One Life Lost With Firecracker In Belupalle Village Festival - Sakshi
Sakshi News home page

ఉత్సవాల్లో పేల్చిన టపాసు తలపై పడి వ్యక్తి మృతి

Published Wed, Aug 4 2021 8:37 AM | Last Updated on Wed, Aug 4 2021 4:15 PM

One Life Losed With Fire Cracker In Village Festival - Sakshi

వెదురుకుప్పం: తలపై టపాసు పేలడంతో తీవ్రగాయాలై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన బాలుపల్లెలో చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామంలో కుంటి గంగమ్మ కుంభాభింక మహోత్సవాల్లో భాగంగా 41వ రోజు మంగళవారం గ్రామస్తులు పొంగళ్లు పెట్టేందుకు సన్నద్ధం అయ్యారు. మధ్యాహ్నం ఈ సంబరాల కోసం గ్రామస్తులు బాణసంచా తీసుకొచ్చారు. గ్రామస్తుడు నారాయణరెడ్డి ఉత్సాహంగా టపాకాయలు పేల్చుతుండగా అతడిపై టపాసు పేలి తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన నారాయణరెడ్డిని తిరుపతికి 108 అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యలో మారేపల్లె వద్ద తుదిశ్వాస విడిచాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. సంబరాలు వాయిదా పడ్డాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement