అదో రోతపుట్టించే జగడం.. పాలన మీదే నా దృష్టి | Refuse to be drawn into 'ugly battle', says Kejriwal | Sakshi
Sakshi News home page

అదో రోతపుట్టించే జగడం.. పాలన మీదే నా దృష్టి

Published Tue, Mar 3 2015 1:00 PM | Last Updated on Mon, Aug 20 2018 3:46 PM

అదో రోతపుట్టించే జగడం.. పాలన మీదే నా దృష్టి - Sakshi

అదో రోతపుట్టించే జగడం.. పాలన మీదే నా దృష్టి

పార్టీలో విభేదాలపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. పార్టీలో అంతర్గత కుమ్ములాట తన మనసును తీవ్రంగా బాధపెట్టిందని, ఇదో రోతపుట్టించే జగడమని అన్నారు. ఎంతో నమ్మకంతో అధికారాన్ని కట్టబెట్టిన ఢిల్లీ ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసేలా కొందరు వ్యవహరిస్తున్నారని చెప్పారు.

 

ప్రస్తుతానికి తాను ఢిల్లీకి సుపరిపాలన అందించే విషయాలమీదే దృష్టిపెట్టానని, అసహ్యం పుట్టేలా, వికారంగా ఉన్న ఈ కుమ్ములాటలు, పరిణామాల జోలికి తాను వెళ్లబోనని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆప్ సీనియర్ నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్రయాదవ్ కేంద్ర జాతీయ కన్వీనర్ పదవి నుంచి కేజ్రీవాల్ ను తప్పించేందుకు యత్నిస్తున్నారని విషయాలు బయటకుపొక్కడంతో వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. బుధవారం ఆప్ కార్యవర్గ సమావేశంలో అన్ని విషయాలపై ఓ ముగింపు వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement