బాబును బావిలో పారేసిన మహిళలు
కుటుంబాలు, గ్రామాల మధ్య ఉన్న కక్షతో.. నెల రోజుల వయసున్న బాబును ఇద్దరు మహిళలు బావిలో పారేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రంగారెడ్డిపల్లి గ్రామంలో జరిగింది. పాడుబడిన మంచినీటి బావిలో ఆ బాబును పారేశారు. రెండు గ్రామాల మధ్య గొడవ ఉండటం వల్లే వాళ్లు ఆ బాబును బావిలో పారేసినట్లు తెలిసింది.
అయితే సమయానికి రంగారెడ్డిపల్లి గ్రామస్థులు గమనించి వెంటనే బాబును బావిలోంచి బయటకు తీశారు. అదే సమయంలో మహిళలకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన బాబు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడు ఎవరన్న విషయం మాత్రం ఇంకా తెలియలేదు.