మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తోన్న కేంద్ర సర్కార్
కేంద్రంలోని బీజేపీ సర్కార్ మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తోందని ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలీ ఉమర్ ఖాద్రి విమర్శించారు. యాదగిరిగుట్టలోని భవ్య ఫంక్షన్ హాల్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణా తరగతుల కార్యక్రమంలో మాట్లాడుతూ..కులం మతం పేరుతో విద్యార్థుల మధ్య కేంద్రం చిచ్చు పెడుతున్నదని దుయ్యబట్టారు. విద్యాహక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నదన్నారు.తెలంగాణ ప్రభుత్వం కేజీ టు పీజీ విద్యను గాలికి వదిలేసి ప్రైవేటు విద్యాసంస్థలకు కొమ్ముకాస్తున్నదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వేణు, తెలంగాణ యూనివర్సీటీల కన్వీనర్ శంకర్, తదీతరులు పాల్గొన్నారు.