క్రేజీ అప్డేట్.. : ‘టాప్‌గన్ 3’ స్టోరీ రెడీ
హాలీవుడ్ ఫిల్మ్ ‘టాప్‌గన్’ ఫ్రాంచైజీ నుంచి మూడోభాగం ‘టాప్‌గన్ 3’ సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి రెండు భాగాలు ‘టాప్‌గన్’, ‘టాప్‌గన్: మావెరిక్’ లో హీరోగా నటించిన టామ్క్రూజ్యే ‘టాప్ గన్ 3’లోనూ హీరోగా నటించనున్నారని తెలుస్తోంది.
‘‘టాప్‌గన్ 3’ బేసిక్ కథ సిద్ధంగా ఉంది. టామ్ క్రూజ్‌కు స్టోరీలైన్ చెప్పాం. ఆయన నచ్చిందని చెప్పారు. కథకు మెరుగులు దిద్దే పనిలో ఉన్నాం’’ అని ‘టాప్‌గన్’ ఫ్రాంచైజీ నిర్మాతల్లో ఒకరైన జెర్రీ బ్రూమ్ హైమర్ పేర్కొన్నారు.