అత్యధిక సంపాదన జెన్నిఫర్దే!!
హాలీవుడ్లో 2013 సంవత్సరం మొత్తమ్మీద అత్యధిక సంపాదన ఎవరిదో తెలుసా? ఆస్కార్ అవార్డు విజేత జెన్నిఫర్ లారెన్స్దేనట!! ఈ విషయంలో వివరాలేవీ బయటకు చెప్పకపోయినా అత్యధిక సంఖ్యలో థియేటర్ యజమానులు, బయ్యర్లు.. అందరూ ఆమెకే ఓట్లేశారు. ఎంత సంపాదించిందో పైకి చెబితే ఆదాయపన్ను సమస్య వస్తుందని భయపడిందో ఏమో గానీ, ఆమెను మించి ఎవరూ సొమ్ము వెనకేసుకోలేదనే అంటున్నారు.
క్విగ్లీ పబ్లిషింగ్ కంపెనీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ మధ్య కాలంలో వరుసపెట్టి విపరీతంగా సినిమాలు చేసిన జెన్నిఫర్ లారెన్స్.. రేసులో అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో శాండ్రా బుల్లక్, మూడో స్థానంలో బ్రాడ్లీ కూపర్ ఉన్నారు. 2013 సంవత్సరం మొత్తమ్మీద అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల్లో కూడా జెన్నిఫర్ లారెన్సే అగ్రపీఠం సొంతం చేసుకుంది. ఇప్పుడు కూడా ఆమె చేతిలో పలు ప్రాజెక్టులున్నాయి. ఇక అమ్మడి చేతికి డబ్బే డబ్బన్న మాట!!