాలు తగ్గి, మున్సిపాలిటీకి ఆదాయం సమకూరనున్నది. ముఖ్యంగా విలీనంతో ఇందిరమ్మ,ఆర్‌జీకే కాలనీలు అర్భన్ ఠాణా పరిధిలోకి రానుండటంతో భద్రత సమస్య తీరనున్నది.
ప్రభుత్వఅమోదిస్తేఅన్నివిధాలమేలు..
పట్టణ శివారు ప్రాంతాల విలీనం చేసేందుకు ఫైల్‌ప్రభుత్వానికి చేరుకుంది. తాండూరు మున్సిపాలిటీకి ఆదాయంతోపాటు ప్రజలకు మేలుచేకూరుతుంది మంత్రి చొరవ తీసుకుంటే వెంటనే అమోదం పోందుతుంది. పట్టణ శివారుప్రాంతాలు భివృద్దిచెందుతాయి.
సునితసంపత్, చైర్‌పర్సన్, తాండూరు మున్సిపాలిటీ