vidyut problem
-
విద్యుత్ కోతలతో ఎండుతున్న పంటలు
ఉరవకొండ : వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ నిరంతరాయంగా సరఫరా చేస్తామని గొప్పలు చెప్పిన టీడీపీ ప్రభుత్వం కనీసం 3 గంటలు కూడా సరఫరా చేయకపోవడంతో మండలవ్యాప్తంగా బోరుబావుల కింద సాగుచేసిన పంటలు ఎండిపోతున్నాయి. మండలంలోని ఇంద్రావతి, మోపిడి, రాకెట్ల, ఆమిద్యాల తదితర గ్రామాల్లో దాదాపు 200 ఎకరాల్లో అరటి, మామిడి, వేరుశనగ పంటలు ఎండుముఖం పట్టాయి. బోరుబావుల కింద వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన పంటలను కాపాడుకోలేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులకు పరిస్థితిని ఎన్నోమార్లు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఐదు గంటలైనా విద్యుత్ సరఫరా అయితే తప్ప తమ పంటలు చేతికందే పరిస్థితి లేదని వారు వాపోతున్నారు. -
బంజారాహిల్స్‌లో విద్యుత్ అంతరాయం
బంజారాహిల్స్ (హైదరాబాద్): దేవరకొండ బస్తీ ఫీడర్‌కు జరుగుతున్న మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు యూసుఫ్‌గూడ పోలీస్‌లైన్స్, యాదగిరినగర్, ఎల్.ఎన్.నగర్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, శ్రీకృష్ణానగర్, కోట్ల విజయభాస్కర్ స్టేడియం, బంజారాహిల్స్ రోడ్ నెం. 3, 4, 5, వెంగళరావునగర్ పార్కు, దేవరకొండ బస్తీ, నాగార్జున నగర్, ఎల్లారెడ్డిగూడ, అమీర్‌పేట మెయిన్‌రోడ్, సితారహోటల్, ఇమేజ్ హాస్పిటల్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుంది. అదే విధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాగర్ సోసైటీ, కమలాపురికాలనీ ఫేజ్ 3, ఆరోరా కాలనీ, సత్యసాయి నిగమాగమం, గణపతి కాంప్లెక్స్, ఎమ్మెల్యే కాలనీ, వెంకటగిరి వాటర్‌వర్క్స్ ఏరియాల్లో కరెంటు సరఫరా నిలిచిపోతుందని ఏడీఈ కె. భాస్కర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.