కిడ్నాపైన భారతీయులు బతికున్నారో లేదో తెలియదు: సుష్మాస్వరాజ్
న్యూఢిల్లీ: 2014 జూన్ లో ఉగ్రవాద సంస్థ ఐఎస్ ఐఎస్ ఇరాక్ లో కిడ్నాప్ చేసిన 39 మంది భారతీయులు బతికున్నారో లేదో తెలియజేయడానికి ఎలాంటి ఆధారం లభించలేదని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. తమకందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం...వారింకా బతికే ఉన్నారని నమ్ముతున్నామన్నారు. వారిజాడ కోసం తీవ్రంగా గాలిస్తున్నామన్నారు. కిడ్నాప్ ఘటనను ఛేదించే విషయంలో ప్రభుత్వం శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోందని సుష్మా తెలిపారు. భారతీయులంతా గతేడాది జూన్ నెల మధ్యలో కిడ్నాపయ్యారు. కిడ్నాపైన సమయంలో భారతీయులంతా మోసుల్ లోని ఒక టర్కీకి చెందిన నిర్మాణ సంస్థలో ఉద్యోగాలు చేస్తున్నారు. కిడ్నాప్ కు గురైన వారంతా పంజాబ్ కు చెందినవారు.