thai air asia offer
-
విశాఖ నుంచి బ్యాంకాక్‌కి నేరుగా ఫ్లైట్ సర్వీస్
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ నుంచి బ్యాంకాక్ వెళ్లేవారికి శుభవార్త. విశాఖపట్నం నుంచి బ్యాంకాక్‌కి నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీస్ ప్రారంభిస్తోంది థాయ్‌ల్యాండ్‌కు చెందిన విమానయాన సంస్థ థాయ్ ఎయిర్ ఏషియా. విశాఖ నుంచి బ్యాంకాక్‌కి ఫ్లైట్ సర్వీస్‌లను ప్రారంభిస్తున్నట్లు థాయ్ ఎయిర్ ఏషియా తాజాగా ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ డైరెక్ట్ సర్వీస్‌లు ఉండబోతున్నట్లు పేర్కొంది. వారంలో మూడు రోజుల పాటు ఈ సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది. ప్రతి మంగళవారం, గురువారం, శనివారం రోజుల్లో డైరెక్ట్ ఫ్లైట్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఇది కూడా చదవండి: On-time Performance: ఆన్‌టైమ్‌లో బెస్ట్.. ఆకాశ ఎయిర్ ప్రస్తుతం విశాఖ నుంచి బ్యాంకాక్‌కు నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీస్‌లు లేవు. కనెక్టింగ్ ఫ్లైట్స్ ద్వారా ప్రయాణించాల్సి ఉంది. ఇప్పుడు డైరెక్ట్ ఫ్లైట్స్ అందుబాటులోకి వస్తుండటంతో ఇక్కడి నుంచి ప్రయాణించే అంతర్జాతీయ ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
బెంగళూరు - బ్యాంకాక్.. రూ. 3,999కే టికెట్!
బ్యాంకాక్ వెళ్లడం అందరికీ ఇష్టమే. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించి, అన్నీ చూసుకుని రావాలనుకుంటారు. కానీ టికెట్ ధర చూసి కాస్త ముందూ, వెనకా ఆగుతుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు థాయ్ ఎయిర్ ఏషియా ఒక కొత్త ప్యాకేజి ప్రకటించింది. బెంగళూరు నుంచి బ్యాంకాక్ వెళ్లడానికి రూ. 3,999కే టికెట్ ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చింది. ఇది సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వస్తుంది. అది కూడా డైరెక్ట్ విమానమే. బెంగళూరు నుంచి వారానికి ఐదు విమానాలు బ్యాంకాక్ వెళ్తాయి. భారతదేశం నుంచి బ్యాంకాక్ వెళ్లడానికి చాలామంది ఉత్సాహంగా ఉంటారని, అందువల్ల తాము మంచి బిజినెస్ చేయగలమన్న ఆశాభావం ఉందని థాయ్ ఎయిర్ ఏషియా సీఈవో తస్సపన్ బిజ్లేవెల్డ్ తెలిపారు. 2014 సంవత్సరంలో భారతదేశం నుంచి థాయ్‌లాండ్‌కు మొత్తం 9.50 లక్షల మంది వెళ్తే, వాళ్లలో 1.50 లక్షల మంది బెంగళూరు నుంచే వెళ్లారు. అందుకే ఇప్పుడు ఈ ప్యాకేజికి బెంగళూరును ఎంచుకున్నారు.