telugu people
-
గతమెంతో ఘనం.. వర్తమాన ‘రాజకీయం’ శూన్యం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ దాదాపుగా అభ్యర్థులను ప్రకటించేశాయి. మహారాష్ట్రలో స్థిరపడిన తెలుగువారిని రాజకీయ పార్టీలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. తమను పార్టీ కార్యకర్తల్లా వాడుకుంటున్నారు తప్పా నాయకులుగా ఎదగనివ్వడం లేదని తెలుగువారు ఆవేదన చెందుతున్నారు.సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ ప్రధాన పార్టీలలో ఇంకా సీట్ల పంపకాలు పూర్తి కాలేదు. అయితే ముంబైతోపాటు థాణే, భివండీ, నవీముంబైలలో సుమారు 15 లక్షలకుపైగా తెలుగు ప్రజలున్నప్పటికీ ఏ పార్టీ కూడా తెలుగు అభ్యర్థికి టిక్కెట్టు ఇచ్చే అవకాశాలు కన్పించడంలేదు. దీంతో ఈ సారి కూడా అసెంబ్లీలో తెలుగువారి ప్రాతినిధ్యానికి మొండి చెయ్యి ఎదురైనట్లైంది. రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా వీటిలో అత్యధికంగా ముంబైలో 36 తర్వాత ఉమ్మడి థాణే జిల్లాలో 24 అసెంబ్లీ స్థానాలు కలిపి మొత్తం 60 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ ప్రాంతాల్లో అత్యధికంగా తెలుగు వారు నివసిస్తున్నప్పటికీ ఒక్క రాజకీయపార్టీ కూడా తెలుగువారికి అభ్యర్థిత్వమివ్వలేదు. ఇకపై ప్రకటించే అవకాశాలు కూడా కనిపించడం లేదు.ప్రయత్నలోపమే అసలు కారణం అయితే ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా ముంబై, థాణే, భివండీ, నవీముంబైలతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలుగు ప్రముఖులమని, నాయకులమని చెప్పుకునేవారెవరూ తమ తమ పార్టీల టికెట్ల కోసం ప్రయత్నించడం లేదు. తమకు అనుకూలమైన నాయకులతో చేతులు కలిపి ఎదిగేందుకు ప్రయత్నించడం లేదా ఇతర పార్టీలతో లాభమనుకుంటే వాటిలో చేరడం తప్ప టికెట్ ఇవ్వమని అడిగే ధైర్యం చేయడం లేదని స్థానిక తెలుగు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాజకీయ పార్టీలు కూడా తెలుగువారిని కార్యకర్తల్లా తప్ప నాయకులుగా చూడటం లేదని ఇక్కడున్న తెలుగువారి ఓట్ల కోసం కూడా కనీసం ఒక్క అభ్యర్థిని కూడా బరిలో దింపే ప్రయత్నం చేయడం లేదని మండిపడుతున్నారు. గత ఎన్నికల్లో నవీముంబై జిల్లా బీజేపీ అధ్యక్షుడు సీవీ రెడ్డికి పార్టీ టిక్కెట్ ఇస్తుందని అంతా భావించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ముంబై, భివండీ, నవీముంబై, థాణే మొదలగు ప్రాంతాల్లో కొందరు కొందరు ప్రముఖ తెలుగు నాయకులున్నప్పటికీ టికెట్లు లభించే అవకాశాలు కన్పించడంలేదు. ఇలా లక్షలాది మంది తెలుగు ప్రజలు నివసించే ముంబై, థాణే, భివండీ, నవీముంబైలలో తెలుగువారెవరూ రాజకీయ చర్చల్లో చోటుకల్పించుకోలేక పోతున్నారు. అయితే కార్పొరేటర్లుగా మాత్రం ముంబై, థాణేల్లో ఒక్కొక్కరు, భివండీలో ఇద్దరు మాత్రం కార్పొరేటర్ పదవుల్లో కొనసాగుతున్నారు. అయితే దశాబ్దాలుగా ఇక్కడ స్థిరపడి, సంస్కృతీ, సంప్రదాయాల్లో మమేకమైన తెలుగువారికి ఎమ్మెల్యే పదవి మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయిందని చెప్పవచ్చు. కలిసికట్టుగా సాగితే ఫలితం... తెలుగు వారంతా కలిసికట్టుగా ఉంటే కనీసం ఒక్క ఎమ్మెల్యే టికెట్‌నైనా దక్కించుకుని వారిని గెలిపించుకోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ముంబై, థాణే, నవీ ముంబైల్లో అనేక మంది విద్యావేత్తలతోపాటు వివిధ రంగాల్లో ఎంతో ఉన్నతస్థానంలో ఉన్నవారున్నారు. అనేక మందిలో సేవాభావం, సమాజసేవ చేయాలని, రాజకీయంగా ఎదగాలనే తపన కూడా ఉంది. కానీ ఐకమత్యం లేకపోవడం, అందరినీ ఏకంచేసేందుకు అనేక మంది ప్రయత్నిస్తున్నప్పటికీ అవి సఫలం కావడంలేదని కొందరి వాదన. ఈ నేపథ్యంలో కులమతాలు, ప్రాంతాల తేడాలేకుండా అందరూ కలిసికట్టుగా ముందుకు సాగితే ఫలితం లభించే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: అసెంబ్లీ ఎన్నికల వేళ.. సుప్రీంకోర్టులో శరద్ పవార్ ఎన్సీపీకి భారీ షాక్ముంబైలో ప్రస్తుతం ఒకే ఒక తెలుగు కార్పొరేటరున్నప్పటికీ రాబోయే రోజులలో తెలుగు వారు ఏకమైతే ప్రధాన పార్టీలు అనేక ప్రాంతాల్లో తెలుగు వారికి కార్పొరేటర్ పదవులిచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం లభించలేదని నిరుత్సాహ పడకుండా ఇప్పటి నుంచే కార్పొరేషన్ ఎన్నికలకు తెలుగు ప్రజలు ముఖ్యంగా తెలుగు నాయకులందరూ సిద్ధమవ్వాలి. రాష్ట్రంలో ముఖ్యంగా ముంబై థాణే జిల్లాల్లో రాజకీయంగా బలం పెంచుకునేందుకు, తెలుగు కార్పొరేటర్ల సంఖ్యను పెంచుకునేందుకు అందరూ ఐకమత్యంగా ముందుకు సాగాల్సిఉంది.ఘనచరిత్రే..ముంబైలో తెలుగు వారిది ఘనమైన చరిత్ర. ముంబై మహానగర అభివృద్ధిలో తెలుగువారిది క్రియాశీలపాత్ర. స్వాతంత్య్రానికి ముందు సుమారు 1877 నుంచి సుమారు 1950 వరకు తెలుగు వారంతా రాజకీయాలు సహా అన్ని రంగాల్లోనూ ఇక్కడ ఓ వెలుగు వెలిగారు. కానీ తరువాత మాత్రం రాజకీయంగా తమ ఉనికి కాపాడుకోలేకపోయారు. ప్రస్తుతం ముంబైలో వర్లీ, పరెల్, కామాటిపురా, కొలాబా, బాంద్రా, గోరేగావ్, బోరివలి, ఘాట్కోపర్, అంటాప్‌హిల్, వడాలా తదితర అనేక ప్రాంతాల్లో లక్షలాది మంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. అదేవిదంగా థాణే, నవీముంబై, భివండీ తదితర ప్రాంతాల్లో కూడా పెద్ద సంఖ్యలో తెలుగువారున్నారు. రాష్ట్ర అసెంబ్లీ తొలి స్పీకర్‌గా ఎన్నికైన సయాజీ శీలం తెలుగువారే. ఆయనతోపాటు అనేక మంది తెలుగువారు మేయర్, కార్పొరేటర్ సహా అనేక పదవులను చేపట్టారు. -
అమెరికాలో తెలుగు యువకుల అరెస్ట్
ఆస్టిన్: అమెరికా టెక్సాస్ స్టేట్‌లో వ్యభిచార ముఠాను అక్కడి పోలీసులు రహస్య ఆపరేషన్ నిర్వహించి.. అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 18 మంది ముఠా సభ్యుల్లో ఏడుగురు భారతీయులు ఉండగా.. అందులో ఐదుగురు తెలుగు యువకులు ఉన్నారు. బలవంతపు వ్యభిచారాన్ని కట్టడి చేసేందుకు హాయ్‌లాండ్ విలేజ్ పోలీసులు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో టెక్సాస్‌లోని డెంటన్లో ఈ ముఠా అరెస్ట్ అయ్యింది. అరెస్ట్ అయిన వారిలో నిఖిల్ బండి, మోనిష్ గల్లా, నిఖిల్ కుమ్మరి, జైకిరణ్ మేకలా, కార్తీక్ రాయపాటి తెలుగు వారిగా అక్కడి పోలీసులు గుర్తించారు. వీళ్లంతా ఉన్నత విద్య కోసమే వచ్చినట్లు నిర్ధారించారు.**PRESS RELEASE** pic.twitter.com/LnYMYNoktZ— Denton Co Sheriff (@DentonCoSheriff) August 19, 2024 -
అమెరికాలో అమ్మాయిల అక్రమ రవాణాలో నలుగురు తెలుగువాళ్ల అరెస్ట్
ట్రెంటన్: అమెరికా న్యూజెర్సీ స్టేట్‌లో హ్యుమన్ ట్రాఫికింగ్ కేసులో నలుగురు తెలుగువాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ కంపెనీలు సృష్టించి కొంతమందితో బలవంతంగా పని చేయించుకుంటున్నట్లు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో దాదాపు 100 మందికి పైగా పనిచేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. పోలీసుల సోదాల్లో ఒకే ఇంట్లో 15 మందిని గుర్తించడం గమనార్హం.ప్రిన్స్టన్ పోలీసుల వివరాల ప్రకారం.. గిన్స్బర్గ్ లేన్‌లోని ఓ ఇంట్లో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందింది. 2024 మార్చి 13న ప్రిన్స్టన్ పోలీసు సీఐడీ విభాగం సంతోష్ కట్కూరి ఇంట్లో సోదాలు జరిపింది. మొత్తం 15 మంది యువతులతో ఆయన భార్య ద్వారక పని చేయిస్తున్నట్లు తేలింది. వీరంతా బలవంతంగా పని చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. వారినుంచి ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు, ప్రింటర్లు సహా పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.తర్వాత జరిపిన దర్యాప్తులో ప్రిన్స్టన్, మెలిసా, మెకెన్సీ ప్రాంతాల్లోనూ బాధితులను గుర్తించారు. ఎలక్ట్రానిక్స్ పరికరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు.. అక్రమంగా కంపెనీలు నెలకొల్పి కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తేల్చారు. సంతోష్, ద్వారకతో పాటు చందన్ దాసిరెడ్డి, అనిల్ మాలె సైతం వీరికి సహకరించినట్లు తెలిసింది. ఈ నలుగురిపైనా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.గిన్స్బర్గ్ ప్రాంతంలో పనిచేసే ఓ శ్రామికుడు అపార్ట్మెంట్లో చాలామంది పని చేస్తుండడం గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వటంతో విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడ పనిచేసే వారిని ప్రశ్నించగా.. డాలస్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ భారత ఏజెన్సీలో నలుగురు వ్యక్తులు తమతో బలవంతంగా పని చేయించుకుంటున్నారని వెల్లడించారు. -
ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఉగాది వేడుకలు
ఫ్రాంక్ఫర్ట్ లోని తెలుగు కమ్యూనిటీలు భారతీయ సంస్కృతి సంప్రదాయాల వైభవాన్ని ప్రదర్శిస్తూ తెలుగు నూతన సంవత్సరం ఉగాది స్ఫూర్తిని సరిహద్దులు దాటించారు. తెలుగు వెలుగు జర్మనీ (టివిజి) నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగు వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారతీయ సంప్రదాయ దుస్తులలో కనిపించి ఉత్సవాలకు తెలుగు శోభను అద్దారు.స్థానిక తెలుగు వారి ప్రతిభను వెలికితీయడానికి, సంస్కృతి చైతన్యాన్ని ప్రదర్శించడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో భారత రాయబారి హరీష్ పర్వతనేని, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా బి.ఎస్. ముబారక్ పాల్గొన్నారు. దాదాపు రోజంతా జరిగిన ఉత్సవాలలో సాయంత్రం నిర్వహించిన మ్యూజికల్ ఫెస్ట్ హైలైట్‌గా నిలిచింది.ఈ సంగీతోత్సవంలో భారతదేశానికి చెందిన ప్రముఖ గాయకులు పృథ్వీ చంద్ర, మనీషా ఎరా బత్ని, ఇతిపాడ్ బ్యాండ్‌కి చెందిన సాకేత్ కొమండూరి ల సంగీత ప్రదర్శనలు ఉత్సవ హోరును శిఖరాలకు చేర్చాయి. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఫ్రాంక్ఫర్ట్ మేయర్ (బర్గర్మీస్టర్) డాక్టర్ నర్గెస్ ఎస్కందారి గ్రున్‌బర్గ్ హాజరయ్యారు. అతిథులలో.. యూరోపా యూనియన్ ఫ్రాంక్ఫర్ట్ చైర్పర్సన్, క్లాస్ క్లిప్, జవ్వాజి గ్రూప్ కంపెనీల ఛైర్మన్, జవాజి, విదేశీ మండలి సభ్యురాలు నందిని తదితరులున్నారు. -
అందరికీ మంచి జరగాలి..
-
అందరికీ మంచి జరగాలి.. సీఎం జగన్ ఉగాది శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధి నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు, విజయాలు సిద్ధించాలని సీఎం ఆకాంక్షించారు. ఈ ఏడాది సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలని అన్నారు. కొత్త సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో నా అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలు, విద్యార్థులు అందరికీ మంచి జరిగి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. — YS Jagan Mohan Reddy (@ysjagan) April 9, 2024 -
2024 ఫోర్బ్స్ జాబితాలో ఇద్దరు తెలుగు వారికి చోటు
2024వ సంవత్సరానికి ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ప్రచురించిన ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితాలో హైదరాబాద్‌కు చెందిన అంకుర సంస్థ 'నెక్స్ట్ వేవ్' స్థాపించిన శశాంక్ గుజ్జుల, అనుపమ్ పెదర్లకు చోటు దక్కింది. విద్యారంగంలో విశేష మార్పులు తీసుకువచ్చినందుకు ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఇద్దరూ తెలుగు వారే కావడం విశేషం. సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్‌కి చెందిన 'శశాంక్ గుజ్జుల' ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదివాడు. ఏలూరికి చెందిన 'అనుపమ్ పెదర్ల' ఐఐటీ ఖరగపూర్లో బి.టెక్ పూర్తి చేశాడు. ప్రఖ్యాత మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ ప్రకారం భారత దేశ ఐటీ ఇండస్ట్రీ ఈ దశాబ్దంలో మూడు రేట్లు పెరగనుంది. ఎన్నో అద్భుతమైన అవకాశాలు ఉన్నపటికీ విద్యార్థులలో పరిశ్రమకు కావలసిన నైపుణ్యాలు లేకపోవడం వలన ఉద్యోగాలు పొందడంలో ఇబ్బంది పడుతున్నారని వీరు గమనించి వీరిరువురు ఎన్నో గొప్ప ఉద్యోగావకాశాలను వదులుకుని 'రాహుల్ అత్తులూరి'తో కలిసి 'నెక్స్ట్ వేవ్' స్థాపించారు. నెక్స్ట్ వేవ్ ద్వారా యువతలో ఆధునిక 4.0 టెక్నాలజీల నైపుణ్యాలను పెంపొందిస్తూ వారికి చక్కటి ఐటీ ఉద్యోగాలు అందేలా ప్లేసెమెంట్ సపోర్ట్ కూడా అందిస్తున్నారు. కేవలం మూడు సంవత్సరాలలోనే భారత దేశ విద్య రంగంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న అంకుర సంస్థల్లో ఒకటిగా నెక్స్ట్ వేవ్ నిలిచింది. గత సంవత్సరం గ్రేటర్ పసిఫిక్ కాపిటల్ నుంచి 275 కోట్ల రూపాయల ఫండింగ్ కూడా పొందారు. అంకుర సంస్థలు మొదలుకొని అమెజాన్, గూగుల్, బ్యాంకు అఫ్ అమెరికా వంటి మల్టీ నేషనల్ కంపెనీలు వరకు 1700లకు పైగా కంపెనీలు వేలాది నెక్స్ట్ వేవ్ విద్యార్థులను ఇప్పటికే ఉద్యోగాలలో నియమించుకున్నాయి. రాబోయే రెండు సంవత్సరాలలో 10,000లకు పైగా కంపెనీలతో జత కట్టి అనేక ఉద్యోగావకాశాలు సృష్టించే లక్ష్యంతో నెక్స్ట్ వేవ్ ముందుకు సాగుతుంది. దేశం నలుమూలల నుంచి విద్యార్థులు నెక్స్ట్ వేవ్‌లో నేర్చుకుంటున్నారు. ఈ సందర్బంగా నెక్స్ట్ వేవ్ కో-ఫౌండర్ శశాంక్ గుజ్జుల మాట్లాడుతూ.. ఇది మేము వ్యక్తిగతంగా సాధించిన గుర్తింపు కాదు. గొప్ప కలలు కని వాటి కోసం స్థిరంగా ప్రతి రోజు నేర్చుకుంటున్న నెక్స్ట్ వేవ్ విద్యార్థులకు, ఎంతో మంది యువతను చక్కటి ఉద్యోగాలు సాధించేలా నిరంతరం కృషి చేస్తున్న నెక్స్ట్ వేవ్ బృందానికి దక్కిన గుర్తింపు. నెక్స్ట్ వేవ్ మొదలైనప్పటి నుంచి మా దృష్టి అంతా కూడా టెక్నాలజీ రంగంలోని ఎన్నో గొప్ప అవకాశాలకు మన యువతని సిద్ధం చేయడమే.. ఇలాంటి గుర్తింపులు మరింత ఉత్సాహాన్ని నింపుతూ, మా లక్ష్యం వైపు అడుగు మరింత వేగంగా వేయడానికి తోడ్పడుతాయని అన్నారు. నెక్స్ట్ వేవ్ కో-ఫౌండర్ మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనుపమ్ పెదర్ల మాట్లాడుతూ.. యువత మన దేశ బలం. వారందరు చక్కటి నైపుణ్యాలతో ఉంటే మన దేశం ఒక అగ్రగామిగా మారడం ఖాయం. ప్రపంచ స్థాయి టెక్నాలజీ విద్యను భారత దేశ ప్రతి మూలకు తీసుకెళ్లడమే మా లక్ష్యం. ప్రతి విద్యార్ధి ఒక వజ్రం లాంటి వారు అని మేము గట్టిగా నమ్ముతాము. వారికి సరైన మార్గదర్శనంతో తోడ్పాటు అందిస్తే అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఇది మా నెక్స్ట్ వేవ్ విద్యార్థులు అనేక సార్లు నిరూపించారు. ఫోర్బ్స్ నుంచి ఈ గుర్తింపు అనేది వేలాది యువత జీవితాల్లో నెక్స్ట్ వేవ్ తీసుకొస్తున్న మార్పుకి నిదర్శనం. -
తెలుగువారికి పెద్ద పండుగ అంటే సంక్రాంతే..!
తెలుగువారికి పెద్ద పండుగ అంటే సంక్రాంతే.రాత్రిపవలూ పండుగే. అదీ మూడు,నాలుగు రోజుల పాటు సాగుతుంది.అన్ని రకాల అభిరుచులవారికి, అన్ని వయస్సులవారికీ ఆనందాన్ని నింపే పండుగ సంక్రాంతి. నిజం చెప్పాలంటే? ఏ పండుగ శోభ చూడాలన్నా, పల్లెల్లోనే చూడాలి.మరీ ముఖ్యంగా సంక్రాంతి పల్లెసీమల పండుగ. పేరుకు మూడు రోజులైనా, ముక్కనుము వరకూ నాలుగురోజులపాటు అన్ని సీమల్లోనూ బోలెడు విందు వినోదాలు సందడి చేస్తాయి. సంక్రాంతి అంటే సంక్రమణం, అంటే మార్పు.మారడం అని అర్ధం. పల్లెటూర్లలో 'సంకురాత్తిరి' అని అంటారు.దాదాపు అన్ని మాండలీకాలలోనూ ఇదే మాట వినపడుతుంటుంది. పల్లెల్లో జీవించేవారికి,కనీసం బాల్యమైనా కొన్నేళ్లు పల్లెటూరులో గడిపినవారికి ఈ పండుగ బాగా అర్ధమవుతుంది. పట్టణాల్లో, నగరాల్లో,విదేశాల్లో జీవించేవారు సైతం పిల్లలను తీసుకొని తమ పల్లెలకు వెళ్ళడం సరదా. రవాణా సౌకర్యాలు బాగా పెరిగిన నేపథ్యంలో,ఈ సరదా ఈమధ్య బాగా పెరుగుతోంది. జనం రాకతో పల్లెలు నేడు కూడా కళకళలాడుతున్నాయి. ఇది మంచి పరిణామం. సూర్యుడు... మేషం మొదలైన 12రాశులలో క్రమంగా పూర్వ రాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడం 'సంక్రాంతి'. సంవత్సరానికి 12సంక్రాంతులు ఉంటాయి. పుష్యమాసంలో,హేమంత రుతువులో చల్లగాలులు వీస్తూ, మంచు కురిసే వేళలలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చేది 'మకర సంక్రాంతి'. దీనికే అత్యంత ప్రాముఖ్యతనిచ్చి, పండుగలు జరుపుకుంటాం. సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగు పెడతాడు.తెలుగువారితో పాటు తమిళులు ఈ పండుగను బాగా జరుపుకుంటారు. భోగి,సంక్రాంతి,కనుమ, ముక్కనుమగా నాలుగురోజుల పాటు జరుపుకుంటాం. కనుమ,ముక్కనుమను మాంసాహార ప్రియులకు గొప్ప వేడుకగా నిలుస్తుంది. రైతులకు పంట చేతికొచ్చే కాలమిది. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర దొరికి, నాలుగు రూపాయలు మిగిలినప్పుడే రైతుకు నిజమైన పండుగ.గిట్టుబాటు ఎట్లా ఉన్నా? పంట చేతికి వచ్చిన అనందంతోనూ రైతు పండుగ చేసుకుంటాడు. ప్రతి రైతు కుటుంబంలో అనందం నింపడం ప్రభుత్వాల బాధ్యత. అది తీరేది ఎన్నడో?? "పండుగలు అందరి ఇంటికీ వస్తాయి,కానీ,ఎందుకో మా ఇంటికి రావు!" అన్నాడు ఒక పేద కవి. ప్రతి పౌరుడు అనందంగా జీవించిన ప్రతిరోజూ పండుగే. "గరీబీ హటావో " అనే నినాదాన్ని ఎన్నో ఏళ్ళ క్రితం అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వినిపించారు. ఇప్పటికీ పేదరికం తగ్గకపోగా, డబ్బున్నవాడికి -లేనివాడికి మధ్య వ్యత్యాసం బాగా పెరిగిపోయింది.ఈ పరిణామం దేశ శాంతికి,సోదరత్వానికి మంచిది కాదు. కొనుగోలు శక్తి గతంలో కంటే నేడు కొందరిలో పెరిగినా,దారిద్ర్య రేఖకు దిగువనే ఇంకా చాలామంది వున్నారు. అందరి వైభవమే దేశ వైభవం. అది ఇప్పటికైనా గుర్తెరిగి పాలకులు నడుచుకోవాలి. ఈ పండుగ వేళల్లో నిత్యావసర ధరలు 50శాతం పెరిగాయనే వార్తలు వస్తున్నాయి.పేదవాడు, దిగువ,మధ్యతరగతి వాళ్లు పండుగ ఎట్లా జరుపుకుంటారు?సొంతఊర్లకు వెళ్లాలంటే బస్సులు, విమానాల టిక్కెట్ల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ప్రతి పండుగ సమయాల్లో ఇదే తీరు నడుస్తోంది. ఏలినవారు శుభాకాంక్షలు చెప్పడం కాదు,ఈ ధరలను నియంత్రణ చెయ్యాలి.ఈ చీకటి కోణాలు పక్కన పెట్టి,పండుగ వెలుగుల్లోకి వెళదాం. పల్లెసీమల్లో బుడబుక్కలవాళ్లు, పగటి వేషధారులు,వివిధ రూపాల్లో జానపద కళాకారులు చేసే హడావిడి అంతా ఇంతాకాదు. ముగ్గులు,గొబ్బెమ్మలతో వీధులు మెరిసిపోతూ ఉంటాయి. భోగి ముందు రోజు నుంచి రాత్రి వేళల్లో వేసే మంటల దగ్గర చలికాచుకోవడం గొప్ప అనుభూతి. రేగిపండ్ల శోభ చూచి తీరాల్సిందే. కోడి పందాలు,ఎడ్లబండ్ల పందాలు పోటాపోటీగా సాగుతాయి. కోడి పందాలకు పలనాడు ఒకప్పుడు చరిత్ర సృష్టించింది. యుద్ధాలే జరిగాయి.ఇప్పటికీ కోడి పందాలు జరుగుతూనే వున్నాయి.గోదావరి జిల్లాల్లో కొన్నేళ్ల నుంచి కోడి పందాలు బాగా పెరిగాయి.ఎద్దుల బండి పోటీలు పలనాడు,ప్రకాశం,రాయలసీమ జిల్లాల్లో ఒకప్పుడు చాలా బాగా జరిగేవి.'ఒంగోలు గిత్త 'కు ప్రపంచంలోనే ఎంతో ఖ్యాతి వచ్చింది. ఈ ఖ్యాతి తగ్గుముఖం పట్టిన కాలంలో నేడు మనం జీవిస్తున్నాం. ఉత్తరాయణ పుణ్యకాలంలో శారీరక పరిశ్రమకు, వ్యాయామానికి,ధ్యాన, యోగ సాధనకు చాలా అనువైన కాలం.ఉత్తరాయణాన్ని ఎంతో పుణ్యకాలంగా భారతీయులు భావిస్తారు.అందుకే,భీష్ముడు ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత ప్రాణాలు వదిలేశాడు. యోగ మార్గంలో ప్రాణాలను వదిలే సాధన ఇప్పటికీ ఉంది. ఇంతటి పుణ్యకాలంలో,వారి వారి శక్తి మేరకు దానధర్మాలు చేయడం చాలా మంచిది. మన భరతభూమిపై ఎన్నో ఏళ్ళ నుంచి ఈ సంస్కృతి ఉంది. కలియుగంలోని ప్రధాన ధర్మం దానం చేయడంగా పెద్దలు చెబుతారు. బొమ్మలకొలువులు, చెరుకుగడలు,పసుపుపారాణులు , తాంబూలాలు ఎటు చూచినా కనిపిస్తాయి. అరిసెలు,బొబ్బట్లు, జంతికలు,గారెలు,చక్కినాలు గురించి చెప్పక్కర్లేదు. గంగిరెద్దులు, డోలు సన్నాయిలు, డూడూ బసవన్నలు చేసే సందడి చూడాల్సిందే. తిరునామం తీర్చి, కాళ్లకు గజ్జెలు కట్టి,చేతిలో తాళం మోతలతో,హరిలో రంగ హరీ! అంటూ హరిదాసులు పాడుతూ నాట్యం చేస్తూ ఉంటే, పిల్లాజెల్లా తన్మయులైపోతారు. ఇటువంటి ఎన్నో వినోదాలు, ఆనంద దృశ్యాలు సంక్రాంతి పండుగ వేళల్లో కనువిందు, విన పసందు చేస్తాయి. జీవహింసగా భావించి కోడి పందాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఉత్తర భారతదేశంలో మకర్ సంక్రాంతి లేదా లోరీని జరుపుకుంటారు. ఆదిశంకరాచార్యుడు సంక్రాంతి నాడే సన్యాస దీక్ష తీసుకున్నారని చెబుతారు. వైష్ణవ భక్తులు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి, సంక్రాతి పండుగనాడు గోదాకళ్యాణం జరుపుకుని, వ్రతం సంపూర్ణమైనట్లుగా భావిస్తారు. అనాదిగా,పల్లెలు పునాదిగా జరుపుకుంటున్న సంక్రాంతి వేడుకలు ఆనందానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీకలు. అందరికీ భోగి, సంక్రాంతి,కనుమ శుభాకాంక్షలు. - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
సీఎం జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి అంటేనే అచ్చ తెలుగు పండుగని.. గ్రామానికి నూతన శోభను తెచ్చే పర్వదినమని.. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే రోజని ఆయన అన్నారు. అంతేకాక, పల్లెల పండుగ.. రైతుల పండుగ.. మన పాడిపంటల పండుగ, ప్రజలు తమ స్వగ్రామాలకు వెళ్లి, తమ కుటుంబ, సాంస్కృతిక మూలాలకు విలువఇచ్చే పెద్ద పండుగని ముఖ్యమంత్రి జగన్ అభివర్ణించారు. భోగి మంటలు.. రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్లు, పైరుపచ్చల కళకళలు, రైతు లోగిళ్లలో ధాన్యం రాశులు, పిండి వంటల ఘుమఘుమలు, బంధుమిత్రుల సందళ్లతో కనువిందు చేసే మనందరి పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు. పల్లెలన్నీ మళ్లీ కళకళ.. ఇక మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల్లోనే ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ, రైతుభరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్‌లు, ప్రభుత్వ బడి, ప్రభుత్వాసుపత్రిలో నాడు–నేడు, ఇంగ్లీషు మీడియం స్కూళ్లు, బ్రాడ్‌బాండ్ సదుపాయంతో డిజిటల్ లైబ్రరీలు, ఒక్క రూపాయి లంచం, వివక్ష లేకుండా ప్రజలకు రూ.2.46 లక్షల కోట్ల డీబీటీ.. ఇంటింటికీ, ప్రతి పేద సామాజికవర్గానికి చరిత్రలో ఎన్నడూలేనంతగా అందిన లబ్ధి.. ఇలా సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతో పల్లెలు మళ్లీ కళకళలాడేందుకు ఎంతగానో ఉపయోగపడ్డాయని జగన్ తెలిపారు. అలాగే.. ఇంటింటా, రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి మారుమూల పల్లెలోనూ, ప్రతి ఒక్క సామాజికవర్గంలోనూ.. నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించగలమన్న భరోసా ఇవ్వగలిగితేనే ఇంటింటా సంక్రాంతి అని నమ్ముతూ ఆచరిస్తున్న ప్రభుత్వమిదని ఆయన పేర్కొంటూ రాష్ట్ర ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. -
ఆ భరోసాతోనే ప్రతి ఇంటా సంక్రాంతి: సీఎం జగన్
గుంటూరు, సాక్షి: రాష్ట్ర ప్రజలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు శనివారం ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘సంక్రాంతి అంటేనే అచ్చ తెలుగు పండుగ. గ్రామానికి నూతన శోభను తెచ్చే పండుగ. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ. పల్లెల పండుగ.. రైతుల పండుగ.. మన పాడిపంటల పండుగ. తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్ళి, తమ కుటుంబ, సాంస్కృతిక మూలాలకు విలువనిచ్చే పెద్ద పండుగ. భోగి మంటలు.. రంగ వల్లులు.. హరిదాసుల కీర్తనలు. గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్ళు, పైరు పచ్చల కళకళలు. రైతు లోగిళ్ళలో ధాన్యం రాసులు.. పిండి వంటల ఘుమఘుమలు. బంధు మిత్రుల సందళ్ళతో కనువిందు చేసే మనందరి పండుగ సంక్రాంతి. మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల్లోనే ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ లు, గవర్నమెంటు బడి, గవర్నమెంటు ఆసుపత్రిలో నాడు-నేడు, ఇంగ్లీషు మీడియం స్కూళ్ళు, బ్రాడ్ బ్యాండ్ సదుపాయంతో అక్కడే కడుతున్న డిజిటల్ లైబ్రరీలు, ఒక్క రూపాయి కూడా లంచం, వివక్ష లేకుండా ప్రజలకు అందిన రూ. 2.46 లక్షల కోట్ల డీబీటీ... ఇంటింటికీ, ప్రతి పేద సామాజికవర్గానికి చరిత్రలో ఎన్నడూలేనంతగా అందిన లబ్ధి...ఇవన్నీ పల్లెలు మళ్ళీ కళకళలాడేందుకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇంటింటా, రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి మారుమూల పల్లెలోనూ, ప్రతి ఒక్క సామాజికవర్గంలోనూ... నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించగలం అన్న భరోసా ఇవ్వగలిగితేనే ఇంటింటా సంక్రాంతి అని నమ్ముతూ ఆచరిస్తున్న ప్రభుత్వంగా... రాష్ట్ర ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. -
మూడు వసంతాలు పూర్తి చేసుకున్న 'శ్రీ సాంస్కృతిక కళాసారథి'
సింగపూర్ లో " శ్రీ సాంస్కృతిక కళాసారథి" తృతీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 2020 జూలైలో అంకురార్పణ చేసుకున్నఈ " శ్రీ సాంస్కృతిక కళాసారథి" గత మూడు సంవత్సరాల కాలంలో వివిధ రంగాలలో 50కు పైగా విలక్షణమైన కార్యక్రమాలను నిర్వహించి తృతీయ వార్షికోత్సవ వేడుకలు అద్వితీయంగా జరుపుకుంది. ముఖ్యఅతిథిగా ఇండియా ఫౌండేషన్ అధ్యక్షులు డా. రామ్ మాధవ్, విశిష్ట అతిథిగా ప్రముఖ సినీ గేయ రచయిత, తెలుగు వేదకవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, అర్ధ శతాబ్ది సాంస్కృతికమూర్తి, వంశీ వ్యవస్థాపకులు డా వంశీ రామరాజు భారతదేశం నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ అమూల్యమైన వాక్కులతో సందేశాలను అందించారు. భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు సంస్థను, నిర్వాహకులను అభినందిస్తూ ప్రత్యేక వీడియో సందేశాన్ని పంపించారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజు, ప్రఖ్యాత సినీ రచయిత భువనచంద్ర, పంచ మహా సహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ కూడా సంస్థ కార్యక్రమాలను కార్యదక్షతను అభినందిస్తూ సందేశాలు పంపించారు. ఈ సందర్భంగా సింగపూరు తెలుగు టీవీ వారి ఆధ్వర్యంలో చిన్నారులతో సింగపూరులో నిర్వహిస్తున్న తెలుగు నీతిపద్యాల ఫోటీ ధారావాహిక మొదటి భాగాన్ని జొన్నవిత్తుల గారు వారి అమృతహస్తాల మీదుగా విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు మాట్లాడుతూ, తెలుగు భాషా, భారతీయ సంస్కృతులను నిలబెట్టాలని కంకణ ధారి అయ్యి ప్రపంచంలోని అందరు తెలుగు ప్రముఖులను కలుపుకుంటూ సింగపూరు వేదికగా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాల పరంపరను కొనసాగిస్తున్న శ్రీ సాంస్కృతిక కళాసారథి వారి బృందం అందరికీ అభినందనలు తెలియచేసారు. వారు రచించిన 'ఆవకాయ శతకము', 'కోనసీమ శతకములలోని' పద్యాలలో కొన్ని ఆలపించి శ్రోతలను ఉర్రూతలూగించారు. "మైకాష్టకం" అంటూ వారు హాస్యభరితంగా చెప్పిన మైకు గురించిన విషయాలు ఆహ్వానితులందరినీ నవ్వులతో ముంచెత్తింది. అలాగే "తెలుగోళ్ళం తెలుగోళ్ళం పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళం" అంటూ వారు స్వయంగా రచించి పాడిన పాటకు సభ మొత్తం చప్పట్లతో మారుమ్రోగిపోయింది. ముఖ్య అతిధి డా. రామ్ మాధవ్ ప్రసంగంలో ఒక మంచి దృఢ సంకల్పంతో సంస్థను స్థాపించి, సమాజానికి, భాషకు, సంస్కృతికి సేవచేయాలనే పట్టుదలతో ప్రయత్నం చేస్తున్న శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ మరో వందేళ్ళు పాటు ఇలా తెలుగులు విరజిల్లుతూ వృద్ధిచెందాలని ఆశీస్సులు అందించారు. భారతీయత తెలుగుదనము మేళవించిన ఒక మంచి సమాజాన్ని తెలుగు రాష్ట్రాలలో నిలబెట్టాలని అలా నిలబెట్టేలా కృషిచేస్తున్న ఈ శ్రీ సాంస్కృతిక కళాసారథి వంటి సంస్థలు అదే లక్ష్యంతో పనిచెయ్యడం చాలా సంతోషదాయకం అని అన్నారు. సమాజం తన కాళ్ళ మీద తాను నిలబడాలని, తనను తాను నడిపించుకోవడమే భారత ఆత్మనిర్భరత అని అదే సాహిత్యం, కళా రూపాల యొక్క లక్ష్యం కావాలని వివరించారు. కళలు, సాహిత్యం భారతీయ ఆత్మను ప్రతిబింబిస్తాయని, ప్రపంచం ముందు భారతదేశాన్ని ఉన్నతంగా నిలబెడుతుంది అని వ్యాఖ్యానించారు. "భగవంతుని అనుగ్రహంతో, పెద్దల దీవెనలతో, అందరి ప్రోత్సాహ సహకారాలతో, మూడు సంవత్సరాల మా ఈ ప్రయాణంలో మీ అందరి మన్ననలను పొందడం మా సంస్థ యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. మా ఈ తృతీయ వార్షికోత్సవ సందర్భంగా అభినందనలు తెలిపిన అతిథులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము" అని సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తెలిపారు కార్యక్రమం ఆద్యంతం ఎంతో చక్కగా జరిగింది అని, అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అత్యద్భుతంగా ఉన్నాయని పలువురు ప్రశంసించారు. 400 మంది ప్రత్యక్షముగా మరియు 1200 మందికి పైగా ఆన్లైన్ వీక్షించడం జరిగిందని నిర్వాహుకులు తెలిపారు. రాధిక మంగిపూడి సభానిర్వహణ గావించగా, శ్రీధర్ భరద్వాజ్, రాంబాబు పాతూరి, సుధాకర్ జొన్నాదుల కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో సింగపూర్ లో నివసించే కళాకారులచే కూచిపూడి కథక్ జానపద నృత్య ప్రదర్శనలు, అన్నమయ్య సంకీర్తనాలాపన, తెలుగు పద్య పఠనం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. గణేశ్న రాధాకృష్ణ, కాత్యాయని, వంశీ కృష్ణ శిష్ట్లా సాంకేతిక నిర్వహణా బాధ్యతలు అందించగా, కుమార్, మోహన్, మౌక్తిక, సునీత, రాధికా, రాజి, రేణుక మరియు ప్రసన్న తదితరులు వాలంటీర్ గా సహకారము అందించారు. జీఐఐఎస్, టింకర్ టాట్స్ మొంటోసిరి, కవ్ అండ్ ఫార్మర్ ఈగ జ్యూస్, శబ్ద కాన్సెప్ట్స్, ఎస్ఎన్ఎం డెవెలెపేర్స్, దివ్యజ్యోతి ప్రొడక్షన్స్ (భీమవరం), టెర్రాన్ స్పేస్ (హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంపెనీ), ప్రొపెనెక్స్ రాజశేఖర్ ఆర్ధిక సహకారం అందించారు. (చదవండి: ఆధ్యాత్మిక గురువు రవి శంకర్‌కు 'అరుదైన గౌరవం') -
కెనడాలో ఘనంగా నోవా మల్టీఫెస్ట్ వేడుకలు
కెనడా హాలిఫాక్స్‌లో అత్యద్భుతంగా నోవా మల్టీఫెస్ట్ వేడుకలు జరిగాయి. తెలుగు భాష అత్యున్నత వైభవం, దేశ, విదేశాలకు పరిచయం మనమంతా పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం కాదు, మేము ఎక్కడ ఉంటే అక్కడే పండుగ అంటూ మన సంస్కృతి సంప్రదాయాలను కెనడాలో చాటి చెబుతున్నారు మన భారతీయులు. ముఖ్యంగా మన తెలుగు వారు విశాల్ భరద్వాజ్ వారి టీం భ్యారి, టీనా, సెలెస్ట్ గారి ఆధ్వర్యంలో కెనడా ఎన్ఎస్ లీడర్ పార్టీ లీడర్, యార్మౌత్ ఎమ్మెల్యే జాక్ చర్చిల్, ఎన్డీపీ లీడర్ క్లాజుడై చందర్, క్లేటొన్ పార్క్ ఎమ్మెల్యే రఫా డీకోస్తాంజో ముఖ్య అతిథులుగా విచ్చేసిన నోవా మల్టీఫెస్ట్ సంబరాలు కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశారు. 8 వేల మంది ప్రజలు హాజరయ్యారు. శ్రీహరి చల్లా గారు మన దేశం / రాష్ట్రం తరఫున కార్య కలాపాలు నిర్వహించారు. శ్రీహరి గారి బృందం, ఫణి వంక గారు, శివ మారెళ్ళ గారు , చంద్రా తాడేపల్లి గారు, వెంకట్ వేలూరి గారు, శ్రీనివాస చిన్ని గారు, పృద్వి కాకూరు, క్రిష్ట్న వేణి గారు, రత్నం గారు, జయ గారు, ప్రియాంక గారు, లావణ్య గారు, శ్రీలేఖ, జనని కృష్ణ, జ్యోత్స్నా శ్రీజ , దీపీకా కర్ణం, జయశ్రీ కర్ణం, సియ శివకుమార్, రిషిన్త్ శివకుమార్, శిబి నాన్తం ఆట్రియం, రోహిత్ సాయి చల్లా పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వర్తించారు. కెనడాలో హాలిఫాక్స్ నగరంలో జరిగిన "నోవా మల్టీఫెస్ట్" సంబరాలలో మన తెలుగు వారు, ఇతర రాష్ట్రాల వారు కలిసి మన పండుగలు (ఉగాది,- తెలుగు కొత్త సంవత్సరం, కర్వా చౌత్(అట్ల తదియ), రాఖీ -రక్షాబంధన్, తెలుగు పండుగ సంక్రాంతి(ముగ్గులు, గాలిపటాలు, ధాన్యం, పాలు కలిపి వండిన నైవేద్యం); దీపావళి( దీపాల వరుస, ఆనందం, విజయం, సామరస్యానికి గుర్తుగా జరుపుకునే పండుగలు) వాటి ప్రాముఖ్యతను కెనడా వాసులకి వివరించి కన్నుల విందు చేశారు. వాతావరణం అనుకూలించక మా నోవా మల్టీఫెస్ట్ సంబరాలు ఒక్క రోజు మాత్రమే జరిగింది, ఐనా 8000 మంది వేడుకలలో పాల్గొనడం విశేషం. వివిధ భాషలు, వివిధ సంస్కృతులకు నివాసమైన కెనడా వాసులు మన పండుగలు విశేషాలను బాగా అర్థం చేసుకొని, అభినందించారు. రెండు రోజులు హోరున వర్షాలు ఈదురు గాలులు, మూడవ రోజు వాతావరణం అనుకూలించడం వలన వేడుకలు ఘనంగా జరిగాయి. కెనడా వాసులలో మన ఇండియా పండుగల ప్రాముఖ్యత గుర్తించి ఎనిమిది వేలకు పైగా పాల్గొని ఘన విజయం సాధించింది. కెనడా హెలి ఫ్యాక్స్ సుప్రజ గారు మాట్లాడుతూ "ఏ దేశమేగినా ఎందు కాలిడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని" అంటూ.. మన ప్రాచీన కళలైనటు వంటి భరతనాట్యం (జనని కృష్ణ ), కూచిపూడి (జ్యోత్స్న శ్రీజ చల్లా), కర్రసాము(శిబి నాన్తం ఆట్రియం ) జానపద నృత్యాలతో (దీపీకా కర్ణం జయశ్రీ కర్ణం) కెనడా ప్రజలను ఆశ్చర్య చకితులను చేసింది. అలాగే మన సాంప్రదాయ వస్త్రాలతో కెనడా వాసులని అలంకరించింది. వివాహ భోజనంబు వింతైన వంటకంబు అంటూ రకరకాల దేశాల వారి విందు భోజనాలు అందరూ ఆరగించారు. (చదవండి: డాలస్ నాటా కన్వెన్షన్‌లో ట్రాన్స్పోర్ట్ కీ రోల్) -
యూఎస్‌లో బియ్యం కష్టాలకు అసలు కారణం ఇదే..
ఢిల్లీ: విదేశాలకు బియ్యం ఎగుమతులపై భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. గురువారం రాత్రి తీసుకున్న ఈ నిర్ణయం.. అమెరికాలో దావానంలా పాకింది. దీంతో ఎక్కడ బియ్యం కొరత.. సంక్షోభం తలెత్తుతాయనే భయంతో బియ్యం కోసం ఎగబడిపోతున్నారు మనవాళ్లు. ఈ క్రమంలోనే అమెరికాలో మునుపెన్నడూ కనిపించని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమెరికాలో బియ్యం స్టోర్ల ముందు నో స్టాక్ బోర్డులు కనిపిస్తుండగా.. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రత్యేకించి సోనామసూరికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో భారతీయులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. అమెరికాలో బియ్యం కోసం భారతీయులు.. ఎక్కువగా తెలుగువాళ్లు ఎగబడుతున్నారు. మార్ట్ల బయట క్యూలు కడుతున్నారు. అగ్రరాజ్యంలో ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వీటికి తోడు ఎక్కడ బియ్యం సంక్షోభం వస్తుందనే భయంతో.. ఒక్కొక్కరు ఐదారు బాగ్యులకు మించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో పరిమితంగా కొనుగోలు చేయాలనే నోటీసులు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల ఇప్పటికే నో స్టాక్ బోర్డులూ కనిపిస్తున్నాయి. ఇక అదే అదనుగా.. అధిక ధరలు వసూలు చేస్తున్నారు. After Banning Rice Exports From India, Indians situation in USA to buy rice bags🥲 Those who are living in USA Immediately go to your nearby Indian Store and get some Rice Bags Before its too late🚨🚨#RiceBanInUSA pic.twitter.com/vAumv6fedv — Prabhas Fans USA🇺🇸 (@VinayDHFprabhas) July 21, 2023 భారత్ బియ్యానికే అగ్రతాంబూలం ప్రపంచంలో.. 90 శాతం బియ్యం ఆసియా నుంచే ఉత్పత్తి అవుతుండగా.. అందులో 45 శాతం వాటా భారత్‌దే. ఇక బాస్మతి బియ్యం ఉత్పత్తిలోనూ 80 శాతం భారత్‌దే ఉంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా భారత్ ఉండగా.. 2012 నుంచి అతిపెద్ద ఎగుమతిదారుగా ఉంటూ వస్తోంది. ఇక చైనా, థాయ్‌లాండ్, మెక్సికో తదితర దేశాల నుంచి బియ్యం ఎక్కువగా అమెరికా దిగుమతి చేసుకుంటుంది. అయితే.. మన బియ్యానికే అక్కడ క్రేజ్ ఎక్కువ. ఈ ప్రాధాన్యం ఇవ్వడంతోనే తాజా పరిస్థితి నెలకొంది. అందుకే నిషేధం ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది రుతు పవనాలు ఆలస్యంగా ప్రవేశించాయి. దీని వల్ల దేశంలో చాలా ప్రాంతాల్లో వరినాట్లు ఆలస్యమయ్యాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో కురిసిన వర్షాల మూలంగా చాలా చోట్ల పంట నష్టం జరిగింది. దీని వల్ల ఈ సారి దిగుబడులపై ప్రభావం ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ధరల పెరుగుదల ప్రభావం ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారి తీసుకుందని ప్రభుత్వం భావించింది. దీంతో బియ్యం ఎగుమతులపై నిషేధం విధించాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. విదేశాలకు నాన్-బాస్మతి బియ్యం ఎగమతులపై నిషేధం విధిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజీఎఫ్టీ) గురువారం నాడు నోటిఫికేషన్ జారీ చేసింది. పాక్షికంగా మరపట్టిన, పూర్తిగా మరపట్టిన, తెల్లటి బియ్యంపై ఈ నిషేధం వర్తిస్తుంది. నోటిఫిికేషన్‌కు ముందే ఓడల్లోకి బియ్యాన్ని లోడ్ చేసి ఉంటే అలాంటి వాటిని అనుమతి ఇస్తామని తెలిపింది. ఆహార భద్రత కింద కేంద్ర ప్రభుత్వం అనుమతించిన దేశాలకు మాత్రం బియ్యం ఎగుమతులు యధావిధిగా జరుగుతాయని స్పష్టం చేసింది. తద్వారా దేశీయ మార్కెట్లో బియ్యం ధరలు కొంత మేర తగ్గుతాయని కేంద్రం భావిస్తోంది. అయితే.. మన దేశం నుంచి బియ్యం ఎగుమతులను నిషేధించడం వల్ల మన దేశం నుంచి దిగుమతులు చేసుకునే దేశాల్లో వీటి ధరలు భారీగా పెరుగుతాయని కేంద్రం ముందుగానే అంచనా వేసింది. అదే ఇప్పుడు నిజమవుతోంది. -
సూడాన్‌లో చిక్కుకున్న తెలుగువారు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: అంతర్యుద్ధం కారణంగా సూడాన్‌లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని వారిని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. స్వదేశానికి రాగానే వారిని స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం సమయంలో వ్యవహరించిన మాదిరిగానే.. వీరికి విమాన టిక్కెట్లు, ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎయిర్‌పోర్టులో వారిని రిసీవ్ చేసుకుని అక్కడ నుంచి స్వస్థలాలకు చేరుకునే వరుకు కూడా వారికి అండగా నిలవాలని సీఎం ఆదేశించారు. సుడాన్లో ఇప్పటివరకూ సుమారు 56 మంది తెలుగువారు ఉన్నట్టు తెలుస్తోందని అధికారులకు సీఎంకు వివరించారు. చదవండి: సునీత అక్క స్టేట్మెంట్లో పలు అనుమానాలున్నాయి: అవినాష్‌రెడ్డి -
రామరాజ్యమే స్ఫూర్తిదాయకం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకోసం పనిచేసే ఏ ప్రభుత్వానికైనా రామరాజ్యమే స్ఫూర్తిదాయకం. ప్రతి ఇంటా సంతోషాలు నింపేలా సాగిన రాముడి పాలనే ఉత్తమ మార్గం. మాట ఇస్తే తప్పని నైజం, దానికోసం ఎన్నికష్టాలైనా ఓర్చుకునే తత్వం ఆ శ్రీరాముడి గుణం అని ట్వీట్లో పేర్కొన్నారాయన. అంతకు ముందు ఒక ప్రకటనలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే. ‘‘నైతిక, సంఘప్రవర్తనలో ఎన్నటికీ ఆదర్శం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. భద్రాద్రి, ఒంటిమిట్ట ఆలయాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా శ్రీరామనవమి పర్వదినాన్ని వేడుకగా జరుపుకోవాలన్నారు. ప్రజలందరికీ సీతారాముల అనుగ్రహం లభించాలని కోరుకుంటున్నానని సీఎం జగన్ అన్నారు. -
తెలుగు ప్రజలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉగాది శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ‘ఉగాది' పండుగ తెలుగు వారికి అత్యంత ముఖ్యమైన పండుగ. ప్రజలు ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకునే ఈ నూతన సంవత్సరం.. అందరికీ కొత్త ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని, ఉజ్వల భవిష్యత్తును తెస్తుందని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ‘‘జీవితంలోని షడ్రుచులను కలగలిపి ఉండే 'ఉగాది పచ్చడి', ఏడాది పొడవునా జీవితం మనకు అందించే అన్ని రకాల అనుభవాలకు ప్రతీకగా నిలుస్తుంది. ‘శోభకృతు’ నామ సంవత్సర ఉగాది పండుగ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు శాంతి, శ్రేయస్సు, సామరస్యం, సంతోషాన్ని కలిగిస్తుందని నేను మనస్పూర్తిగా విశ్వసిస్తున్నాను’’ అని గవర్నర్ అన్నారు. చదవండి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ -
మన్‌కీబాత్‌లో ప్రధాని మోదీ నోట తెలుగువారి ప్రస్తావన
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీ బాత్‌లో తెలుగువారి గురించి ప్రస్తావించారు. ఆదివారం 98వ మన్‌కీబాత్‌లో దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ.. భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు, క్రీడలు తదితర అంశాల గొప్పదనం, పరిరక్షణకు చేస్తున్న సేవలు ప్రశంసించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని దేశభక్తి గీతాలు, ముగ్గులు, లాలిపాటలపై దేశవ్యాప్తంగా నిర్వహించిన పోటీల విజేతలను ప్రకటించారు. దేశభక్తి గీతాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టి.విజయ దుర్గ విజేతగా ప్రకటించారు. స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్ఫూర్తితో విజయదుర్గ దేశభక్తి గీతాన్ని రచించారని పేర్కొన్నారు. ‘‘రేనాడ ప్రాంత వీరా! ఓ వీర నరసింహా! భారత స్వాతంత్య్ర పోరాటానికి అంకురానివి! అంకుశానివి! ఆంగ్లేయుల అన్యాయమైన నిరంకుశ దమనకాండను చూసి మీ రక్తం మండింది మంటలు లేచాయి! రేనాడు ప్రాంత సూర్యుడా! ఓ వీర నరసింహా!’’ అనే దేశభక్తి గీతాన్ని ఈ సందర్భంగా వినిపించారు. మరో అవార్డు గ్రహీత తెలంగాణకు చెందిన పేరిణి రాజ్‌కుమార్‌ను అభినందించారు. కాకతీయుల కాలంలో మహాదేవుడు శివుడుకి అంకితం చేసిన పేరిణి నాట్యం ఎంతో పేరొందిందని, ఆ రాజవంశ మూలాలు ఇప్పటికీ తెలంగాణతో ముడిపడి ఉన్నాయని తెలిపారు. రాజకుమార్ నాయక్ ఒడిస్సీ నాట్యంలోనూ గుర్తింపు పొందారని పేర్కొన్నారు. వి.దుర్గాదేవి అనే మహిళ కరకట్టం అనే పురాతన నృత్య విభాగంలో అవార్డు పొందారన్నారు. -
సీఎం జగన్ మహాశివరాత్రి శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాలు శివ నామస్మరణతో మార్మోగుతున్నాయి. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్దఎత్తున శివాలయాలకు పోటెత్తారు. జగాలను ఏలే జంగమ దేవుడు, తినేత్రుడు, లింగాకార రూపుడైన శివునికి ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఓం నమఃశివాయ, హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సర్వ సృష్టికీ సంకేతంగా, స్థావర జంగమ సంగమ స్వరూపంగా, లింగమయ్యగా జంగమయ్యగా, శివునిగా భవునిగా సాంబశివునిగా, అనునిత్యం కొలుచుకుంటున్న పరమ శివుని పర్వదినం శ్రీకరం శుభకరం సకల మంగళకరం. పార్వతీ పరమేశ్వరుల శుభాశీస్సులు మనందరికీ అందాలని కోరుకుంటున్నాను’’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. చదవండి: శివ నామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సర్వ సృష్టికీ సంకేతంగా, స్థావర జంగమ సంగమ స్వరూపంగా, లింగమయ్యగా జంగమయ్యగా, శివునిగా భవునిగా సాంబశివునిగా, అనునిత్యం కొలుచు కుంటున్న పరమ శివుని పర్వదినం శ్రీకరం శుభకరం సకల మంగళకరం. పార్వతీ పరమేశ్వరుల శుభాశీస్సులు మనందరికీ అందాలని కోరుకుంటున్నాను. — YS Jagan Mohan Reddy (@ysjagan) February 18, 2023 -
బోసిపోయిన భాగ్యనగరం..నిర్మానుష్యంగా మారిన రహదారులు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం ఖాళీ అయింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులు సొంతూర్లకు వెళ్లిపోయారు. వ్యక్తిగత వాహనాలు, బస్సులు, ప్రైవేట్ వాహనాలలో పయనమయ్యారు. దీంతో ఔటర్, జాతీయ రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ప్రధానంగా విజయవాడ, బెంగళూరు, వరంగల్ హైవేలలోని టోల్గేట్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. శనివారం భోగి కావటంతో గురు, శుక్రవారాల్లో నగరవాసులు పెద్ద సంఖ్యలో సొంతూర్లకు వెళ్లారు. 12, 13 తేదీలలో రెండున్నర లక్షల పైనే వాహనాలు ఆయా హైవేలలోని టోల్గేట్లను దాటాయని ట్రాఫిక్ పోలీసులు అంచనా వేశారు. 1,49,403 వాహనాలు విజయవాడ హైవేలోని పంతంగి, వరంగల్ హైవేలోని బీబీనగర్ టోల్‌ప్లాజాలను దాటివెళ్లినట్లు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇందులో 1,14,249 వాహనాలు కార్లే కావటం గమనార్హం. ఈ రెండు రోజులలో 1,24,172 వాహనాలు విజయవాడ హైవేలోనే ప్రయాణించాయని పోలీసులు తెలిపారు. అలాగే వరంగల్ వైపు నుంచి హైదరాబాద్‌కు 13,334 వాహనాలు వచ్చాయి. రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంటల మధ్య నగరవాసులు ఎక్కువగా వాహనాలలో ప్రయాణించారు. ప్రత్యేక బృందాలతో ట్రాఫిక్ క్రమబద్దీకరణ హైవేలలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధికరించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఆరీ్టసీ, జీఎంఆర్ టోల్ నిర్వహణ బృందాలతో పనిచేస్తున్నాం. మెయిన్ రోడ్లలో వెళ్తున్న వారు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. – డి.శ్రీనివాస్, డీసీపీ, రాచకొండ ట్రాఫిక్ (చదవండి: ముగ్గుల ఫోటోలు తీస్తుండగా విషాదం..ఒక్కసారిగా ఐదో అంతస్తు నుంచి..) -
తెలుగు ప్రజలకు సీఎం జగన్ సంక్రాంతి ప్రత్యేక శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా.. ‘రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మన @YSRCParty కుటుంబానికి నా ప్రత్యేక శుభాకాంక్షలు. మన పల్లెలు ధాన్యాగారాలుగా, ఇంగ్లీష్ విద్యకు నెలవుగా, ఆరోగ్యచికిత్సలకు కేంద్రంగా, మన పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేలా విప్లవాత్మక కార్యక్రమాలు అమలవుతున్నాయి. సంక్రాంతిని అవి మరింత ద్విగుణీకృతం చేస్తాయని విశ్వసిస్తున్నాను’ అని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మన @YSRCParty కుటుంబానికి నా ప్రత్యేక శుభాకాంక్షలు. — YS Jagan Mohan Reddy (@ysjagan) January 14, 2023 -
తెలుగు ప్రజలకు సీఎం వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘సంక్రాంతి పల్లెల పండుగ.. రైతుల పండుగ.. మన అక్కచెల్లెమ్మల పండుగ.. మొత్తంగా మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే అచ్చ తెలుగు పండుగ’ అని అన్నారు. భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్లు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో సంక్రాంతి శోభను తీసుకువచ్చాయని చెప్పారు. భోగి.. సంక్రాంతి.. కనుమ పండుగలను ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలని అభిలషించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ మకర సంక్రాంతి మరింత ప్రగతితో కూడిన మార్పు తీసుకురావాలని, పండుగ సంబరాలతో తెలుగు లోగిళ్లలో, ప్రతి ఇంటా ఆనందాల సిరులు వెల్లి విరియాలని ఆకాంక్షించారు. చదవండి: (మీరు కలిసొచ్చినా రాజకీయంగా మరణమే: అంబటి రాంబాబు) -
తెలుగు ప్రజలకు సీఎం జగన్ దీపావళి శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చీకటిపై ‘వెలుగు’.. చెడుపై ‘మంచి’.. అజ్ఞానంపై ‘జ్ఞానం’.. దుష్ట శక్తులపై ‘దైవశక్తి’.. సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగ ప్రజలందరి జీవితాల్లో ఆనంద కాంతులు నింపాలని ఆకాంక్షించారు. ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, దివ్వెల వెలుగులలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో విరాజిల్లాలని సీఎం అభిలషించారు. దీపావళి అంటే దీపాల వరస... దుష్ట రాక్షస శిక్షణ చేసే దైవ శక్తి, దుర్మార్గం మీద ఉగ్రతాండవం చేసే స్త్రీ శక్తి, మోగించిన విజయ దుందుభికి ప్రతీక... మనం నేడు వెలిగించే... ఆ దీపాల వరస! చీకట్లను చీల్చే వెలుగుల పండగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు! — YS Jagan Mohan Reddy (@ysjagan) October 24, 2022 -
గురువాణి: పంచెకట్టు కట్టి పై కండువాతో నడిచొస్తుంటే...
ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వస్త్రధారణ ఉంటుంది. దాన్ని చూడగానే అది ఫలానా ప్రాంతపు సంప్రదాయం అని ఠక్కున గుర్తుపట్టేస్తాం. అది ఏ ప్రాంతానిదయినా అభినందించవలసిందే. దానిపై అక్కడి వాళ్ళకు మక్కువ ఎక్కువగా ఉంటుంది. అయితే అదే సమయంలో ఇతరుల ఆచార వ్యవహారాలను కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. తమ ప్రాంతంలోని ఆచార వ్యవహారాలను, అలవాట్లను, కట్టూబొట్టూను... వీటిని జ్ఞాపకం ఉంచుకోవడం, గౌరవించడం, అనుసరించడం... ఇది మాది ...అని చెప్పుకొని పొంగిపోవడం... ఉండవలసిన లక్షణం. తెలుగువాడు ఎలా ఉంటాడు...అన్నదానికి... అల్లూరి వేంకట నరసింహరాజు గారనే ఒక కవి ఏమంటున్నాడంటే....‘‘ పంచెకట్టు కట్టి పైమీది కండువా వేసికొనిన తెలుగువేషమగును, అటుల సుందరము, శృతిపేయమైనట్టి భాషయన్న తెలుగు భాషయగును’’ అని వర్ణించాడు. పంచెకట్టు తెలుగువాడి వస్త్రధారణ. అదికూడా...కుచ్చిళ్ళు వచ్చేటట్లుగా దాని అంచు నిలువుగా నిలబడేటట్లుగా ఎడం పక్కకు పెట్టుకొని ..ఒక్కోసారి ఇంకా అందంగా కనబడడానికి అర్ధవృత్తాకారంలో కట్టుకొని, వెనక ప్రత్యేకించి కుచ్చిళ్ళతో గోచీపోసి కట్టుకుని ..అటువంటి అలంకరణతో నడుస్తుంటే ఆ వస్త్రధారణ అందమే వేరు... ఇంతకంటే అందమైన మరొక వస్త్రధారణ ఉంటుందా..అనే అనుమానం కూడా కలుగుతుంది. ఇక పంచెకట్టుతోపాటూ పైన ఉత్తరీయం.. కండువా. కనీసంలో కనీసం ఒక తువ్వాలు... అది లేనిదే తెలుగువాడు ఒకప్పుడు బయట అడుగుపెట్టేవాడు కాడు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో, సంప్రదాయ కుటుంబాల్లో, శుభాశుభాల్లో ఈ వేషధారణ తప్పనిసరిగా కనిపిస్తున్నది. నవతరం కూడా ఈ సంప్రదాయాలను గౌరవిస్తున్నది. ఈ రెంటికీ అదనంగా భాష.. తెలుగు ఎంత మధురమైన భాషంటే... దానిని చెవులతో జుర్రుకోవచ్చు.. అనేంత మధురంగా ఉంటుంది. ఈ భాష రానివాడు కూడా దానిని వింటూ మైమరిచిపోతాడు. ఇది ప్రతి తెలుగువారూ తమది అని గొప్పగా చెప్పుకొని పరవశించే సంస్కృతి. వేదం కూడా ప్రత్యేకించి ఈ రకమైన వస్త్రధారణ చాలా గొప్పది.. అంటుంది. స్వాధ్యాయచ... వేదం చదువుకోవాలన్నా, హోమం చేయాలన్నా, దానం చేయాలన్నా, భోజనం చేయాలన్నా, ఆచమనం చేయాలన్నా...ఈ అయిదింటికీ పంచెకట్టే కట్టుకోవాలి. ‘‘విగచ్ఛః అనుత్తరీయశ్చ నగ్నస్య అవస్త్రేయచ’’ అంటుంది. అంటే వెనుక గోచీ పోసి కట్టుకోకపోతే, ఉత్తరీయం వేసుకొని ఉండకపోతే వాడు నగ్నంగా ఉన్నవాడితో సమానం అంటుంది. తెరమీద రకరకాల వేషాలతో నవయవ్వనులుగా కనిపించినా.. బహిరంగంగా సభలకు వచ్చేటప్పడు ఎటువంటి భేషజాలకు పోకుండా నందరమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వర రావు, ఎస్.వి. రంగారావుగార్లలాంటి వారు, అలాగే ప్రభుత్వంలోని అత్యంత ఉన్నతస్థానాల్లో ఉన్న అధికారులు కూడా కొన్నిరకాల సభలకు, సమావేశాలకు పంచెకట్టుతోనే వచ్చేవారు. వారలా కనిపిస్తుంటే పంచెకట్టులో వెలిగిపోతుండేవారు. వై.ఎస్. రాజశేఖర రెడ్డిగారు అందంగా గోచీపోసి అంచులు ఆకర్షణీయంగా కనబడేట్టుకట్టి.. అలా వేదికలమీద, జనం మధ్యన నడిచిపోతుంటే అందరి దృష్టి వారిమీదే. వీళ్ళు పై ఉత్తరీయాన్ని కూడా తలపాగా లాగా ఎంత వేగంగా తలకు చుట్టినా అది అంత అదనపు ఆకర్షణగా నిలిచేది. అంత గొప్ప కట్టుబొట్టూ ఉన్నచోట పుట్టే అదృష్టం, అంత మధురమైన తెలుగు భాషను నోరారా మాట్లాడుకొనే అవకాశం ఇచ్చిన పరమేశ్వరుడికి కృతజ్ఞత చెప్పుకోకుండా ఎలా ఉండగలం!!! మనదైన సంస్కృతిని కొత్త తరం అందిపుచ్చుకొని మరింత వ్యాప్తిలోకి తీసుకురావాలి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
తెలుగుదనాన్ని మర్చిపోకండి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలో ఎక్కడ ఉన్నా పుట్టిన ఊరు, మట్టి వాసనలు, వంటలు వాటి గుభాళింపులు, పలకరింపులు, చదువు నేర్పిన గురువులను, పరిసరాలను మరిచిపోవద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కోరారు. సతీ సమేతంగా అమెరికా పర్యటనలో ఉన్న సీజేఐకి అమెరికా న్యూజెర్సీలోని ఎడిసన్‌లో నార్త్ అమెరికా తెలుగు ప్రతినిధులు శుక్రవారం ఆత్మీయ సన్మానం చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణ మాట్లాడారు. అమెరికా వంటి దేశాల్లో మన సంస్కృతీ సంప్రదాయాలను మరవకుండా, ఆచార వ్యవహారాలను పెద్దపీట వేస్తూ జీవితాన్ని గడపటం అందరూ గర్వించాల్సిన విషయమని ఆయన కొనియాడారు. “అమెరికాలో 2010–17 మధ్య కాలంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య 85% పెరిగింది. మిగతా ఆసియా భాషలతో పోలిస్తే తెలుగు భాష ప్రథమ స్థానంలో ఉంది’అని ఆయన తెలిపారు. తెలుగు భాషను ఎంతగా గౌరవిస్తామో, ఇతర భాషలను సైతం అదే విధంగా గౌరవించుకోవాలన్నారు. ఉద్యోగరీత్యా అవసరమైన విషయాలకు మాత్రమే భాష, సంస్కృతులను త్యాగం చేయాల్సి ఉంటుందే తప్ప, దైనందిన జీవితంలో, కుటుంబంలో రోజువారీ కార్యకలాపాల్లో మాతృభాషను వాడటం మరవొద్దని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. తెలుగులో చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చనడానికి తానే ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. మాతృభాషలో చదువుకొని న్యాయశాస్త్రంలో ఈ స్థాయికి చేరుకున్నానన్నారు. దేశంలో న్యాయం ఆకాంక్షించే ప్రతీ ఒక్కరికీ సత్వర న్యాయం అందేలా అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ప్రజల అర్జీలను పరిష్కరించేందుకు తగిన సంఖ్యలో కోర్టులు, జడ్జీలనూ నియమించాల్సిన అవసరం ఉందన్నారు. -
62 ఏళ్లు పూర్తి చేసుకున్న మహారాష్ట్ర.. తొలిస్పీకర్‌గా తెలుగు వ్యక్తి
సాక్షి, ముంబై: మహారాష్ట్ర అవతరణ దినోత్సవాల కోసం సర్వం సిద్ధమైంది. మహారాష్ట్ర అవతరించి మే ఒకటవ తేదీ ఆదివారానికి 62 ఏళ్లు పూర్తి కానున్నాయి. మరోవైపు నేడు కార్మిక దినోత్సవం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవాలు సాదాసీదాగా జరిపారు. అయితే ఈసారి కరోనా నియంత్రణలోకి రావడంతో ఆంక్షలన్నీ ఎత్తివేయడంతో అవతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. హుతాత్మ చౌక్ ముఖ్యంగా మంత్రాలయంతోపాటు అనేక చారిత్రాత్మక భవనాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. అదేవిధంగా రాజకీయపార్టీలు, స్వచ్ఛంద సంస్థలు వివిధ ప్రాంతాల్లో ప్రజల కోసం వైద్యశిబిరాలు, రక్తదాన శిబిరాలు, వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా హుతాత్మ చౌక్‌ను ప్రత్యేక అలంకరణలతో ముస్తాబు చేశారు. సంయుక్త మహారాష్ట్ర కోసం అనేక మంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను అర్పించారు. వారందరి బలిదానంతో 1960 మే ఒకటవ తేదీ మహారాష్ట్ర రాష్ట్రం అవతరించింది. రాష్ట్రం అవతరించి 63వ ఏట అడుగిడుతున్న సమయంలో వివిధ రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న మహారాష్ట్ర రాష్ట్రం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం.. ఆందోళనలలో పాల్గొన్న తెలుగువారు.. సంయుక్త మహారాష్ట్ర కోసం జరిగిన పోరాటంలో అనేక మంది తెలుగు ప్రజలు కూడా కీలకపాత్ర పోషించారు. ఈ సంయుక్త మహారాష్ట్ర కోసం ఉద్యమం 1938లో ప్రారంభమైంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవతరణ అనంతరం ముఖ్యంగా 1955 నుంచి సంయుక్త మహారాష్ట్ర కోసం పోరాటం ఉధృతమైందని చెప్పవచ్చు. ముఖ్యంగా 1955 నవంబర్ 21వ తేదీన సంయుక్త మహారాష్ట్ర కోసం జరిగిన ఆందోళనలలో ముంబైలోని ఫ్లోరా ఫౌంటన్ (నేటి హుతాత్మ చౌక్) పరిసరాల్లో నాటి ముఖ్యమంత్రి మొరార్జీ దేశాయి ఆదేశాలమేరకు ఆందోళనకారులపై దారుణంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 15 మంది ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా మరో 300 మందికిపైగా ఆందోళనకారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన జరిగిన అనంతరం మహారాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. ముఖ్యంగా 1956 జనవరిలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఆందోళనలలో 90 మంది అమరులయ్యారు. వీరితోపాటు అనేకమంది బలిదానాలతో 1960 మే ఒకటవ తేదీ మహారాష్ట్ర రాష్ట్రం అవతరించింది. ఈ నేపథ్యంలో సంయుక్త మహారాష్ట్ర కోసం పోరాడి అమరులైన 105 మంది అమరవీరుల జజ్ఞాపకార్థంగా ఫ్లౌరా ఫౌంటన్ పరిసరాల్లో ‘అమరవీరుల స్మారకాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆ ఫ్లోరా ఫౌంటన్ పేరు మార్చి హుతాత్మ చౌక్‌గా నామకరణం చేశారు. అయితే సంయుక్త మహారాష్ట్ర కోసం ప్రాణాలు అర్పించిన అమరువీరులందరి కుటుంబీకుల వివరాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వద్ద నేటికి లేవని తెలుస్తోంది. మరోవైపు సంయుక్త మహారాష్ట్ర కోసం ప్రాణాలను అర్పించిన 105 మంది అమరవీరులలో ముగ్గురు తెలుగు వ్యక్తులున్నారు. వీరి పేర్లు బాలయ్య, ముత్తన్నలుగా తెలిసింది. అయితే మరో తెలుగు వ్యక్తి కూడా అమరవీరులలో ఉన్నట్టు భావిస్తున్నారు. ఈ విషయంపై మాత్రం వివరాలేవి తెలియరాలేదు. పెరిగిన జిల్లాలు.. మహారాష్ట్ర అవతరణ అనంతరం ఇప్పటి వరకు ఒకటి రెండు కాకుండా ఏకంగా 10 జిల్లాలు పెరిగాయి. రాష్ట్రం అవతరించిన సమయంలో 26 జిల్లాలున్న మహారాష్ట్ర ప్రస్తుతం 36 జిల్లాలకు చేరుకుంది. 1981 మేలో జాల్నా, సింధుదుర్గా జిల్లా అవతరించగా 1982 ఆగస్టులో లాతూరు, గడ్చిరోలి జిల్లాలు, 1990 అక్టోబర్‌లో ముంబై సబర్బన్ (ముంబై ఉపనగరం), 1998 జూలైలో వాషీం, నందుర్బార్ జిల్లాలు ఏర్పాటుకాగా చివరగా రెండేళ్ల కిందట 2014 ఆగస్టు ఒకటవ తేదీన ఠాణే జిల్లాను విభజించి పాల్ఘర్ జిల్లాను ఏర్పాటు చేశారు. ఇదే విధంగా రాబోయే రోజుల్లో మరిన్ని జిల్లాలు పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. తొలిస్పీకర్‌గా తెలుగు వ్యక్తి... సంయుక్త మహారాష్ట్ర అవతరించిన అనంతరం 1960 మే ఒకటవ తేదీ మధ్యాహ్నం నూతన మంత్రిమండలి ఏర్పాటైంది. అయితే రాష్ట్రానికి తొలిస్పీకర్ బాధ్యతలు చేపట్టే గౌరవం తెలుగు వ్యక్తి అయిన సీలం సయాజీరావ్‌కు దక్కడం విశేషంగా చెప్పుకోవచ్చు.