టీఎంసీలో చేరిన బీజేపీ ఎమ్మెల్యే తన్మయ్ ఘెష్
కోల్కతా: భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో ప్రతీకార రాజకీయాలు చేస్తోందని బీజేపీకి గుడ్ బై చెప్పి టీఎంసీలో చేరిన ఎమ్మెల్యే తన్మయ్ ఘోష్ విమర్శించారు. తృణముల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, విద్యాశాఖ మంత్రి బ్రత్యాబసు ఆధ్వర్యంలో టీఎంసీలో చేరిన తన్మయ్ ఘోష్.. బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ రాష్ట్రంలో నియంతృత్వ చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. బెంగాలీ ప్రజల హక్కులను బీజేపీ కాలరాస్తోందంటూ ధ్వజమెత్తారు. బీజేపీ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తోందని ఆరోపించారు.
తన్మయ్ ఘోష్ బంకురాజిల్లాలోని బిష్ణూపూర్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కాగా, పట్టణానికి బీజేపీ యూత్ అధ్యక్షుడిగా పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజీపీ నుంచి టీఎంసీలోకి వలసలు కొనసాగుతున్నాయని ఘోష్ అన్నారు. కాగా, ఇప్పటికే మరికొంత మంది బీజేపీ పార్టీ నిర్ణయాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఘెష్ అన్నారు. మమతా బెనర్జీ నాయకత్వంలో పనిచేయడానికి పలువురు బీజేపీ నాయకులు సుముఖంగా ఉన్నారని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని ఘెష్ పేర్కొన్నారు.
చదవండి: బీజేపీకి షాకివ్వనున్న యడియూరప్ప? బల నిరూపణకు సై