ఆలయాల పునర్నిర్మాణానికి రేపు సీఎం జగన్ శంకుస్థాపన
సాక్షి, విజయవాడ: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూల్చిన ఆలయాల పునర్నిర్మాణానికి రేపు(శుక్రవారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. రేపు ఉదయం 11:01 నిమిషాలకు ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. దక్షిణముఖ ఆంజనేయస్వామి, సీతమ్మవారి పాదాలు, రాహు-కేతువు, బొడ్డుబొమ్మ, గోశాల కృష్టుడి ఆలయం, కృష్ణా నది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. రూ.77 కోట్లతో ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. (చదవండి: మధ్యతరగతి ప్రజలకు ఏపీ ప్రభుత్వం కొత్త పథకం)
విజయవాడలో పునర్నిర్మాణం చేపట్టే ఆలయాలు..
♦రూ.70 లక్షలతో రాహు-కేతు ఆలయ పునర్నిర్మాణం
♦రూ.9.5 లక్షలతో సీతమ్మ పాదాలు ఆలయ పునర్నిర్మాణం
♦రూ.31.5 లక్షలతో దక్షిణాభిముఖ ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణం
♦రూ.2 కోట్లతో రాతితో శ్రీ శనీశ్వర ఆలయ పునర్నిర్మాణం
♦రూ.8 లక్షలతో బొడ్డుబొమ్మ ఆలయ పునర్నిర్మాణం
♦రూ.20 లక్షలతో శ్రీ ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణం(దుర్గగుడి మెట్ల వద్ద)
♦రూ.10 లక్షలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ దాసాంజనేయ ఆలయ పునర్నిర్మాణం
♦రూ.10 లక్షలతో వీరబాబు ఆలయం పునర్నిర్మాణం (పోలీస్ కంట్రోల్ రూం సమీపంలో)
♦రూ.20 లక్షలతో కనకదుర్గ నగర్లో శ్రీ వేణుగోపాలకృష్ణ మందిరం, గోశాల పునర్నిర్మాణం
విజయవాడ దుర్గగుడి అభివృద్ధి విస్తరణ పనులు..
♦రూ.8.5 కోట్లతో ప్రసాదంపోటు భవన పునర్నిర్మాణం
♦రూ.5.6 కోట్లతో మల్లేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం
♦రూ.2 కోట్లతో మల్లేశ్వరస్వామి ఆలయ ప్రాకారం విస్తరణ
♦రూ.23.6 కోట్లతో కేశఖండనశాల భవన నిర్మాణం
♦రూ.19.75 కోట్లతో అన్నప్రసాదం భవన నిర్మాణం
♦రూ.5.25 కోట్లతో కనకదుర్గ టోల్‌ప్లాజా నిర్మాణం
♦రూ.6.5 కోట్ల నిధులతో ఘాట్ రోడ్లో మరమ్మతులు
♦కొండచరియలు విరిగి పడకుండా మరమ్మతులు, పటిష్ట చర్యలు
♦రూ.2.75 కోట్లతో ఆలయం మొత్తం ఎనర్జీ, వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ పనులు