అండర్–16 వాలీబాల్ విజేత తాడేపల్లిగూడెం
పాలకోడేరు: జాతీయ వాలీబాల్ మాజీ క్రీడాకారుడు, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ మాజీ జాయింట్ సెక్రటరీ దెందుకూరి వరప్రసాదరాజు మెమోరియల్ పేరిట నిర్వహించిన అండర్–16 వాలీబాల్ పోటీల్లో తాడేపల్లిగూడెం జోనల్ జట్టు విజేతగా నిలిచింది. పాలకోడేరు హైసూ్కల్ క్రీడా మైదానంలో నిర్వహించిన వాలీబాల్ పోటీలు మంగళవారం ముగిశాయి. చింతలపూడి, కేఆర్‌పురం, కొయ్యలగూడెం, తణుకు, భీమవరం, జోనల్ జట్లు పాల్గొని తలపడగా తాడేపల్లిగూడెం జోనల్ జట్టు విజేతగా నిలిచింది. కేఆర్‌పురం జట్టు రన్నర్‌గా నిలిచింది. కొయ్యలగూడెం జట్టు మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ప్రతిభ కనబర్చిన జట్లకు మెమెంటోలు, ప్రశంసా పత్రాలు అందించారు. 10 మందిని క్యాంప్‌కు ఎంపిక చేశారు. అనంతరం ఏపీ సబ్ జూనియర్ కెప్టెన్, నేషనల్ వాలీబాల్ క్రీడాకారుడు గోల్డ్‌మెడలిస్ట్ సునీల్‌ను ఘనంగా సన్మానించారు. గ్రామ సర్పంచ్ గాదిరాజు చంద్రావతి, గాదిరాజు రాంబాబు, పశ్చిమగోదావరి జిల్లా ఒలింపిక్ అసోసియేష న్ కార్యదర్శి పి.నారాయణరాజు, హైసూ్కల్ ప్రధానోపాధ్యాయురాలు జి.çసుధారాణి, కొత్తపల్లి బాబు, కోచ్ జి.పవ న్ కుమార్రాజు, పీఈటీలు పాల్గొన్నారు.