నవ్వేసి ఊరుకున్న భార్య.. సారీ చెప్పాలన్న భర్త
తనపై వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుడు వినయ్ కతియార్ను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ పెద్దగా పట్టించుకోలేదు గానీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా మాత్రం వాటిని సీరియస్గా తీసుకున్నారు. కతియార్ తప్పనిసరిగా క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. ప్రియాంకను యూపీ ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్గా తాను భావించడం లేదని, ఆమెకంటే చాలామంది అందమైన మహిళలు, హీరోయిన్లు ఈసారి ప్రచారపర్వంలో ఉన్నారని కతియార్ అన్నారు. వాటిపై వాద్రా ఫేస్బుక్లో స్పందించారు. మహిళలను మనమంతా గౌరవించాలని, వారికి సమాన గౌరవం ఇవ్వాలని వాద్రా చెప్పారు. కతియార్ క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు.
అయితే అంతకుముందు దీనిపై స్పందించిన ప్రియాంకా గాంధీ మాత్రం వాటిని తేలిగ్గా తీసిపారేశారు. వాళ్లు తనను నవ్వుకునేలా చేస్తున్నారని, కతియార్ వ్యాక్యలు మహిళలపై బీజేపీ ఆలోచనా విధానాన్ని బయట పెడుతున్నాయని కామెంట్ చేశారు.
సారీ చెప్పను గాక చెప్పను..
అయితే, ఈ వ్యవహారంపై తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని బీజేపీ నాయకుడు వినయ్ కతియార్ స్పష్టం చేశారు. ఈ విషయమై మీడియా అడిగిన ప్రశ్నలన్నింటికీ ఆయన ఆ ఒక్క సమాధానం మాత్రమే చెప్పి ఊరుకున్నారు.