vedurukuppam
-
ఉత్సవాల్లో పేల్చిన టపాసు తలపై పడి వ్యక్తి మృతి
వెదురుకుప్పం: తలపై టపాసు పేలడంతో తీవ్రగాయాలై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన బాలుపల్లెలో చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామంలో కుంటి గంగమ్మ కుంభాభింక మహోత్సవాల్లో భాగంగా 41వ రోజు మంగళవారం గ్రామస్తులు పొంగళ్లు పెట్టేందుకు సన్నద్ధం అయ్యారు. మధ్యాహ్నం ఈ సంబరాల కోసం గ్రామస్తులు బాణసంచా తీసుకొచ్చారు. గ్రామస్తుడు నారాయణరెడ్డి ఉత్సాహంగా టపాకాయలు పేల్చుతుండగా అతడిపై టపాసు పేలి తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన నారాయణరెడ్డిని తిరుపతికి 108 అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యలో మారేపల్లె వద్ద తుదిశ్వాస విడిచాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. సంబరాలు వాయిదా పడ్డాయి. -
దారికోసం ఇరువర్గాల ఘర్షణ
సాక్షి, వెదురుకుప్పం : దారికోసం ఇరువర్గాలు కత్తులతో దాడులకు పాల్పడ్డాయి. పరస్పర దాడులతో పలువురు తీవ్రంగా గాయపడి తిరుపతి రుయాలో చికిత్స పొందుతున్నారు. వెదురుకుప్పం ఎస్ఐ సుమన్ కథనం మేరకు...మండలంలోని మాంబేడు గ్రామానికి సమీపంలోని దాంట్లవారిఇండ్లకు చెందిన భాస్కర్‌రెడ్డి, హేమచంద్రారెడ్డికి కొన్నేళ్లుగా దారి విషయమై తగా దాలు ఉండేవి. అప్పుడప్పుడు ఘర్షణ పడుతున్నారు. శనివారం ఉదయం హేమచంద్రారెడ్డి, మహేష్, పురుషోత్తంరెడ్డి, శ్రావణి, కుమారి, హేమంత్‌కుమార్ కలిసి అదే గ్రామానికి చెందిన భాస్కర్‌రెడ్డి(55)కి సంబంధించిన పొలంలో ఉన్న మామిడి చెట్లను నరుకుతున్నారు. అదే సమయానికి భాస్కర్‌రెడ్డి భార్య సంపూర్ణమ్మ పాలు తీసుకెళుతండగా గమనించి, అడ్డుతగిలింది. ఆరుగురు కలిసి సంపూర్ణమ్మపై దాడికి పాల్పడ్డారు. కత్తులతో దాడి చేసి రక్తగాయం చేశారు. గమనించిన భర్త భాస్కర్‌రెడ్డి అక్కడికి చేరుకుని ప్రతిఘటించే ప్రయత్నం చేయగా అతినిపై కూడా కత్తులతో దాడి చేసి గాయపరిచారు. భాస్కర్‌రెడ్డి కుమారులతో పాటు ఆయన బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రత్యర్థులు హేమచంద్రారెడ్డి, హేమంత్‌కుమార్, పురుషోత్తంరెడ్డి, కుమారిపై దాడి చేసి రక్తగాయాలు చేశారు. ఒకరిపై ఒకరు కత్తులతో దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో గమనించిన స్థానికులు వెంటనే వెదురుకుప్పం పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ సుమన్‌తో పాటు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108లో తిరుపతి రుయాకు తరలించారు. ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు. -
‘ఆంక్షలు వెనుక ప్రభుత్వ పెద్దల స్వార్థం’
సాక్షి, చిత్తూరు : సహకార చక్కెర ఫ్యాక్టరీలపై ప్రభుత్వ తీరును ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఎండగట్టారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న ఆయన గురువారం ఇక్కడ మాట్లాడుతూ...‘ చెరుకు రైతుల కష్టాలు చూస్తుంటే బాధ కలుగుతోంది. బెల్లం తయారీపై అనవసర ఆంక్షలు వెనక ప్రభుత్వ పెద్దల స్వార్థం కనిపిస్తోంది. ప్రభుత్వ అనవసర ఆంక్షలతో రైతుల జీవితాలు ప్రయివేట్ ఫ్యాక్టరీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడ్డాయి. కాపాడాల్సిన ప్రభుత్వమే రైతు వ్యతిరేక చర్యలకు దిగడం సిగ్గుచేటు?’ అని ధ్వజమెత్తారు. రైతుల సమస్యలను ఆలకించిన వైఎస్ జగన్.. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం వచ్చాక చెరకు రైతులకు అన్నివిధాల అండగా ఉంటామని భరోసా యిచ్చారు. అంతకు ముందు జూనియర్ లెక్చరర్స్ ఇవాళ ఉదయం వెదురుకుప్పం గ్రామంలో వైఎస్ జగన్‌ను కలిశారు. 2000 సంవత్సరం నుంచి తాము కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పని చేస్తున్నామని, ఇప్పటివరకూ తమను రెగ్యులరైజేషన్ చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని వైఎస్ జగన్ ఈ సందర్భంగా వారికి హామీ యిచ్చారు. -
రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి
వెదురుకుప్పం (చిత్తూరు) : చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం చెంచుగుడి క్రాస్ వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. రామచంద్రాపురం మండలం చిట్టత్తూర్ ఆది ఆంధ్రవాడకు చెందిన ఎ. కాంతారావు వెదురుకుప్పం మండలం తిరుమలాయపల్లిలోని తన అత్తగారింటి వెళ్లాడు. మంగళవారం అక్కడి నుంచి స్కూటర్‌పై తిరుగు ప్రయాణం అయ్యాడు. చెంచుగుడి క్రాస్ వద్ద ఎదురుగా వచ్చిన టాటాఏస్ వాహనం అతన్ని ఢీకొంది. తీవ్రంగా గాయపడిన కాంతారావు అక్కడికక్కడే మృతి చెందాడు. -
చిత్తూరులో రూ. కోటిన్నర విలువైన ఎర్రచందనం పట్టివేత
చిత్తూరు జిల్లాలోని వెదరుకుప్పం వద్ద అక్రమంగా తరలిస్తున్న 8 టన్నుల ఎర్రచందనాన్ని ఈ రోజు తెల్లవారుజామున పటుకున్నట్లు అటవీశాఖ అధికారులు గురువారం ఇక్కడ వెల్లడించారు. అందుకు సంబంధించి స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నాట్లు తెలిపారు. ఇటీవల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకోవడం ఇదే ప్రధమం అని అటవీశాఖ అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ బహిరంగ మార్కెట్లో రూ. కోటిన్నర వరకు ఉంటుందని చెప్పారు. స్మగ్లర్లను పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. స్మగ్లర్లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే ఎర్రచందనాన్ని తరలించేందుకు ఉపయోగించిన వాహనాలను పోలీసు స్టేషన్‌కు తరలించి సీజ్ చేసినట్లు చెప్పారు.