ఈజీ మనీ కోసం...
ఈజీ మనీ కోసం సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే వారిని ఎలా ఎదుర్కోవాలన్న కథాంశంతో వస్తున్న చిత్రం ‘ఈజీ మనీ-లేజీ బాయ్స్’. మనోజ్నందం, షామిలీ జంటగా వెంకట్ పంపన దర్శకత్వంలో వెంకట నాగప్రసాద్ నిర్మించారు. చిత్రీకరణ పూర్తయింది. దర్శకుడు మాట్లాడుతూ -‘‘అన్ని వర్గాల ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. ఏప్రిల్ మొదటి వారంలో పాటలను, చివరివారంలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రకాశ్ పిండి, సహ నిర్మాత: శ్రీనివాస్ గాధం, సమర్పణ: శ్రీమతి మాలతి వైట్ల.