Teej utsav
-
'సేవాలాల్ మహరాజ్.. దండి మేరమా'.. జ్ఞాపకంగా తీజ్ ఉత్సవం..!
మహబూబాబాద్: ఈ తీజ్ వేడుకల్లో మొదటి రోజు తండావాసులు గుమిగూడి తండా పెద్దమనిషి ఇంటి వద్ద సాయంత్రం వేళ గోధుమలు, శనగలు, నవధాన్యాలను నానబెడతారు. రెండో రోజు నాన బెట్టిన గోధుమలను చిన్న చిన్న బుట్టల్లో (దుస్సే రు తీగతో అల్లినవి) మట్టి, సేంద్రియ ఎరువు అలికిన తర్వాత పాటలు పాడుతూ బుట్టల్లో గోధుమలు విత్తుతారు. మూడో రోజు ఉదయం మంచె(ఢాక్లో) ఏర్పాటు చేసి గోధుమ చల్లిన బుట్టలను మంచెపై పెడతారు. అనంతరం పెళ్లి కాని అమ్మాయిలు తొమ్మిది రోజులపాటు రోజూ పాటలు పాడుతూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తీజ్ బుట్టల్లో నీరు పోస్తారు. ఈ తొమ్మిది రోజుల పాటు వీరి ఆహారం ప్రత్యేకంగా ఉంటుంది. ఉప్పు, కారం, మసాలాతో తయారు చేసిన ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో భుజించరు. నియమ నిష్టలతో ఉంటూ ఆకు కూరలు, జొన్నరొట్టెలు తింటూ తీజ్‌ను (గోధు మ నారును) కాపాడుకుంటారు. తీజ్ పండుగను సేవాలాల్ మహరాజ్, దండి మేరమా దేవతనే జరిపిస్తుందని గిరిజనుల విశ్వాసం. ఏడో రోజు ఢమోళీ పూజ ఘనంగా జరుపుకుంటారు. తొక్కుడు పడని నల్లమట్టి తెచ్చి (అబ్బాయి, అమ్మాయి ప్రతిమలు) బొమ్మలు తయారు చేస్తారు. వీటిని గణగోర్ అని పిలుస్తారు. ఈ సందర్భంగా బియ్యం పిండితో చేసిన రొట్టెల్లో బెల్లం కలిపి నైవేద్యం (చూర్మో) తయారు చేస్తారు. అనంతరం డప్పు చప్పుళ్లతో ప్రతి ఇంటికి వెళ్లి చూర్మో పంచుతూ నృత్యాలు చేస్తారు. రాత్రి సమయంలో అందరూ తీజ్ మంచె దగ్గర కలుసుకొని పాటలు పాడుతూ అమ్మాయిల చేత నెయ్యి, బెల్లం అన్నం కలిపి(దప్కార్) ఇస్తారు. చివరగా గణగోర్ బొమ్మలను తీజ్ వద్ద పెట్టి పూజలు నిర్వహిస్తారు. చివరి రోజు తీజ్ నిమజ్జ న కార్యక్రమంలో భాగంగా తండావాసులందరూ కలిసి సేవాలాల్ మహరాజ్‌కు బెల్లం అన్నం (కడవో) నైవేద్యంగా పెడతారు. మేరమా యాడికి ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం వేళ మంచె ఢాక్లో పైనుంచి తీజ్ బుట్టలను అమ్మాయిలు తీసుకుని బాధాతప్త హృదయంతో తీజ్ తమను వదిలి వెళ్తోందని ఆటపాటలతో దగ్గరలోని కుంటలు, చెరువుల్లో బుట్టలను నిమజ్జనం చేస్తారు. ఈ సందర్భంగా అన్నదమ్ములు తమ అక్కాచెల్లెళ్ల కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకుంటారు. -
గిరిజన సంప్రదాయాలను కాపాడుకోవాలి
మానుకోట ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ ఘనంగా తీజ్ ఉత్సవాలు మహబూబాబాద్ : గిరిజనులు తమ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలని మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ అన్నా రు. పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్న త పాఠశాలలో ఆదివారం గిరిజనులు తీజ్ ఉత్స వాలు, బోగ్‌బండారో కార్యక్రమాన్ని చేపట్టా రు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం లో ఎంపీ సీతారాంనాయక్ ముఖ్యఅతిథిగా పా ల్గొని మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు తీజ్ ఉత్సవాలను జరుపుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ మాట్లాడుతూ తీజ్ పండుగ గిరిజనుల సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. సమావేశంలో మునిసిపల్ చైర్పర్సన్ డాక్టర్ భూక్య ఉమ, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెం ట్ టి.వెంకట్రాములు, టౌన్ సీఐ నందిరాంనాయక్, డాక్టర్లు వీరన్న, నెహ్రూనాయక్, నాయకు లు హట్యానాయక్, స్వామినాయక్, బోడ లక్ష్మణ్, ధారావత్ భాస్కర్, రాజేష్ నాయక్, టీఆర్ఎస్ నాయకులు మార్నేని వెంకన్న, పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు, ఆశ్ర మ పాఠశాల హెచ్ఎం భాగ్యమ్మ పాల్గొన్నారు. 16 తండాల్లో తీజ్ వేడుకలు మహబూబాబాద్ రూరల్ : మండలంలోని శని గపురంలో తీజ్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సర్పంచ్ గుగులోత్ రాజునాయక్ ఆధ్వర్యంలో 16 తండాలకు చెందిన గిరిజనులు ఒకే సారి తీజ్ వేడుకలను జరుపుకోవడంతో సందడి నెలకొంది. ఇందులో భాగంగా గ్రామ శివారులోని ఊరచెరువు వద్ద పెళ్లికాని యువతులు సంబురాలు చేసుకుని తీజ్ బుట్టల ను నిమజ్జనం చేశారు. ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, నాయకులు వెంకట్‌రెడ్డి, కుమారస్వామి, సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు ధరావత్ వెంకన్ననాయక్, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోతీలాల్‌నాయక్, ఉప సర్పంచ్ కవిత సైదులు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు గుగులోత్ రాములునాయక్, నాయకులు రాము, లింగన్న, సత్యం, వార్డు సభ్యులు పాల్గొన్నారు. వినాయకతండాలో బానోత్ శంక ర్ మేస్త్రీ ఆధ్వర్యంలో జరిగిన తీజ్ వేడుకల్లో మునిసిపల్ చైర్పర్సన్ డాక్టర్ బి.ఉమ, వార్డు కౌన్సిలర్ బానోత్ స్వాతి పాల్గొన్నారు.