ugly battle
-
నడిరోడ్డుపై కానిస్టేబుళ్ల కొట్లాట
పాట్నా: బిహార్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లు నడిరోడ్డుపై ముష్టియుద్ధానికి దిగారు. జనం చూస్తున్నారనే విషయం కూడా పట్టించుకోకుండా కొట్టుకున్నారు. బిహార్‌లో నలందకు వెళ్లే మార్గంలో నడిరోడ్డుపై ఈ ఘటన జరిగింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. లంచం విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదంతో వీడియో ప్రారంభం అవుతుంది. లంచం తీసుకున్నట్లు ఒప్పుకోవాలని ఓ కానిస్టేబుల్ మరో కానిస్టేబుల్ చొక్కా పట్టుకుని ప్రశ్నించడంతో ఘర్షణ మొదలయ్యింది. నడిరోడ్డుపైనే ఇద్దరు దాదాపు ముష్టి యుద్ధానికి దిగారు. అనంతరం ఓ కానిస్టేబుల్ పోలీసు వాహనంలో నుంచి లాఠీ తీసుకుని ఫైటింగ్‌కి దిగాడు. ఇక చుట్టుపక్కల చేరిన జనం వారిని హెచ్చరిస్తున్నా.. ఏ మాత్రం పట్టించుకోలేదు. बिहार पुलिस के जवान आपस में हिसाब-किताब करते हुए, नालंदा का वीडियो. pic.twitter.com/8KWlChndwl — Utkarsh Singh (@UtkarshSingh_) September 18, 2023 ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై ఉన్నతాధికారులు ఫైరయ్యారు. ఇద్దరు కానిస్టేబుళ్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా.. ఇద్దరు పోలీసులను విధుల నుంచి తప్పించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. सोशल मीडिया पर नालन्दा जिला अंतर्गत दो पुलिस कर्मियों के बीच विवाद का वायरल विडिओ पर पुलिस अधीक्षक, नालन्दा के द्वारा संज्ञान लेते हुए दोनों पुलिस कर्मियों को पुलिस केंद्र वापस किया गया है और जांच का आदेश दिया गया है।(1/2) . .#BiharPolice #HainTaiyaarHum #Bihar — Bihar Police (@bihar_police) September 18, 2023 ఇదీ చదవండి: తల్లిగా లాలిస్తూ.. మేయర్‌గా పాలన చేస్తూ.. -
అదో రోతపుట్టించే జగడం.. పాలన మీదే నా దృష్టి
పార్టీలో విభేదాలపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. పార్టీలో అంతర్గత కుమ్ములాట తన మనసును తీవ్రంగా బాధపెట్టిందని, ఇదో రోతపుట్టించే జగడమని అన్నారు. ఎంతో నమ్మకంతో అధికారాన్ని కట్టబెట్టిన ఢిల్లీ ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసేలా కొందరు వ్యవహరిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతానికి తాను ఢిల్లీకి సుపరిపాలన అందించే విషయాలమీదే దృష్టిపెట్టానని, అసహ్యం పుట్టేలా, వికారంగా ఉన్న ఈ కుమ్ములాటలు, పరిణామాల జోలికి తాను వెళ్లబోనని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆప్ సీనియర్ నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్రయాదవ్ కేంద్ర జాతీయ కన్వీనర్ పదవి నుంచి కేజ్రీవాల్ ను తప్పించేందుకు యత్నిస్తున్నారని విషయాలు బయటకుపొక్కడంతో వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. బుధవారం ఆప్ కార్యవర్గ సమావేశంలో అన్ని విషయాలపై ఓ ముగింపు వచ్చే అవకాశం ఉంది.