waiting
-
‘అందుకు ముహూర్తం కావాలా?.. అస్సాం సర్కారుపై సుప్రీం ఆగ్రహం
న్యూఢిల్లీ: విదేశీయులుగా ప్రకటించిన వారిని రాష్ట్రం నుంచి బహిష్కరించకపోవడానికి తోడు వారిని నిర్బంధ కేంద్రాల్లో నిరవధికంగా ఉంచడంపై సుప్రీంకోర్టు అస్సాం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిని పంపేందుకు ఏదైనా ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారా అని కూడా అస్సాం ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. నిర్బంధ కేంద్రాల్లో నివసిస్తున్న 63 మందిని రెండు వారాల్లోగా వారి దేశాలకు తిరిగి పంపించాలని సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.అసోంనకు వచ్చిన వలసదారులు తమ విదేశీ చిరునామాలను వెల్లడించనందున వారి బహిష్కరణ సాధ్యం కాదన్న అస్సాం వాదనను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నిర్బంధ కేంద్రాల్లో ఉంచిన 63 మందిని రెండు వారాల్లోగా బహిష్కరించాలని అస్సాం ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశించింది. జస్టిస్ అభయ్ ఎస్. ఓకా, న్యాయమూర్తి ఉజ్వల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై స్పందిస్తూ నిర్బంధంలో ఉన్నవారు విదేశీయులని నిర్ధారించిన వెంటనే వారిని దేశం నుండి బహిష్కరించాలని పేర్కొంది.వారి చిరునామాలు తెలియవంటూ, వారి బహిష్కరణ ప్రక్రియను ప్రారంభించడానికి ఎందుకు నిరాకరించారని బెంచ్ ప్రశ్నించింది. దీనిపై ఆందోళన ఎందుకు? వారిని వారి దేశానికి తిరిగి పంపండి. రాజ్యాంగం(Constitution)లోని ఆర్టికల్ 21 ప్రకారం వారిని శాశ్వతంగా నిర్బంధ కేంద్రంలో ఉంచలేరని పేర్కొంది. అస్సాంలో విదేశీయుల కోసం అనేక నిర్బంధ కేంద్రాలు ఉన్నాయని, ఇప్పటి వరకూ ఎంత మందిని బహిష్కరించారని సుప్రీం కోర్టు అస్సాం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిర్బంధ కేంద్రాల్లో ఉంచిన 63 మందిని రెండు వారాల్లోగా బహిష్కరించడం ప్రారంభించాలని, దీనికి సమ్మతిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని అస్సాం ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. అస్సాంలో విదేశీయులుగా ప్రకటితమైన వ్యక్తుల బహిష్కరణ, నిర్బంధ కేంద్రాల్లోని సౌకర్యాలకు సంబంధించిన పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం విచారించింది.ఇది కూడా చదవండి: ఎన్కౌంటర్లో ట్విస్ట్.. కంగుతిన్న పోలీసులు -
ఎయిర్‌పోర్టులో వృద్ధ మహిళకు చేదు అనుభవం
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ వృద్ధురాలికి చేదు అనుభవం ఎదురయ్యింది. ఆమె వీల్ చైర్ కోసం మూడు గంటలకు పైగా సమయం నిరీక్షిస్తూ పలు ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది.పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న ఆ 84 ఏళ్ల వృద్ధురాలు అలయన్స్ ఎయిర్ విమానంలో జైపూర్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చింది. అక్కడ వీల్ చైర్ కోసం ఆమె మూడు గంటలకు పైగా వేచి ఉండాల్సి వచ్చింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్టున్నట్ల ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపారు. తమ విమానయాన సంస్థ ఆ వృద్ధ మహిళకు, ఆమె కుటుంబ సభ్యులకు ఇప్పటికే క్షమాపణలు చెప్పిందని పేర్కొన్నారు.అలయన్స్ ఎయిర్ కస్టమర్ కేర్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మనోహర్ తుఫ్చి మీడియాతో మాట్లాడుతూ ‘పొరపాటు జరిగింది. మేము ఈ సంఘటనను అనేక కోణాల్లో పరిశీలిస్తున్నాం. గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీ ఏఐ- సాట్స్‌తో కూడా ఈ ఉదంతంపై చర్చించాం. ఈ ఏజెన్సీ ప్రయాణికులకు వీల్చైర్లను అందిస్తుంది. తాము వృద్ధురాలి కుమారునితో ఫోన్లో మాట్లాడాం. అతనికి క్షమాపణలు చెప్పాం’ అని తెలిపారు. -
Tirumala: సర్వదర్శనానికి 12 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. సర్వదర్శనానికి 12 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(ఆదివారం) 80,532 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల్లో 29,438 తలనీలాలు సమర్పించారు. మొత్తంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.95 కోట్లుగా లెక్క తేలింది. -
IPOs in 2024: కోట్లు కురిపిస్తాయా? కొత్త ఏడాదిలో ఊరిస్తున్న ఐపీవోలు ఇవే..
ఈ ఏడాది మరికొన్ని రోజల్లో ముగిసిపోతోంది. కొత్త ఏడాది కోసం ప్రతిఒక్కరూ నూతన ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. సామాన్యులే కాదు మార్కెట్ వర్గాలు, మదుపర్లు, కంపెనీలు కొత్త సంవత్సరంపై ‘కోట్ల’ ఆశలు పెట్టుకున్నాయి. నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ, భారతీయ ప్రైమరీ మార్కెట్లు 2023లో మొత్తంగా విజయాన్ని సాధించాయి. ఐపీవోల ద్వారా సేకరించిన నిధులు 2022 సంవత్సరం కంటే తక్కువగా ఉన్నప్పటికీ, మునుపటి సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది పబ్లిక్ ఇష్యూలు ఎక్కువగానే మార్కెట్‌కి వచ్చాయి. 2023లో మొత్తంగా 57 ఇష్యూలు క్యాపిటల్ మార్కెట్లోకి ప్రవేశించాయి. అంతకుముందు ఏడాది కంటే ఇవి 40 పెరిగాయి. అయితే సేకరించిన మొత్తం నిధులు మాత్రం గతేడాది కంటే 17 శాతం తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఐపీవోలలో సేకరించిన తాజా మూలధనం వాటా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. రానున్న ఏడాదిలో రూ. 28,440 కోట్ల విలువైన ఇష్యూలు పబ్లిక్ మార్కెట్లలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎక్స్చేంజ్ డేటా, నివేదికలు, మార్కెట్ ఊహాగానాల ఆధారంగా 2024లో అత్యధికంగా ఎదురుచూస్తున్న ఐపీవోలు ఇవే.. ఓలా ఎలక్ట్రిక్ : 700 నుంచి 800 మిలియన్ డాలర్ల సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సఫలమైతే కంపెనీ విలువ 7 నుంచి 8 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ఫోన్‌పే: దేశంలో డిజిటల్ చెల్లింపుల రంగంలో అగ్రగామిగా ఉన్న ఫోన్‌పే 2024-2025లో ఐపీవో కోసం చూస్తోంది. వాల్‌మార్ట్ నుంచి 200 మిలియన్ డాలర్ల మూలధనాన్ని అందుకున్న అనంతరం దీని విలువ 12 బిలియన్ డాలర్లకు చేరింది. ఐపీవో ద్వారా 2 బిలియన్ డాలర్ల మేర నిధులు సేకరించాలని భావిస్తోంది. ఆకాష్: బైజూస్ అనుబంధ సంస్థ అయిన ఎడ్టెక్ మేజర్ 2024 మధ్య నాటికి ఐపీవోకి రావాలని యోచిస్తోంది. బైజూస్ కొన్న ఆకాష్ ఆదాయంలో మూడు రెట్లు పెరుగుదల కనిపించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.4,000 కోట్ల ఆదాయం, రూ.900 కోట్ల ఎబీటాకి చేరుకుంటుందని అంచనా. ఓయో రూమ్స్: చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఐపీవో ఇది. కంపెనీ రుణాల చెల్లింపుపై ఎక్కువగా దృష్టి పెట్టడంతో చాలా ఆలస్యమైంది. ఇప్పటికే ఐపీవో కోసం దాఖలు చేసినప్పటికీ తర్వాత తన పబ్లిక్ లిస్టింగ్ ఇష్యూ పరిమాణాన్ని దాదాపు సగానికి తగ్గించి మళ్లీ ఫైల్ చేసింది. ఫార్మ్ ఈజీ: టాటా యాజమాన్యంలోని ఈ కంపెనీ ఇటీవల రైట్స్ ఇష్యూలో రూ.3,950 కోట్లకు పైగా సమీకరించింది. ఈ పనితీరు ఇలాగే కొనసాగితే పబ్లిక్ ఇష్యూకి వస్తుందని భావిస్తున్నారు. మొబీక్విక్: డీఏఎం క్యాపిటల్ అడ్వైజర్స్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్‌తో కలిసి సుమారు 84 మిలియన్ డాలర్ల సేకరించే లక్ష్యంతో ఐపీవో వస్తోంది. గతంలోనే ఐపీవో రావాలని భావించినా ఆ ప్రణాళికలను వాయిదా వేసుకుని ఇప్పుడు 2024లో లిస్టింగ్‌కు వస్తోంది. పేయూ ఇండియా: ఇది కూడా 2024 ద్వితీయార్ధం నాటికి ఐపీవోకి సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రోసస్ యాజమాన్యంలో పేయూ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో భారతదేశ కార్యకలాపాల ద్వారా 211 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. స్విగ్గీ: ఫుడ్ డెలివరీ పరిశ్రమలో ప్రముఖ కంపెనీ అయిన స్విగ్గీ 2024లో పబ్లిక్‌కి వచ్చే అవకాశం ఉంది. 10.7 బిలియన్ డాలర్ల విలువ కలిగిన ఈ కంపెనీ పబ్లిక్ మార్కెట్లలోకి దూసుకుపోతే, జొమాటో తర్వాత అలా చేసిన రెండవ ఫుడ్ అగ్రిగేటర్ అవుతుంది. -
కేసీఆర్ కోసం చింతమడక ప్రజల పడిగాపులు
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ తాజా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కలవడానికి వెళ్లిన చింతమడక వాసులు వేచిచూడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆయన్ని కలిసేందుకు ప్రయత్నించగా.. సెక్యూరిటీ సిబ్బంది ఆపారు. దీంతో చాలా సేపు బయటే ఎదురు చూడాల్సి వచ్చింది చింతమడక వాసులు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్‌కు సంఘీభావం తెలిపేందుకు ఆయన స్వగ్రామం చింతమడక నుంచి 500 మంది.. ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కు వచ్చారు. అయితే ఫామ్ హౌజ్ చెక్ పోస్ట్ వద్ద ఉన్న భద్రతా సిబ్బంది వాళ్లను అడ్డుకున్నారు. అనుమతి లేనిదే లోపలికి పంపమని చెప్పారు. దీంతో లోపలి నుంచి అనుమతి వచ్చేంత వరకు వాళ్లు అక్కడే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు మూడు గంటల పాటు వాళ్లు ఫామ్‌హౌజ్ చెక్‌పోస్ట్ వద్ద ఆగిపోవడంతో.. ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత లోపలి నుంచి అనుమతి రావడంతో వెళ్లి కేసీఆర్‌ను కలిశారు. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసినా.. బీఆర్ఎస్ అధ్యక్ష హోదాతో పాటు తాజా మాజీ సీఎం కావడంతో ఇంకా సెక్యూరిటీ కొనసాగుతోంది. -
బాబోయ్ ఇదేం ప్రయాణం.. నావల్ల కాదు.. ఇలాగైతే కష్టమే!
బెంగుళూరు: వాహనాలను ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చిన తర్వాత లోకల్లో ఎక్కడికైనా వెళ్లాలంటే అంతకంటే మరో సౌకర్యం లేదనే స్థితికి చేరుకున్నారు నగరాల్లో నివసించేవారు. కానీ ఆ సౌకర్యంలో అసౌకర్యం కలిగితే ఎలా ఉంటుందో వివరించే ప్రయత్నం చేశాడు ఓ బెంగుళూరు వాసి. కేవలం 45 నిముషాల ప్రయాణానికి అతను 225 నిముషాలు ఎదురుచూడాల్సి వచ్చింది. అర్జెంటు పని ఏదైనా ఉండి ఏమాత్రం ఆయాస పడకుండా బయటకు వెళ్లాలంటే ఇప్పుడు బోలెడన్నీ ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వచ్చేశాయి. ఆన్లైన్లో వాహనాన్ని బుక్ చేసుకుని శరీర అలసట లేకుండానే రివ్వున గమ్యస్థానం చేరుకోవచ్చు. వాహనాన్ని బుక్ చేసుకునే సమయంలో కూడా తొందరగా వచ్చే వాహనాలనే ఎంచుకుని మరీ బుక్ చేసుకుంటాము. కానీ బెంగుళూరులో ఓ వ్యక్తికి ఈ ఆన్లైన్ సేవలో చేదు అనుభవం ఎదురైంది. ర్యాపిడోలో వాహనాన్ని బుక్ చేసుకున్న అతడు కేవలం 45 నిముషాల ప్రయాణం కోసం 225 నిముషాలు వెయిటింగ్ చేయాల్సి వచ్చింది. సాధారణంగా బెంగుళూరు ట్రాఫిక్ కథనాల గురించి మనం తరచూ వింటూనే ఉంటాము. అలాంటి బెంగుళూరు ట్రాఫిక్ లో ప్రయాణించాలంటే ఆమాత్రం సమయం వెయిటింగ్ చేయక తప్పదు మరి. దీంతో విసుగొచ్చిన ఆ యువకుడు ఈ చోద్యాన్ని నలుగురితో పంచుకోవాలన్న ఉద్దేశ్యంతో వెయిటింగ్ సమయాన్ని చూపిస్తున్న మొబైల్ స్క్రీన్ షాట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇంకేముంది కామెంట్ల రూపంలో ఈ పోస్ట్ కు విశేష స్పందన లభించింది. ఆ వెయిటింగ్ సమయంలో ఎంచక్కా ఎక్కువ నిడివి ఉన్న హాలీవుడ్ సినిమా చూసి రావచ్చంటూ కామెంట్లు చేస్తున్నారు. Rapido wait time getting out of hand. 😭 Gotta wait for more than 3.7 hours for 45 minutes travel. @peakbengaluru #rapido #Bengaluru #peakbengaluru pic.twitter.com/7xPO3cBkPz — deyalla (@deyalla_) August 1, 2023 ఇది కూడా చదవండి: అండమాన్ నికోబార్ ద్వీపంలో భూకంపం.. ఐదు రోజుల్లో రెండోసారి.. -
అయినవారి మృతదేహాల కోసం...
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగి 6 రోజులు గడిచింది. బాధితులు ఇంకా తమవారి మృతదేహాల కోసం వెదుకులాట సాగిస్తూనే ఉన్నారు. ఇంకా 100 మృతదేహాలకు శవ పంచనామా పూర్తికాలేదు. దీంతో బాధితులు భువనేశ్వర్ ఎయిమ్స్ వద్ద పడరాని పాట్లు పడుతున్నారు. పలు మృతదేహాలను గుర్తించడంలో ఇబ్బందులు తలెత్తుతుండటంతో అధికారులు వాటికి డీఎన్ఏ పరీక్షలు చేయించాల్సివస్తోంది. ఇందుకోసం డీఎన్ఏ శాంపిల్స్‌ను భువనేశ్వర్ ఎయిమ్స్ వద్ద సేకరిస్తున్నారు. ఎయిమ్స్‌తోపాటు మరో ఐదు కేంద్రాలలోనూ డీఎన్ఏ శాంపిల్స్ సేకరణ జరుగుతోంది. మీడియాతో ఒక బాధితుడు మాట్లాడుతూ తన కుమారుని మృతదేహాన్ని గుర్తుపట్టినప్పటికీ తమకు దానిని అప్పటించడం లేదని ఆరోపించారు. డీఎన్ఏ రిపోర్టు వచ్చాకనే ఇస్తామంటున్నారని తెలిపారు. తన దగ్గర ప్రస్తుతం తిండికి కూడా ఖర్చులు లేవని ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు చాలామంది బాధితులు తమ వారి డీఎన్ఏ రిపోర్టులు వచ్చాకనే మృతదేహాలను తీసుకు వెళుతున్నారు. మరికొందరైతే ఇక్కడి పరిస్థితులను చూసి, తమవారి మృతదేహాలు దొరుకుతాయనే ఆశను కూడా వదులుకున్నారు. మీడియాతో మాట్లాడిన ఒక బాధితుడు ఇప్పటివరకూ తన సోదరుని మృతదేహం లభ్యం కాలేదని, ఇక ఆశ వదులుకొని తిరిగి ఇంటికి వెళ్లిపోదామని అనుకుంటున్నానన్నాడు. ఇక్కడ వెదుకులాట సాగిస్తూ మూడు రోజులయ్యింది. అధికారులు డీఎన్ఏ ఇచ్చి వెళ్లిపొమ్మంటున్నారని తెలిపాడు. కాగా ఇప్పటి వరకూ 30 డీఎన్ఏ శాంపిల్స్ సేకరించారు. ఈ శాంపిల్స్‌ను ప్రభుత్వం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు పంపించాలనే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మృతదేహాలను కోల్డ్ రూమ్‌లలో ఉంచారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ ప్రమాదంలో మొత్తం 288 మంది మృతి చెందారు. 193 మృతదేహాలను, భువనేశ్వర్ తరలించారు. 94 మృతదేహాలను బాలాసోర్‌లో ఉంచారు. ఒక బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. భువనేశ్వర్ తరలించిన 193 మృతదేహాలలో 110 మృతదేహాలకు శవ పంచనామా పూర్తయ్యింది. ఇంకా 83 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. 200 మంది బాధితులు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటనలో దాదాపు 1000 మంది గాయపడ్డారు. చదవండి: పశ్చిమ బెంగాల్ యువకుని మృతదేహం బీహార్‌కు.. -
ఇక నో వెయిటింగ్! స్పీడ్ పెంచిన టయోటా.. ఆ వాహనాల కోసం మూడో షిఫ్ట్
న్యూఢిల్లీ: టయోటా కిర్లోస్కర్ మోటార్.. కర్నాటకలోని బెంగుళూరు వద్ద ఉన్న బిదాడి ప్లాంట్–1 ఉత్పత్తి సామర్థ్యాన్ని 30 శాతం పెంచేందుకు మూడవ షిఫ్ట్‌ను ప్రారంభించింది. ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్ వంటి ప్రసిద్ధ మోడళ్లలో వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించాలన్నది కంపెనీ భావన. ఈ యూనిట్లో మౌలిక సదుపాయాలను మెరుగు పర్చడానికి కంపెనీ రూ.90 కోట్లకుపైగా పెట్టుబడి పెట్టింది. ఇదీ చదవండి: హ్యుందాయ్, షెల్ జోడీ.. ఎలక్ట్రిక్ వాహనదారులకు వెసులుబాటు ప్లాంట్‌లో 3వ షిఫ్ట్ కోసం దాదాపు 1,500 మంది ఉద్యోగులను కొత్తగా నియమించుకుంది. ‘ఇన్నోవా క్రిస్టా, హైక్రాస్, ఫార్చ్యూనర్ వంటి మోడళ్లను ఉత్పత్తి చేసే ప్లాంట్‌లో మూడవ షిఫ్ట్‌ని ప్రారంభించాం. ఈ ఉత్పత్తులు చాలా విజయవంతం అయ్యా యి. అలాగే వీటికి వెయిటింగ్ పీరియడ్ అధికంగా ఉంది. వేచి ఉండే కాలాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం’ అని టయోటా కిర్లోస్కర్ మోటార్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ సుదీప్ ఎస్ దాల్వి తెలిపారు. -
అమెరికా వీసాకు తగ్గిన ఎదురుచూపులు
వాషింగ్టన్: అమెరికా వీసా ఇంటర్వ్యూలకు వెయిటింగ్ పీరియడ్ భారీగా తగ్గిందని ఆ దేశ విదేశాంగ శాఖ డెప్యూటీ అసిస్టెంట్ (వీసా సేవలు) జూలీ స్టఫ్ వెల్లడించారు. పర్యాటక వీసా ఇంటర్వ్యూల వెయిటింగ్ 60 శాతం తగ్గిపోయిందని పీటీఐ వార్తా సంస్థతో చెప్పారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు దౌత్య సేవలను పెంచినట్టు వివరించారు. కోవిడ్ ఆంక్షలు ఎత్తేశాక అమెరికా వీసాల కోసం భారత్ నుంచి దరఖాస్తులు వెల్లువెత్తడం తెలిసిందే. దాంతో బిజినెస్, టూరిస్ట్ వీసాల వెయిటింగ్ పిరియడ్ 2022 అక్టోబర్‌లో ఏకంగా 1,000 రోజులకు పెరిగింది. ఈ ఏడాది విద్యార్థి, ఉద్యోగి సహా అన్ని కేటగిరీల్లో 10 లక్షల వీసాలు జారీ చేయాలన్నది లక్ష్యమని స్టఫ్ చెప్పారు. ‘వందకు పైగా దౌత్య మిషన్ల ద్వారా భారతీయులకు వీసాలు జారీ చేస్తున్నాం. బ్యాంకాక్, ఫ్రాంక్ఫర్ట్, లండన్, అబూదాబీల్లోనూ దరఖాస్తులను ప్రాసెస్ చేస్తున్నాం. భారత్‌లో వీసాల జారీ ప్రక్రియ 40 శాతం పెరిగింంది. గత నెలలో గరిష్టాన్ని తాకింది. కొన్ని విభాగాల్లో ఇంటర్వ్యూలను ఎత్తేయడంతో ప్రాసెసింగ్ ప్రక్రియ వేగవంతమైంది. రెన్యువల్‌కు కోసం అమెరికాలోనే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాం. ఇది భారత టెకీలకు పెద్ద ఊరట’’ అని చెప్పారు. -
యూఎస్ వీసా: అన్నంత పని చేసిన అమెరికా, ఈ వీడియోతో దిల్ ఖుష్!
న్యూఢిల్లీ: భారతీయులకు వీసాను మరింత దగ్గరిచేసే క్రమంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీసా జారీ కోసం వేచి ఉండే సమయాన్ని గణనీయంగా తగ్గించే చర్యలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ముంబైలో వీసా కార్యకలాపాల సహాయం నిమిత్తం అమెరికా తాత్కాలిక వీసా అధికారులను నియమించింది. ఇక్కడ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కాన్సులర్ అధికారులు పనిచేస్తున్నారని, దీన్ని ఉపయోగించుకోవాలని యుఎస్ కాన్సులేట్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కీలక అధికారులు తమ సాధారణ విధులను విడిచి పెట్టి మరీ ఈ విధుల్లో చేరారని ముంబైలోని యూఎస్ కాన్సులేట్ ఒక ట్వీట్లో తెలిపింది.(StudentVisa అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు అదిరిపోయే న్యూస్!) వీసా వెయిటింగ్ సమయాన్ని తగ్గించేందుకు వీరంతా ఒక్కటయ్యారు అని ట్వీట్ చేసిది. దీనికి సంబంధించి ముంబైలో వీసా కాన్సులర్ ఆఫీసులో ఉన్న టాప్ అధికారుల బృందంతో ఒక వీడియోను షేర్ చేసింది. వాషింగ్టన్ డీసీ, జపాన్‌లోని ఒకినావా , హాంకాంగ్ నుంచి ఎంపిక చేసిన నలుగురు అధికారులను ఈ వీడియోలో చూడొచ్చు. వీసా ఇంటర్వ్యూ నిరీక్షణ సమయాన్ని తగ్గించి, అమెరికా ప్రయాణాన్ని సులభం చేయడం, భారతదేశం-యుఎస్ వ్యాపార అవకాశాలను పెంపు, కుటుంబ పునరేకీకరణ లాంటి సమస్యల పరిష్కారానికి మద్దతు వంటి బాధ్యతలను ఈ అధికారులకు అప్పగించారు. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నామని గతంలో యూఎస్ సర్కార్ ప్రకటించింది. అలాగే అమెరికాలో చదువు కోవాలనుకునే విద్యార్థులకు ఏడాది ముందుగానే వీసాకోసం దరఖాస్తు చేసుకోవచ్చని కూడా తెలిపింది. All hands on deck to reduce visa wait times! Our incredible team of consular officers have temporarily left their regular duties around the world, from @StateDept in D.C. to the @USConsulateNaha, to help out with visa operations in Mumbai. Together, we are #HereToServe. pic.twitter.com/T2MpNp8Mb5 — U.S. Consulate Mumbai (@USAndMumbai) February 28, 2023 -
అమెరికా వీసా కావాలంటే 1000 రోజులు
న్యూఢిల్లీ: రోజురోజుకీ అమెరికా వీసాల కోసం నిరీక్షణ సమయం పెరిగిపోతోంది. అమెరికా బిజినెస్ (బీ–1), టూరిస్ట్ (బీ–2) వీసాల కోసం ఎదురుచూడాల్సిన సమయంతొలిసారిగా వేయి రోజులకు చేరింది. ఇప్పటికిప్పుడు అమెరికన్ వీసా కోసం భారతీయులు దరఖాస్తు చేసుకుంటే 2025 నాటికి ఇంటర్వ్యూకి పిలుపు వస్తుందని అమెరికా విదేశాంగ శాఖ నివేదించింది. ముంబై వాసులు 999 రోజులు, హైదరాబాద్‌వాసులు 994 రోజులు, ఢిల్లీ 961 రోజులు, చెన్నై 948 రోజులు, కోల్‌కతా వాసులు 904 రోజులు ఇంటర్వ్యూ కోసం నిరీక్షించాల్సి ఉందని ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారి చెప్పారు. అత్యవసరంగా ఎవరైనా అమెరికా వెళ్లాలనుకుంటే కారణాలు చూపిస్తే అపాయింట్మెంట్ వెంటనే ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. ప్రస్తుతం అమెరికా కళాశాలల్లో అడ్మిషన్లు ఉండటంతో విద్యార్థి వీసాలు మంజూరుకు ప్రాధాన్యతనివ్వడంతో ఇతర వీసాల వెయిటింగ్ పీరియడ్ పెరిగిపోయింది. -
వారెవ్వా.. జగమొండి పుతిన్‌కే రివర్స్ పంచ్
వైరల్: అన్నిరోజులు ఒకేలా ఉండవు.. ఒక్కరి టైమే నడవదు. అలాగే ఎంతటి వాళ్లైనా.. ఏదో ఒక టైంలో అవమానంపాలు కాకతప్పదు. ఎదుటివాళ్లకు టైం రావాలంతే!. జగమొండిగా పేరున్న వ్లాదిమిర్ పుతిన్ కూడా అందుకు అతీతం ఏం కాదు. థగ్ లైఫ్, ఆటిట్యూడ్ అంటూ పుతిన్ మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే చర్చ నడుస్తుంటుంది. ఆయన అభిమానులు కూడా వాటిని విపరీతంగా షేర్ చేస్తుంటారు. అలాంటిది పుతిన్‌కే ఇబ్బందికర పరిస్థితి ఎదురైతే ఎలా ఉంటుంది?. తాజాగా అదే జరిగింది.. మంగళవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్-రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య కీలక సమావేశం జరిగింది. ఆస్తానా త్రైపాక్షిక సదస్సులో భాగంగా.. టెహ్రాన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ హాలులో ఈ ఇద్దరూ భేటీ అయ్యారు. అయితే ఈ అధికార సమావేశానికి ముందుగా పుతిన్ వచ్చారు. దాదాపు ఒక నిమిషం పాటు ఎర్డోగన్ కోసం హాలులోనే ఆయన ఎదురు చూడాల్సి వచ్చింది. ఆ టైంలో మీడియా కెమెరాలన్నీ పుతిన్ వైపే ఉండగా.. ఆయన చాలా ఇబ్బందిగా ఫీలయ్యారు. చేతులు కట్టుకుని నీళ్లు నములుతూ.. కనుబొమ్మలు ఎగరేస్తూ విచిత్రమైన హవభావాలు ఇచ్చారు. ఆపై ఎర్డోగన్ రాకను చూసి చిరునవ్వుతో షేక్‌హ్యాండ్ ఇచ్చారు. Those 50 seconds that Erdogan made Putin wait, looking frazzled in-front of cameras say plenty of how much has changed after Ukraine: pic.twitter.com/giGirqaYYP — Joyce Karam (@Joyce_Karam) July 19, 2022 సాధారణంగా.. ఇలాంటి భేటీల్లో ఇద్దరు నేతలు ఒకేసారి వేదిక మీదకు రావడం జరుగుతుంటుంది. కానీ, ఎర్డోగన్ మాత్రం ఆలస్యంగా రావడంతో పుతిన్‌కు తలకొట్టేసినంత పనైంది. అయితే ఈ పరిణామం గురించి చర్చించుకోవడం వెనుక ఓ కారణం కూడా ఉంది. కట్ చేస్తే.. 2020 మాస్కో వేదికగా పుతిన్-ఎర్డోగన్ మధ్య కీలక భేటీ జరిగింది. ఆ సమయంలో ముందుగా చర్చావేదిక వద్దకు చేరుకున్న ఎర్డోగన్.. పుతిన్ కోసం రెండు నిమిషాలు ఎదురు చూడాల్సి వచ్చింది. అంతకు ముందు పోప్ ఫ్రాన్సిస్ విషయంలోనూ క్రెమ్లిన్ నేత ఇలాగే వ్యవహరించాడు. 2013లో పోప్‌ను యాభై నిమిషాలు వెయిట్ చేయించిన పుతిన్.. 2020లో గంటకు పైనే పోప్‌ను తన కోసం ఎదురు చూసేలా చేశాడు. అంతేకాదు ఒకప్పటి ఉక్రెయిన్ అధ్యక్షుడు విక్టోర్ యానుకోవిచ్‌ను ఏకంగా నాలుగు గంటలపాటు వెయిట్ చేయించాడు పుతిన్. అందుకే ప్రస్తుతం పుతిన్ ఎదుటివాళ్ల కోసం ఎదురు చూసిన క్షణాలు ఇంటర్నెట్ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. -
యూఎస్ వీసా కోసం నిరీక్షణ తప్పదు
సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్: విదేశీ ప్రయాణికులపై కోవిడ్–19 ఆంక్షల్ని అమెరికా ఎత్తేయడంతో చాలా మంది అగ్రరాజ్యానికి ప్రయాణమయ్యేందుకు సిద్ధమయ్యారు. అయితే వారు వీసా అపాయింట్మెంట్ కోసం మరింత కాలం నిరీక్షించాల్సిన అవసరం ఉందని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. వలసేతర వీసా కేటగిరీలో ఈ నిరీక్షణ తప్పదని పేర్కొంది. నవంబర్ 8 నుంచి అమెరికా ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రెండు టీకా డోసులు వేసుకున్న దాదాపుగా 30 లక్షల మంది భారతీయులు అమెరికాకు ప్రయాణం చేసే అవకాశం ఉందని తెలిపింది. ‘‘కోవిడ్ వల్ల ఏర్పడిన అంతరాయం నుంచి ఇప్పుడే కార్యకలాపాలను పునరుద్ధరిస్తున్నాం. అందువల్ల రాయబార, కాన్సులేట్ కార్యాలయాల్లో పనులు కాస్త ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. వీసా అపాయింట్మెంట్ కోసం ఇంకొంత కాలం ఎదురు చూడాల్సిన పరిస్థితులున్నాయి. వీలైనంత త్వరగా ఆ పనులు జరిగేలా చూస్తాం. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకే పెద్ద పీట వేస్తాం’’అని పేర్కొంది. రాయబార కార్యాలయ సిబ్బంది, ప్రయాణికులు భద్రంగా ఉండడానికే ప్రాధాన్యతనిస్తూ వీసా మంజూరు ప్రక్రియని వేగవంతం చేస్తామని స్పష్టం చేసింది. లక్షల మంది భారతీయులు వీసాల పునరుద్ధరణ/ కొత్త వీసాల జారీకి ఎదురుచూస్తుండడంతో యూఎస్ ఎంబసీల నుంచి అపాయింట్మెంట్లు అంత సులువుగా లభించే అవకాశాలు కనిపించడం లేదు. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి యూఎస్ వెళ్లేందుకు నిరీక్షిస్తున్న తెలుగువారు సైతం మరికొంత కాలం వేచిఉండాల్సి రావచ్చని యూఎస్ ఎంబసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వెయిటింగ్ లిస్టు చాంతాడంత ఉందని, ఆంక్షల నుంచి ఉపశమనం లభించినా వెంటనే యూఎస్ ప్రయాణాలు సాధ్యం కాకపోవచ్చని పేర్కొంటున్నాయి. -
ప్రేయసి వస్తుందని ఆశతో 21 ఏళ్లుగా ఎదురు చూసి చూసి.. చివరకు
ప్రేమ అనేది ఓ మధురమైన అనుభూతి, భావాలు తప్ప మాటల్లో వర్ణించలేని వర్ణన. అందుకే ప్రేమికులు తమ ప్రేమను కాపాడుకోవడం కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడుతుంటారు. కొందరు ఆ ప్రేమ కోసం ప్రాణాలు తీసుకుంటే, మరికొందరు జీవితాల్ని నాశనం చేసుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇలా ఓ యువకుడు తాను ప్రేమించిన యువతి కోసం ఒకటి రెండేళ్లు కాదు ఏకంగా 21ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని పుదుకోట్టైలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.... పుదుకోట్టై జిల్లాలోని పొన్నమరావతి సమీపం మూలక్కుడి గ్రామానికి చెందిన నాగరాజన్ (40) 21ఏళ్ల క్రితం ఉపాధి కోసం కేరళకు వెళ్లి అక్కడ ఓ యువతిని ప్రేమించాడు. తన తోబుట్టువులకు పెళ్లి అయ్యాక వివాహం చేసుకుందామని చెప్పి ఆమెను మూలక్కుడికి తీసుకొచ్చాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు, బంధువులు వచ్చి ఆమెను బలవంతంగా తీసుకువెళ్లారు. ఈ ఘటనతో షాకైన నాగరాజన్ తన ప్రియురాలు ఎప్పటికైనా తిరిగి వస్తుందన్న ఆ పరిసరాల్లోనే రోడ్డు మీద తిరుగుతూ ఆశగా ఎదురుచూసేవాడు. ఈ క్రమంలో ఎవరితోనూ మాట్లాడకుండా ఉండిపోవడంతో నాగరాజు మతిస్థిమితం తప్పింది. అలా ఏళ్లుగా నిరీక్షిస్తున్న అతడి విషయం ఇటీవలే జిల్లా అధికారులకు తెలిసింది. దీంతో వారు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సాయంతో అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. -
టీకా కోసం 1.94 కోట్ల మంది ఎదురుచూపులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేసిన నేపథ్యంలో.. థర్డ్‌వేవ్ హెచ్చరికలు కలవరపెడుతున్నాయి. దీం తో అందరూ టీకాల కోసం పరుగులు తీ స్తున్నారు. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసా గుతోంది. ఇప్పటివరకు లబ్ధిదారులకు 93.25 లక్షల డోస్‌లు వేశారు. రాష్ట్రంలో ఇంకా 1,94,85,855 మందికి టీకా వే యాల్సి ఉందని వైద్య ఆరోగ్య శాఖ తెలి పింది. అందులో 18-44 ఏళ్ల వయసున్న 1,53,90,824 మందికి, 45 ఏళ్లు పైబడిన 40,95,031 మందికి టీకా వేయాల్సి ఉంది. ప్రస్తుతం లక్షన్నర నుంచి 2 లక్షల వరకు రోజూ టీకా వేస్తున్నారు. అయితే, ఎదురుచూస్తున్న 1.94 కోట్ల మందికి టీకా వేయాలంటే దాదాపు 4 నెలల సమయం పడుతుందని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు అంచనా వేశాయి. రెండు డోస్‌లు పూర్తి చేయాలంటే 6 నెలలకు పైగా సమయం పడుతుందని అంచనా. ఆసుపత్రుల బాధితులకు పరిహారం.. అత్యధికంగా బిల్లులు వసూలు చేస్తున్నా రంటూ రాష్ట్రంలో 170 ప్రైవేట్ కార్పొరేట్ తదితర ఆసుపత్రులపై కరోనా బాధితు ల నుంచి వైద్య, ఆరోగ్య శాఖకు 350 ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పటివరకు 30 ఫిర్యాదులను పరిష్కరించి బాధితులకు రూ.72,20,277 ఇప్పించినట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా, ఈ నెల 1 నుంచి 21 వరకు రాష్ట్రంలో 24,69,017 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అందులో ర్యా పిడ్ యాంటీజెన్ పరీక్షలు 22,45,418 చే యగా, ఆర్టీపీసీఆర్ పరీక్షలు 2,23,599 మాత్రమే చేశారు. ఇదే కాలంలో రాష్ట్రం లో కరోనా పాజిటివిటీ రేటు 1.46 శాతం గా నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా వరంగల్ రూరల్ జిల్లాలో 2.38శాతం, ఖమ్మం జిల్లాలో 2.07 శా తం, రంగారెడ్డి జిల్లాలో 2 శాతం పాజిటి విటీ నమోదైంది. థర్డ్‌వేవ్ వస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రముఖ వైరాలజీ, పీడియాట్రిక్స్, ఈఎన్టీ తదిత ర విభాగాలకు చెందిన 12 మంది నిపు ణులతో అడ్వైజరీ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాగా, రాష్ట్రంలో ఈ నెల 21 వరకు మొదటి, రెండు డోస్‌లు కలిపి 93,25,254 వ్యాక్సిన్లు వేశారు. -
నా కొడుకు ఎక్కడ సారూ..?
కృష్ణ జిల్లా, విస్సన్నపేట (తిరువూరు) : పేగు తెంచుకు పుట్టిన బిడ్డలు వృద్ధాప్యంలో అండదండలుగా ఉంటారని ఎన్నో ఆశలతో తల్లితండ్రులు ఉంటారు. అయితే, కన్న కొడుకు పదేళ్లుగా ఉన్నాడా లేడా, ఉండి తమతో మాట్లాడటం లేదా అనే ఆవేదనతో ఓ మాతృమూర్తి హృదయం తల్లడిల్లుతోంది. తనను కొడుకు చూడనవసరం లేదయ్యా.. తనకు భర్త తరఫున పెన్షన్ వస్తోంది.. దాంతోనే తాను సుఖంగా జీవిస్తున్నాను. తమ తదనంతరం ఆస్తిపాస్తులు వాడికి అప్పగిస్తే బాధ్యత తీరుతుంది.. అని చెబుతోంది కన్న తల్లి ఉపద్రష్ట కామేశ్వరి. స్థానిక శ్రీనివాసనగర్‌లో నివాసం ఉండే ఉపద్రష్ట సుబ్బారావు టెలికం డిపార్ట్మెంట్లో ఉద్యోగం నిమిత్తం గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి విస్సన్నపేట వచ్చి చాలా ఏళ్లుగా స్థిరపడ్డారు. వీరి కుమారుడు ఉపద్రష్ట కిరణ్‌కుమార్ హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేసి విదేశాల్లో ఉద్యోగం నిమిత్తం 15 ఏళ్ల క్రితం లండన్ వెళ్లాడు. అక్కడ నోవా ఐటీ కన్సల్టింగ్ కంపెనీలో లీడ్ ఐటీ కన్సల్టెంట్‌గా పని చేసేవాడు. అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేవాడు. రానురాను ఫోన్ చేయటం మానేశాడు. పదేళ్ల కిత్రం తండ్రి సుబ్బారావు మరణించాడని అతడి ఫోన్‌కు మెసేజ్ పంపినా స్పందించలేదు. ఆ తర్వాత అతని సోదరుడు మరణించాడు. ఆ వార్త తెలిపినా అతీగతీ లేదు. అయితే, తన కొడుకు ఫోన్ నెంబరుకు కాల్ చేస్తే పలకటం లేదని, మెసేజ్‌లు పంపితే స్వీకరించినట్లు వస్తోందని కామేశ్వరి చెబుతోంది. ఎలాగైనా తన కొడుకును ఒక్కసారి మాట్లాడించాలని వేడుకుంటోంది. ఇదే విషయంపై గతంలో మీ కోసంలో కలెక్టరు కార్యాలయంలో అర్జీ కూడా ఇచ్చింది. ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో తన గోడు ‘సాక్షి’కి చెప్పుకుంది. ఎలాగైనా తన కొడుకుతో మాట్లాడించాలని వేడుకుంటోంది. -
సహయం కోసం నిరీక్షణ
-
ఎంపీడీవోలకు హోదా
ఏలూరు (మెట్రో) : ఏళ్లు కాదు.. దశాబ్దాల నాటి కల సాకారమయ్యింది. మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీవోలు) చాలా ఏళ్లుగా ఒకే రకమైన విధులతో విసుగెత్తిపోయారు. ఉద్యోగరీత్యా ఎదుగూ బొదుగూ లేక వారిలో నిరుత్సాహం అలముకుంది. వారితోపాటు ఉద్యోగాలు పొందిన మిగతా శాఖల ఉద్యోగులు మాత్రం పదోన్నతులు పొంది ఉన్నతాధికారులు కావడంతో ఎంపీడీవోల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో 6 నుంచి 18 ఏళ్ల సర్వీసు ఉన్నవారికి వివిధ కేడర్లలో హోదాలు కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో జిల్లాలోని ఎంపీడీవోల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పెరగనున్న హోదా జిల్లాలో 48 మండలాలకు గాను 46 మండలాలకు పూర్తిస్థాయిలో ఎంపీడీవోలు ఉన్నారు. కామవరపుకోట ఎంపీడీవో మరణంతో ఆ స్థానం ఖాళీ ఏర్పడగా దెందులూరు ఎంపీడీవో ఇటీవల పదవీ విరమణ పొందారు. సాధారణంగా ఎంపీడీవోలకు జెడ్పీ డెప్యూటీ సీఈవో, ఏవోగా పదోన్నతులు కల్పిస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పదోన్నతి ఇచ్చేందుకు పంచాయతీరాజ్‌శాఖ ప్రయత్నించినప్పుడల్లా సీనియార్టీని నిర్ణయించడంపై వివాదాలు ఏర్పడి కోర్టులను ఆశ్రయించేవారు. దీంతో పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం జిల్లాలో 42 మంది ఎంపీడీవోలకు హోదా లభించనుంది. మూడు రకాల క్యాడర్లు ఎంపీడీవోల సర్వీసు ఆధారంగా ప్రభుత్వం హోదాలను నిర్ణయించింది. ఆరేళ్లు పూర్తిచేసిన ఎంపీడీవోలకు సహాయ సంచాలకుడు (ఏడీ), 12 ఏళ్లు పూర్తిచేసిన వారికి ఉప సంచాలకుడు (డీడీ), 18 ఏళ్లు పూర్తిచేసిన వారికి సంయుక్త సంచాలకుడు (జేడీ) హోదాలను ఇచ్చింది. ఈ మేరకు జిల్లాలో ఏడీ క్యాడర్లో 8 మంది, డీడీ క్యాడర్లో 27 మంది, జేడీ క్యాడర్లో ఏడుగురు పదోన్నతులు పొం దారు. మిగిలిన ఆరుగురికి ఆరేళ్ల సర్వీసు పూర్తికాలేదు. జేడీలుగా అందరూ మహిళలే.. ఇప్పటివరకూ మండలస్థాయిలో విధులు నిర్వహించిన మహిళా ఎంపీడీవోలు ప్రస్తుతం జిల్లా స్థాయిలో జాయింట్ డైరెక్టర్ హోదా పొందారు. వీరిలో గణపవరం ఎంపీడీవో జి.పద్మ, ఇరగవరం ఎంపీడీవో జి.విజయలక్ష్మి, మొగల్తూరు రమాదేవి, పెనుగొండ పద్మిని, ఉంగుటూరు జె.రేణుకమ్మ, వీరవాసరం పి.జగదాంబ, జీలుగుమిల్లి ఎంపీడీవో పీకే నిర్మలాదేవి జిల్లా స్థాయి పోస్టులు సాధించనున్నారు. -
విడుదల ఎన్నడు?!
= వాతావరణ బీమా కోసం రైతుల ఎదురుచూపు = మంజూరై నెలైనా విడుదలకు నోచుకోని వైనం = బొమ్మనహాళ్‌కు అత్యధికం..సీకేపల్లికి అత్యల్పం ! అనంతపురం అగ్రికల్చర్ : ఖరీఫ్–2016కు సంబంధించి వాతావరణ బీమా కోసం రైతులు కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. జిల్లాకు రూ.367 కోట్ల పరిహారం మంజూరు చేస్తున్నట్లు నెల రోజుల కిందటే ప్రభుత్వం ప్రకటించినా.. ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. కనీసం మండలాల వారీగా హెక్టారుకు ఎంత మొత్తం వర్తింపజేశారు, ఎన్ని మండలాలకు.. ఎంత మంది రైతులకు ఇచ్చారు, బ్యాంక్ ఖాతాల్లో ఎప్పుడు జమ చేస్తారనే విషయాలను అధికారులు కూడా చెప్పడం లేదు. ఈ సారి ‘బజాజ్ అలయెంజ్’ అనే ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో వాతావరణ బీమా పథకాన్ని అమలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 5.22 లక్షల మంది రైతులు రూ.48 కోట్ల వరకు ప్రీమియం చెల్లించినట్లు లీడ్‌బ్యాంకు వర్గాలు తెలిపాయి. గడిచిన ఖరీఫ్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వేరుశనగ పంట సర్వనాశనమైంది. పంట కోత ప్రయోగాల్లో వచ్చిన దిగుబడులే ఇందుకు నిదర్శనం. ఎకరాకు సరాసరి 86 కిలోల దిగుబడి మాత్రమే లభించింది. కొ న్ని గ్రామాలు, మండలాల్లో అయితే ఎకరాకు పది కిలోలు కూడా పండలేదు. ఈ పరిస్థితుల్లో వాతావరణ బీమా కింద భారీ ఎత్తున పరిహారం వస్తుందని రైతులు ఆశించారు.అయితే వారి ఆశలు అడియాసలయ్యాయి. 2011 నుంచి ఈ పథకం అమలు చేస్తుండగా ఒక్క ఏడాది కూడా అన్ని మండలాలకూ పరిహారం వచ్చిన దాఖలాలు లేవు. ఈసారి మాత్రం అన్ని మండలాలకూ అంతో ఇంతో మంజూరు చేసినట్లు తెలుస్తోంది. బొమ్మనహాళ్‌కు అత్యధికం .. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 14 నుంచి 17 మండలాలకు మాత్రమే ఎకరాకు ఐదు వేలకు పైగా పరిహారం వర్తింపజేశారు. మరో 15 నుంచి 18 మండలాలకు ఎకరాకు రూ.వెయ్యిలోపు, మిగతా మండలాలకు రూ.1,200 నుంచి రూ.4,500 వరకు పరిహారం వర్తింపజేసినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద చూస్తే బొమ్మనహాళ్ మండలానికి అత్యధికంగా అంటే ఎకరాకు రూ.6,700 ప్రకారం, చెన్నేకొత్తపల్లి మండలానికి అత్యల్పంగా రూ.670 చొప్పున వర్తింపజేసినట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. మొత్తమ్మీద చూస్తే వాతావరణ బీమా ద్వారా 25 నుంచి 30 మండలాలకు మాత్రమే కొంత వరకు న్యాయం జరిగే పరిస్థితి ఉందని అంచనా వేస్తున్నారు. అది కూడా ఇన్పుట్ సబ్సిడీ లెక్కలు తేలితే కానీ మండలాల వారీగా వాతావరణ బీమా వివరాలు ప్రకటించే పరిస్థితి కనిపించడం లేదు. -
ఓపికుంటేనే రండి..
సామాన్యులకు అందని మెరుగైన వైద్యం గంటల తరబడి క్యూలో నిరీక్షణ కౌంటర్లలో సిబ్బంది కొరతే కారణం ఇదీ సర్వజనాస్పత్రిలో పరిస్థితి అనంతపురం మెడికల్ : పేదలకు పెద్ద దిక్కుగా ఉన్న అనంతపురంలోని సర్వజనాస్పత్రిలో వైద్యసేవలు పొందాలంటే సామాన్యులకు గగనంగా మారుతోంది. ఎంతో ఓపిక ఉంటే గానీ ఇక్కడ సేవలు అందడం లేదు. ఉదయం ఓపీ (ఔట్ పేషెంట్) కౌంటర్లు ప్రారంభమైనప్పటి నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు భారీ క్యూలు కన్పిస్తున్నాయి. రోగులు, వారి బంధువులు ఓపీ చీటీల కోసం ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఇక్కడ పురుషులు, మహిâýæలకు ఒకే కౌంటర్ ఉండేది. నలుగురు సిబ్బంది విధుల్లో ఉండేవారు. ఇటీవల వేర్వేరు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ రెండు కౌంటర్లలో ఇద్దరు చొప్పున విధుల్లో ఉంటున్నారు. ఇటీవల వివిధ వ్యాధులతో ఆస్పత్రికి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ఔట్ పేషెంట్లు వెయ్యి దాటుతున్నారు. అనంతపురం చుట్టు పక్కల ప్రాంతాల నుంచే కాకుండా ధర్మవరం, ముదిగుబ్బ, కదిరి, తాడిపత్రి, పెనుకొండ, రాప్తాడు వంటి ప్రాంతాల నుంచి కూడా రోగులు పెద్దసంఖ్యలో వస్తున్నారు. తొమ్మిది గంటలకు ఓపీ ప్రారంభం అవుతోంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ముగిస్తున్నారు. ఓపీ చీటీ ఉంటేనే వైద్యులు చికిత్స అందిస్తారు. ఈ చీటీల కోసం వృద్ధులు, చంటి పిల్లలతో వచ్చిన వారు అగచాట్లు పడుతున్నారు. కౌంటర్లో ఉంటున్న ఇద్దరు ఉద్యోగుల్లో ఒకరు చీటీ రాస్తే, మరొకరు రోగి వివరాలను ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో క్యూ లైన్లలో గంటలకొద్దీ నిరీక్షించి సొమ్మసిల్లిపడిపోయే వారూ లేకపోలేదు. అర గంట ఇక్కడే గడిచింది నా కుమార్తె దీపకు రెండ్రోజుల నుంచి జ్వరం వస్తోంది. ఉదయం 10 గంటలకు ఇక్కడికొచ్చా. చీటీ తీసుకుందామంటే భారీ క్యూ ఉంది. అర గంట దాటినా పరిస్థితిలో మార్పు లేదు. పాప ఉందని చెప్పినా ఎవరూ వినడం లేదు. లైన్లోనే రమ్మంటున్నారు. – సురేష్, కురుగుంట, అనంతపురం రూరల్ మండలం ఓపీ సమయం పొడిగించాలి ఒళ్లంతా దద్దుర్లు, నవ్వలు ఉంటే ఇక్కడికొచ్చా. క్యూ చూసే సరికి వామ్మో అనిపించింది. మధ్యాహ్నం దాటితే డాక్టర్లు వెళ్లిపోతారట. మాలాంటి వాళ్లను దృష్టిలో పెట్టుకుని ఓపీ టైం గంట సేపు పొడిగిస్తే మంచిది. కౌంటర్లో కూడా మరొకరిని పెడితే బాగుంటుంది. – వెంకటరమణ, ముదిగుబ్బ నిలబడలేకున్నా నాకు షుగర్, బీపీ ఉన్నాయి. చికిత్స కోసం వచ్చి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అసలే ఎక్కువ సేపు నిలబడలేను. క్యూలో ఉన్న వాళ్లు ఓ పట్టాన కదలడం లేదు. చీటీలు ఇచ్చే వాళ్లు కూడా తొందరగా ఇవ్వడం లేదు. పాపం ఇద్దరే ఉన్నారంట. మేము ఇంత సేపు నిలబడాలంటే కష్టంగా ఉంది. –పెద్ద బాలన్న, తాటిచెర్ల, అనంతపురం రూరల్ మండలం -
పింఛన్ కోసం క్యూలో నిలబడ్డ వృద్ధురాలు మృతి
-
'లక్ష్మి' కోసం వెళ్తే మరో లక్ష్మి వచ్చి పలకరించింది
-
నగదుకోసం క్యూలో ఉంటే...
కాన్పూర్: పెద్దనోట్ల రద్దు తర్వాత నగదు విత్ డ్రా కోసం ఏర్పడుతున్న క్యూ లైన్లలో మరో ఆసక్తికర సంఘటన నమోదైంది. డబ్బుల కోసం క్యూలో నిలుచుంటే.. అనూహ్యంగా శుక్రవారం పూట లక్ష్మి వచ్చి పలకరించింది. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ దేహత్ జిల్లాలో ఉత్తరప్రదేశ్ కాన్పూర్ దేహత్ జిల్లాలో పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...దేహత్ జిల్లాకు చెందిన సర్వేష (30) అత్తగారితో కలిసి నగదు విత్ డ్రా కోసం బ్యాంకు కు వెళ్లింది. గురువారం క్యూ లో నిలుచున్నా ఫలితం దక్కకపోవడంతో మళ్లీ శుక్రవారం ఉదయం నుంచి క్యూలో వెయిట్ చేస్తోంది. ఇంతలో సుమారు నాలుగు గంటల ప్రాంతంలో ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆంబులెన్స్ రావడం ఆలస్యం కావడంతో అక్కడున్న మహిళలు ఆమెకు అండగా నిలిచారు. వారి సహాయంతో సర్వేష బ్యాంకులోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం పోలీసులు తల్లీబిడ్డలను సమీపంలో ఆసుపత్రికి తరలించారు. అయితే తనకోడలు చాలా బలహీనంగా ఉండడటంతో తనకు భయమేసిందని సర్వేష అత్తగారు తెలిపింది. కానీ అందమైన పుట్టడం సంతోషంగా ఉందనీ, ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారంటూ ఆనందం వ్యక్తం చేసింది. కాగా ఈ ఏడాది సెప్టెంబర్ లో సర్వేష భర్త అశ్వేంద్ర రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీనితో యూపీ ప్రభుత్వం సుమారు రూ.2.75 లక్షలు, ఇల్లు పరిహారాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ తీసుకోవడకోసం అత్తతో కలిసి బ్యాంకుకు వెళ్లింది. -
రైళ్ల కోసం ఎదురుచూపులు
డోర్నకల్ : విజయవాడ రైల్వేస్టేన్లో రూట్ రిలే ఇంటర్ లాకింగ్ సిస్టం ఆధునీకరణ పనులు జరుగుతుండటంతో నాలుగు రోజులుగా విజయవాడ మార్గంలో నడిచే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం కొత్తగూడెం – మణుగూరు మార్గంలో వర్షాలతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో మణుగూరు – కాజీపేట ప్యాసింజర్ రద్దయ్యింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డోర్నకల్ రైల్వేస్టేన్లో ఏ రైలు ఎప్పుడు వస్తుందో తెలియక ప్రయాణికులు తిప్పలుపడ్డారు. విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్ సుమారు నాలుగు గంటల ప్రాంతంలో డోర్నకల్ మీదుగా సికింద్రాబాద్‌కు వెళ్లింది. ఈ రైలు వస్తున్న సమాచారం తెలియకపోవడంతో తక్కువ సంఖ్యలో ప్రయాణికులు రైలులో ప్రయాణించారు. విజయవాడలో ఆర్ఆర్ఐ ఆధునీకరణ పనులు పూర్తి కావొచ్చాయని, ఒకటి రెండు రోజుల్లో రైళ్ల రాకపోకలు కొనసాగుతాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. -
చీకటి కమ్మిన బతుకులు
– కాలమే శాపంగా... – మంచానపడ్డ తండ్రి.. వైధవ్యంతో కూతుళ్లు.. – పస్తులుంటోన్న పేద కుటుంబం – వితంతు పింఛన్లూ రాలేదు – ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు అందరూ ఆడపిల్లలు పుట్టగానే భారమనుకుంటారు.. కానీ ఆ ఇంట నలుగురు ఆడపిల్లలు పుట్టగానే మా ఇంట మహాలక్ష్ములు పుట్టారని ఆ తండ్రి సంబరపడ్డాడు. ఏ జీవనాధారం లేకున్నా.. కూలికెళ్లి అందరినీ పెద్ద చేసి, పెళ్లిళ్లు చేసి, అత్తారింటికి పంపాడు.. కానీ కూతుళ్ల బతుకుల్లో ఎంతోకాలం వెలుగులు నిలవలేదు..వారి బతుకుల్లో చీకటి కమ్ముకుందా అన్నట్లు ఒకరి తర్వాత ఒకరికి ముగ్గురి కూతుళ్ల భర్తలను మత్యువు తీసుకెళ్లింది. మరో కూతురైనా సంతోషంగా ఉంటుందనుకుంటే ఆమె భర్తా వదిలేసి వెళ్లిపోయాడు. ఇంత బాధను దిగమింగుకుని కుటుంబాన్ని ఈదుతున్న ఆ తండ్రికీ ప్రమాదవశాత్తు మిద్దెపై నుంచి కిందపడి వెన్నెముక దెబ్బతినింది. అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యాడు. నలుగురి కుమార్తెల పోషణ బాధ్యత మీద పడింది. కుటుంబ పోషణ భారమైంది. వైద్యం చేయించుకుందామంటే చేతిలో చిల్లిగవ్వ లేదు.. పింఛనూ రాలేదు. కూతుళ్లకు వితంతు పింఛన్లు ఇవ్వలేదు. కూలికెళ్లితేనే కుటుంబం గడిచే ఆ ఇంట అందరూ పస్తులతో ఉండాల్సి వస్తోంది. ధర్మవరం పట్టణంలోని శాంతినగర్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్న వడ్డే చిన్నకాటమయ్య, రామలక్ష్మమ్మ దంపతులకు నలుగురు కూతుళ్లు. పెద్ద కుమార్తె నాగమల్లేశ్వరి భర్త ఆరేళ్ల క్రితం అప్పులబాధతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద కుమార్తె తండ్రివద్ద చేరింది. రెండో కుమార్తె వరలక్ష్మి భర్త కూడా మతిచెందాడు. నాల్గో కుమార్తె సరిత భర్త రోడ్డు ప్రమాదంలో మతి చెందాడు. మూడో కుమార్తె మందాకినికి పెళ్లి చేయగా భర్త కామెర్ల వ్యాధితో మతి చెందాడు. మందాకినికి మరో పెళ్లి చేయగా ఒక కూతురు పుట్టగానే భర్త వదిలేసి వెళ్లిపోయాడు. నలుగురు కూతుళ్లూ తండ్రిమీద ఆధారపడ్డారు. తండ్రి కాటమయ్య పాత భవనం తొలగించే పనిలో పైనుంచి కిందపడి వెన్నెముక దెబ్బతింది. దీంతో కాళ్లు, చేతులు పనిచేయక మంచానికే పరిమితమయ్యాడు. తల్లి రామలక్ష్మమ్మ కుటుంబ పోషణ కోసం ఇంటి పనులు చేస్తూ ఆ వచ్చే అరకొర కూలితో నెట్టుకొస్తోంది. పూట గడవడమే కష్టంగా మారిన ఆ కుటుంబానికి ఆదరణ కరువైంది. దీంతో వైద్యం కోసం, కుటుంబ పోషణ కోసం దాతల నుంచి సాయాన్ని అర్థిస్తున్నారు. దాతలు ముందుకు వచ్చి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ కుటుంబ సభ్యులు కన్నీటితో వేడుకుంటున్నారు. పింఛన్లూ రాలేదు కాళ్లు, చేతులు పడిపోయిన కాటమయ్యకు వద్ధాప్య పింఛను రాకపోగా వితంతువులైన తన కూతుళ్లు నాగమల్లేశ్వరి, సరితలకు కూడా పింఛను అందలేదు. ఎన్నిమార్లు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నా అధికారులు పట్టించుకోలేదని వారు కన్నీటిపర్యంతమవుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఆ కుటుంబంలోని వారికి పింఛన్లు మంజూరు చేసి కుటుంబాన్ని ఆదుకోవాలని విన్నవిస్తున్నారు. -
ఏడాదిగా ఎదురుచూపులు
ఏలూరు (సెంట్రల్): లిబియా దేశంలో ఉగ్రవాదుల చెరలో ఏడాది కాలంగా బందీగా ఉన్న ఏలూరు దొండపాడుకు చెందిన డాక్టర్ కొసనం రామ్మూర్తి రాక కోసం కుటుంబసభ్యులు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. మూడు రోజులు క్రితం భారత ప్రభుత్వ ప్రయత్నాలతో ఇద్దరు ప్రొఫెసర్లు విడుదల కావడంతో రామ్మూర్తి కుటుంబసభ్యుల్లో ఆశలు చిగురించాయి. ఏలూరు రూరల్ మండలం దొండపాడులో నివాసం ఉండే రామ్మూర్తి 17 ఏళ్లుగా లిబియాలోని సిరిట్ ప్రాంతంలోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది సెప్టెంబర్‌లో ఆయన ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్నారు. అప్పటి నుంచి పలు ప్రయత్నాలు చేస్తున్నా ఆయన విడుదల కాలేదు. ఈ క్రమంలో ఉగ్రవాదుల బందీ నుంచి ఇటీవల ఇద్దరు విడుదల కావడంతో రామ్మూర్తి భార్య అన్నపూర్ణభవానీ, కుమారుడు, ఇద్దరు కుమారైలు ఆయన రాకకోసం ఎదురుచేస్తున్నారు. రామ్మూర్తి విడుదలైయ్యే విధంగా ప్రభుత్వం మరింత శ్రద్ధ తీసుకోవాలని ఆయన కుటుంబసభ్యులు కోరుతున్నారు. -
వేసవి భోజన బిల్లుల కోసం ఎదురుచూపులు
అప్పులపాలవుతున్న వంట ఏజెన్సీ మహిళలు ఆత్మకూరు : సర్కారు బడుల్లో వేసవిలో మధ్యా హ్న భోజనం వండిపెట్టిన ఏజెన్సీ మహిళలు బిల్లు లు రాక అప్పులపాలవుతున్నారు. జిల్లాలో 2,049 ప్రాథమిక పాఠశాలలు, 360 యూ పీఎస్‌లు, 510 హైస్కూళ్లు ఉన్నాయి. మొత్తం 2,03,603 విద్యార్థులు ఉండగా, వేసవిలో 30శాతం మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని సద్వినియోగం చేసుకున్నారు. జిల్లాలోని 2,919 భోజన ఏజెన్సీల మహిళలు వంట చేసి పెట్టి బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. ఆయా మండలాల్లో సుమారు రూ. 1.80లక్షల వేతనాలు, రూ.2లక్షల వరకు భోజన బిల్లు బకాయిలు ఉన్నాయి. జిల్లాలో రూ.2కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే గత ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకు భోజన కార్మికులకు వేతనాలు కూడా అందలేదు. ఇప్పటికైనా బిల్లులు నెలనెలా చెల్లించాలని భోజన కార్మికులు కోరుతున్నారు. -
మేఘం కురవదు కరువు తీరదు
-
‘గుర్తింపు’ ఎన్నికలు మరింత ఆలస్యం
2017 జనవరిలో నిర్వహించే అవకాశం ? గోదావరిఖని : సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు మరింత ఆలస్యంగా జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. 2012 జూన్ 28వ తేదీన ఐదో దఫా ఎన్నికలు జరగగా.. అదే ఏడాది ఆగస్టు 6వ తేదీన గుర్తింపు సంఘంగా గెలిచిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకెఎస్)కు అధికారికంగా యాజమాన్యం, ఆర్ఎల్సీ హోదా పత్రాన్ని అందజేసింది. నాలుగేళ్ల కాలపరిమితితో సంఘం కార్యకలాపాలను సాగించగా... ఈ నెల 6వ తేదీతో కాలపరిమితి పూర్తయింది. అయితే రీజినల్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వíß ంచాల్సి ఉండగా... ఇందుకు సంబంధించిన ప్రక్రియ ఇంతవరకు ముందుకు సాగకపోవడం గమనార్హం. ఈ ఏడాది ఆగస్టు 6వ తేదీతో సింగరేణిలో గుర్తింపు సంఘం నాలుగేళ్ల కాలపరిమితి పూర్తయిందనే సమాచారాన్ని సింగరేణి యాజమాన్యం ఢిల్లీలో ఉన్న కేంద్ర కార్మిక శాఖ డెప్యూటీ ఛీప్ లేబర్ కమిషనర్ కార్యాలయానికి, హైదరాబాద్‌లో ఉన్న రీజినల్ లేబర్ కమిషనర్ కార్యాలయానికి లేఖలు పంపించింది. ఆ తర్వాత తాము ఎన్నికలకు సిద్ధమంటూ మరో లేఖను ఈ శాఖల కార్యాలయాలకు పంపించిన తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. కానీ ఇప్పటి వరకు యాజమాన్యం నుంచి ఎన్నికలకు సిద్ధమనే లేఖ పంపలేదు. ఇదిలా ఉండగా గుర్తింపు సంఘం నాలుగేళ్ల కాలపరిమితి ఆగస్టు 6వ తేదీతో పూర్తి కావడంతో సింగరేణిలో ఎన్నికలు నిర్వహించాలని ఏఐటీయూసీ ఇతర కార్మిక సంఘాలు కార్మిక శాఖ అధికారులకు లేఖలు రాశాయి. అదే సమయంలో యాజమాన్యంపై కూడా ఒత్తిడి తీసుకువచ్చాయి. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ఎన్నికలు జరుగుతాయని అందరూ భావించారు. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. మళ్లీ గుర్తింపు సంఘంగా గెలిచేందుకు.. సింగరేణిలో మళ్లీ గుర్తింపు సంఘంగా గెలవాలనే లక్ష్యంతో టీబీజీకేఎస్ ముందుకు సాగుతోంది. గత ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలో పొందుపర్చడం, గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో హామీ ఇచ్చిన మేరకు సింగరేణిలో వారసత్వ ఉద్యోగావకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారసత్వ ఉద్యోగాలు ప్రకటించిన తర్వాతనే గుర్తింపు సంఘం ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనను ప్రభుత్వం చేస్తున్నట్టు సమాచారం. అందువల్ల ప్రభుత్వం నుంచి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతనే సింగరేణి యాజమాన్యం ఎన్నికలకు సిద్ధమంటూ కేంద్ర కార్మిక శాఖ, ఆర్ఎల్సీకి లేఖలు రాసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో వారసత్వ ఉద్యోగాల ప్రక్రియ జరగడానికి డిసెంబర్ వరకు సమయం తీసుకునే అవకాశాలున్నాయి. వారసత్వ ఉద్యోగాల ప్రకటన తర్వాత 2017 జనవరి నెలలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించడానికి ఇటు యాజమాన్యం, ఆటు ఆర్ఎల్సీ సిద్ధంగా ఉండవచ్చని తెలుస్తోంది. మొత్తమ్మీద నాలుగు జిల్లాల పరిధిలో ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపనున్న సింగరేణిలో మళ్లీ గులాబీ జెండా ఎగిరేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం, టీబీజీకేఎస్ యూనియన్ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. -
గందరగోళంలో టెట్ విత్‌హెల్డ్ అభ్యర్థులు
టేకులపల్లి : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) అభ్యర్థులు గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఓఎంఆర్ షీట్లో ప్రశ్నాపత్రం కోడ్ షేడ్ చేయని కారణంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 3677 మంది అభ్యర్థుల ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెట్టారు. మండలానికి చెందిన బాధితులు ఇస్లావత్ బావ్‌సింగ్, భూక్య సురేష్, దారావత్ వెంకటేశ్, బానోతు రాజేశ్ గురువారం విలేకరులకు తమ ఆవేదన వ్యక్తం చేశారు. మే 22న నిర్వహించిన టెట్ పరీక్షకు మే 17 న ఫలితాలు విడుదల చేశారు. ఓఎంఆర్ షీట్లో ప్రశ్నాపత్రం కోడ్ వేయని కారణంగా తమ ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెట్టారని పేర్కొన్నారు. ఫలితాలు ఇవ్వకపోవడంతో విద్యావలంటీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోలేక పోయామని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ జూన్ 22న హైదరాబాద్‌లోని టెట్ కమిషనర్ కార్యాలయంలో ఉన్నతాధికారి రాంమోహన్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించిన అధికారి పదిహేను రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారని, నెల రోజులు గడుస్తున్నా నేటికీ ఫలితాలు ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే ఫలితాలు విడుదల చేయాలని కోరారు. జిల్లాకు చెందిన టెట్ విత్‌హెల్డ్ బాధితులు కలిసి రావాలని, పూర్తి వివరాలకు 80083 03485 నంబరులో సంప్రదించాలని కోరారు. బాధితులు విష్ణు, రాంబాబు, సంతోష్, కవిత,స్వాతి, రమేష్, ఆశ తదితరులు పాల్గొన్నారు. -
ఆసరా ఆలస్యం!
వృద్ధులు, వికలాంగులు, బీడీ కార్మికులకు ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఆసరా పింఛన్లు ఆలస్యమవుతున్నాయి. నెలాఖరు కావొస్తున్నా ఇప్పటి వరకు వారి చేతికి డబ్బులు అందలేదు. దీంతో పింఛన్‌పైనే ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది ఆందోళన చెందుతున్నారు. పింఛన్ ఎప్పుడొస్తుందా అని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. * ప్రతినెలా ఇదే తంతు * నేటికీ అందని పింఛన్ * 5.41 లక్షల మంది ఎదురుచూపు సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పింఛన్ మొత్తాన్ని పెంచిన విషయం తెలిసిందే. గతంలో వృద్ధులు, వితంతవులకు రూ.200, వికలాంగులకు రూ.500 చొప్పున పింఛన్ ఇచ్చేవారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వృద్ధులు, వితంతవులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 చొప్పున చెల్లిస్తున్నారు. వీరితోపాటు టీఆర్ఎస్ ప్రభుత్వం బీడీ కార్మికులకూ రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తోంది. అయితే గతంలో పింఛన్లు ప్రతినెలా ఒకటో తారీఖునే వచ్చేవి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ప్రతినెలా ఒకటో తారీఖున పింఛన్ డబ్బు తీసుకునేవారు. కానీ గత కొద్దినెలలుగా పరిస్థితి భిన్నంగా మారింది. ప్రతినెలా రూ.వెయ్యి పింఛన్ వస్తుందనే సంతోషం వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికుల్లో కనిపిస్తున్నా... ఆ సొమ్ము ఏ రోజు ఇస్తారో తెలియక సతమతమవుతున్నారు. ప్రతినెలా ఒకటో తేదీ నుంచి నెలాఖరు దాకా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ పింఛన్ కోసం వాకబు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో 5.44 లక్షల మంది జిల్లావ్యాప్తంగా ప్రతినెలా 5,44,215 మందికి పింఛన్లు మంజూరవుతున్నాయి. వాటిలో 1,92,563 మంది వృద్ధులు, 1,31,226 మంది వితంతవులు, 67,804 మంది వికలాంగులు, 9074 మంది చేనేత కార్మికులు, 11,615 మంది గీత కార్మికులు, 1,29,681 మంది బీడీ కార్మికులు, 3,220 మంది హెచ్ఐవీ బాధితులున్నారు. వీరికి ప్రతినెలా రూ.59.09 కోట్లు చెల్లిస్తోంది. వీరుగాక అభయహస్తం కింద 19,823 మంది మహిళలకు ప్రతినెలా రూ.4.08 కోట్లు చెల్లిస్తోంది. ఆయా మొత్తాన్ని ప్రభుత్వం గ్రామాల్లో ఎంపీడీవోలకు పంపుతోంది. ప్రతినెలా 15 వరకు ఆ మొత్తాన్ని ఎంపీడీవోలకు జమ చేస్తుండగా, అక్కడి నుంచి గ్రామ కార్యదర్శులకు వారి ద్వారా పింఛన్ దారులకు నెలాఖరులోపు చెల్లిస్తున్నారు. సుమారు 3,66,280 మంది పింఛన్‌దారులు గ్రామ కార్యాదర్శుల వద్దకు వెళ్లి పింఛన్ సొమ్ము తీసుకుంటున్నారు. మిగిలిన వారి విషయానికొస్తే... జిల్లాలో 182 గ్రామ పంచాయతీల్లో వీఎల్ఈ/సీబీఎస్ల ద్వారా నేరుగా 82,422 మంది పింఛన్‌దారుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నారు. పట్టణాల విషయానికొస్తే.. జిల్లాలోని 93,261 మంది పింఛన్‌దారులకు నేరుగా బ్యాంక్ ఖాతాల్లోనే పింఛన్ సొమ్ము జమ అవుతోంది. అయితే పింఛన్ సొమ్ము మాత్రం ఏ రోజు జమ అవుతుందో తెలియక వృద్ధులు, వితంతవులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఫిబ్రవరి నెలకు సంబంధించిన పింఛన్ సొమ్ము అందనేలేదు. అధికారులను అడిగితే ఎప్పుడు వస్తుందో కూడా చెప్పడం లేదని పలువురు వాపోతున్నారు. ఇదే విషయంపై అధికారులను వాకబు చేయగా ప్రభుత్వం నుంచి బుధవారమే డబ్బులు బ్యాంకుల్లో జమ అయ్యాయని, నెలాఖరులోపు పింఛన్ అందజేస్తారని పేర్కొనడం గమనార్హం. ఆఫీస్ చుట్టూ తిరుగుడే పింఛన్‌కోసం రోజు గ్రామపంచాయతీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం. ఎప్పుడు పైసలిత్తరో తెలుస్తలేదు. పైసలస్తే సమ్మక్కజాతరకు పోదామనుకున్నా... పైసల కోసం పట్టించుకునేటోల్లే లేరు. - అగ్గి భూదేవి వృద్ధురాలు -
'శ్రీమంతుడి' రాక కోసం
-
ముఖం చాటేసిన వరుణుడు
-
తెలుగుగంగ కోసం ఎదురుచూపులు
వెంకటగిరిటౌన్ : తెలుగుగంగ కోసం వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి మండలాల రైతులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కరుణించి నీటిని విడుదల చేస్తే ఆయా మండలాల్లో కాలువ దిగువ ప్రాంతాల్లో ఉన్న సుమారు 4 వేల ఎకరాలు సాగులోకి వస్తాయి. తమిళనాడుకు తాగునీటిని విడుదల చేసే క్రమంలో అక్టోబర్ నుంచి మార్చి వరకు తెలుగుగంగ కాలువ లో నీరు ప్రవహిస్తుంటుంది. ఆ సమయంలో డక్కిలి, వెంకటగిరి, బాలాయపల్లి మండలాల్లో ఉన్న బ్రాంచి కాలువల ద్వారా పలు గ్రామాల చెరువులకు నీరు చేరుతుంది. బ్రాంచి కాలువల ద్వారా నీరు చేరని డక్కిలి మండలం మోపూరు, డక్కిలి, వెంకటగిరి మండలం కలపాడు, పెట్లూరు గ్రామాల్లో సైఫన్ విధానంలో చెరువులకు నీటిని మళ్లించి నిల్వ చేస్తారు. గత నెలలో కాలువ మరమ్మతుల కోసం నీటిని నిలిపివేశారు. పనులను త్వరగా పూర్తి చేసి, నీటిని విడుదల చేయకపోతే రబీ సీజన్ ఆలస్యం అవుతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క హుదూద్ తుఫాన్ ప్రభావంతోనైనా వర్షాలు పడతాయోమోనని రైతులు ఎదురు చూస్తున్నారు. -
ఆశల పల్లకిలో నిరుద్యోగులు
డిసెంబర్ మొదటివారం లేదా చివర్లో నోటిఫికేషన్లు! కోచింగ్ సెంటర్లకు పోటెత్తుతున్న యువత సాక్షి, హైదరాబాద్: కొత్త రాష్ట్రంలో కొలువులు వెల్లువలా వస్తాయని తెలంగాణలోని నిరుద్యోగ యువత కోటిఆశలతో ఎదురు చూస్తోంది. నోటిఫికేషన్లు త్వరలోనే వెలువడనున్నాయని సంకేతాలు రావడంతో శిక్షణ కేంద్రాలకు పోటెత్తుతోంది. ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ కావడం, త్వరలోనే కమిషన్ చైర్మన్, సభ్యులను నియమించేందుకు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో నిరుద్యోగులంతా పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. గ్రూప్-1, గ్రూప్-2, డీఎస్సీ (టీచర్ పోస్టుల) తదితర పోటీ పరీక్షల్లో శిక్షణ కోసం హైదరాబాద్‌కు తరలివస్తున్నారు. దీంతో నగరంలో కోచింగ్ సెంటర్లకు కేంద్రమైన అశోక్‌నగర్, చిక్కడపల్లి తదితర ప్రాంతాలు నిరుద్యోగ యువతి,యువకులతో కిటకిటలాడుతున్నాయి. ఆదివారం గాంధీనగర్‌లోని ఓ కోచింగ్ సెంటర్లో సీటు కోసం వందలమంది నిరుద్యోగులు అర్ధరాత్రి నుంచే బారులు తీరారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. శిక్షణ కోసం వస్తున్న అభ్యర్థుల రద్దీని తట్టుకునేందుకు ఇక్కడ చాలా ఇన్స్టిట్యూట్లు ఒకేసారి నాలుగైదు బ్యాచ్‌లను కొనసాగిస్తున్నాయి. దసరా తర్వాత టీఎస్పీఎస్సీ సభ్యుల నియామకం! ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ)ను ఏర్పాటు చేసింది. కమిషన్ చైర్మన్, సభ్యులను దసరా తరువాత నియమించేందుకు ఫైలు సిద్ధం చేస్తోంది. కమిషన్ పూర్తి స్థాయిలో ఏర్పడిన వెంటనే ప్రస్తుతం ఏపీపీఎస్సీలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది విభజనకు చర్యలు చేపట్టనుంది. మొత్తానికి వచ్చేనెలలో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఆ తరువాత పోటీ పరీక్షల నిర్వహణకు అవసరమైన చర్యలపై దృష్టి సారించనుంది. అందుకు శాఖల వారీగా ఇండెంట్లు తెప్పించుకోవాల్సి ఉంది. మరోవైపు పరీక్షల సంస్కరణలు, వార్షిక కేలండర్‌ను ప్రకటించేం దుకు అవసరమైన చర్యలూ చేపట్టనుంది. మూడేళ్ల నుంచి నోటిఫికేషన్ల కరువు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గత మూడేళ్ల నుంచి ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా సజావుగా జారీ కాలేదు. దీంతో గరిష్ట వయోపరిమితిని పెంచాల్సిన అవసరం ఏర్పడింది. అందుకు అవసరమైన ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి జారీ చేయాలి. ఈ ప్రక్రియ మొత్తాన్ని నవంబర్ లోపు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. వీలైతే డిసెంబర్ మొదటి వారం లేదా చివరి వారంలో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 పరీక్షలకు నోటిఫికేషన్లను జారీ చేసే అవకాశం ఉంది. కోచింగ్ కోసం బారులు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో కొత్త సినిమా వస్తే అభిమానులు టికెట్ల కోసం బారులు తీరడం మనకు తెలిసిందే... దానికి ఏ మాత్రం తీసిపోని విధంగా కోచింగ్ సెంటర్లో సీటు కోసం నిరుద్యోగులు క్యూ కడుతున్నారు. ఆదివారం గాంధీనగర్‌లోని ఓ స్టడీ సర్కిల్లో గ్రూప్-2 శిక్షణలో సీటు కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వేలాదిగా అభ్యర్థులు తరలివచ్చారు. ఇక్కడ గ్రూప్- 2 కోచింగ్ కోసం ఇప్పటికే మూడు బ్యాచ్‌లు నడుస్తుండగా మరో మూడు బ్యాచ్‌ల కోసం 1,500 దరఖాస్తులను ఇస్తున్నారని తెలియడంతో వందలాదిమంది నిరుద్యోగులు అర్ధరాత్రి నుంచే ఇక్కడ బారులు తీరారు. అలాగే, ఎన్బీకే ఎస్టేట్‌లో ఉన్న మరో ఇన్స్టిట్యూట్లో సీటు కోసం ఇదే విధంగా యువత బారులు తీరింది. అశోక్‌నగర్, చిక్కడపల్లిలోని దాదాపు ప్రతి కోచింగ్ సెంటర్ల వద్ద ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణలో 98 వేల ఖాళీలు.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 98,016 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం లెక్కలు తేల్చింది. ఇవి కాకుండా ఈ మూడునాలుగు నెలల్లో ఖాళీ అయిన పోస్టులు వీటికి అదనం. అయితే వాటిలోని 20 నుంచి 25 వేల పోస్టుల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగులు పని చేస్తున్నట్లు అంచనా. మరోవైపు కొన్ని పదోన్నతులపై భర్తీ చేయాల్సిన పోస్టులు ఉన్నాయి. మొత్తానికి డెరైక్టు రిక్రూట్మెంట్ ద్వారా దాదాపు 50 వేల పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. వాటిల్లో ప్రధానంగా టీచర్ పోస్టులు 15 వేలు ఉండగా, జూనియర్ లెక్చరర్ పోస్టులు 2,500 వరకు ఉన్నాయి. మరోవైపు పోలీసు కానిస్టేబుల్, గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 తదితర కేటగిరీల్లో పోస్టులను భర్తీ చేయనుంది. గ్రూప్-4లో నాలుగు వేలకు పైగా పోస్టులు రానున్నాయి. శాఖల వారీగా ఖాళీలు ఇవీ ... విద్యాశాఖలో: డిప్యూటీ డీఈఓ- 40, డిప్యూటీ ఐఓఎస్- 21, సీటీఈ లెక్చరర్స్- 48, డైట్ లెక్చరర్స్-166, ఎంఈఓ- 399 పోస్టులు ఉన్నాయి. వీటిలో 30 శాతం పోస్టులను డెరైక్ట్ రిక్రూట్మెంట్, మిగతావి పదోన్నతులపై భర్తీ చేస్తారు. టీచర్ కేటగిరీలో: పీజీటీ- 1,131, టీజీటీ- 719, డ్రాయింగ్, ఆర్ట్ టీచర్స్ - 254, క్రాఫ్ట్ టీచర్స్- 313, లాంగ్వేజ్ పండిట్- 765, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం -270, పీఈటీ - 404, స్కూల్ అసిస్టెంట్ - 3,367, స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ టీచర్ - 616, ఎస్జీటీ - 11,874, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ - 184 పోస్టులను విద్యాశాఖ డీఎస్సీ ద్వారా భర్తీ చేయనుంది. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని పీఈటీ - 49, స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) బయాలజీ - 164, ఎస్ఏ ఇంగ్లిష్ - 167, ఎస్ఏ హిందీ - 136, ఎస్ఏ మ్యాథ్స్ - 215, ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ - 186, ఎస్ఏ ఫిజికల్సైన్స్ - 233, ఎస్ఏ సోషల్ - 117, ఎస్ఏ తెలుగు - 130, ఎస్జీటీ - 473 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. వైద్య శాఖలో: మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులు 3,500 పంచాయతీరాజ్ శాఖలో: గ్రేడ్-1 పంచాయతీ సెక్రటరీ - 417, గ్రేడ్-2 పంచాయతీ సెక్రటరీ - 371, గ్రేడ్-4 పంచాయతీ సెక్రటరీ - 1,143, గ్రేడ్-3 పంచాయతీ సెక్రటరీ - 2,111, వీఆర్ఓ అండ్ వీఏఓ - 4,081, విలేజ్ సర్వెంట్- వీఆర్ఏ- 1,087 పోస్టులు ఉన్నాయి. పోలీసు శాఖలో: కానిస్టేబుల్ పోస్టులు 7 వేల వరకు ఉన్నాయి. వీటిని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేస్తారు. గ్రూప్-1 కేటగిరీలో: డీఎస్పీ-5, డివిజినల్ పంచాయతీ ఆఫీసర్- 2, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ -6, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-19, ఎంపీడీఓ-114, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్-32 ఉన్నాయి. గ్రూప్-2 కేటగిరీలో: డిప్యూటీ తహసీల్దార్-156, రెవెన్యూ ఇన్స్పెక్టర్- 77, గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్-78, గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్-45, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్-4, ప్రొహిబిషన్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్- 99, అగ్రికల్చర్ ఏవో -290 తదితర పోస్టులు ఉన్నాయి. -
వర్షం కోసం వేయికళ్లతో ఎదురు చూపులు
-
ఆశల గూడు
సొంతింటి కోసం పేదల ఎదురుచూపులు జిల్లాలో 2,18,000 మంది నిరీక్షణ ‘ఇందిరమ్మ ఇళ్ల’పై నివేదిక ఇవ్వాలని సర్కారు ఆదేశం కసరత్తు మొదలుపెట్టిన అధికారులు ‘గూడు లేని ప్రతి ఒక్క నిరుపేదకూ రూ.3 లక్షలకు పైగా వ్యయంతో 125 గజాల స్థలంలో ఇంటిని నిర్మించి ఇస్తాం. రెండు బెడ్రూంలు.. ఒక హాలు.. వంట గదితోపాటు మరుగుదొడ్డి ఉండేలా నిర్మాణాలు చేపడతాం.’ - కేసీఆర్ హన్మకొండ : ఎన్నికల ప్రచార సభల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇళ్లు లేని పేదోళ్లకు వరం కురిపించారు. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో గూడు లేని సామాన్యుల్లో కొత్త ఆశలు చిగురిస్తు న్నాయి. సొంతింటి కల సాకారమవుతుందనే గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. వారు ఆశ పడ్డట్లే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. ఇదివరకు ఇందిరమ్మ పథకంలో చేపట్టిన ఇళ్లు... పూర్తి కాని నిర్మాణాలు ఎన్ని... ప్రారంభానికి నోచుకోని ఇళ్లు ఎంత వరకు ఉన్నాయి... వంటి అంశాలను పూర్తి స్థాయిలో క్రోడీకరించి నివేదిక అందజేయూలని జిల్లా యంత్రాంగాన్ని సర్కారు ఆదేశించింది. దీన్ని బట్టి త్వరలో కొత్త ఇళ్లు మంజూరు కానున్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా... ఇక్కడే సవాలక్ష సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కొత్త రాష్ట్రంలో కొత్త ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వ పాలసీ (విధానం) ఏవిధంగా ఉంటుందో తెలియక లబ్ధిదారులు మదనపడుతున్నారు. ఎవరికి వర్తించేనో... ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మూడు విడతల్లో పూర్తయిన నిర్మాణాలు జిల్లాలో 2 లక్షలు ఉన్నాయి. మొదటి, రెండో విడతలో గ్రామీణ ప్రాంతంలోని లబ్ధిదారులు ఒక్కొక్కరికి అప్పటి ప్రభుత్వం రూ.45 వేలు... పట్టణ ప్రాంతంలోని వారికి రూ.65 వేలు మంజూరు చేసింది. నిర్మాణ సామగ్రి వ్యయం పెరగడంతో మూడో విడతలో గ్రామాల్లోని ఒక్కో లబ్ధిదారుడికి రూ.65 వేలు... పట్టణంలో అయితే ఒక్కొక్కరికి రూ.లక్ష మంజూరు చేసింది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రూ.3 లక్షలకు పైగా వ్యయంతో గూడు లేని పేదలకు ఇల్లు నిర్మిస్తామని టీఆర్ఎస్ పార్టీ మెనిఫెస్టోలో ప్రకటించింది. ఈ లెక్కన ఇందిరమ్మ పథకంలో నిర్మాణాలు పూర్తిఅయిన లబ్ధిదారులకు ఇది వర్తిస్తుందా... వర్తించదా అనే సందేహం నెల కొంది. ఒక వేళ వర్తింపజేస్తే ఎలా సర్దుబాటు చేస్తారు.. నిర్మాణాల మాడిఫికేషన్ ఎలా అనేది చిక్కుముడిగా మారింది. ఇందిరమ్మ పథకంలో ఇప్పటివరకు ప్రారంభం కాని ఇళ్లను రద్దు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. పాత లబ్ధిదారులకు ఆ స్థానంలో కొత్త ఇళ్లు మంజూరు చేస్తారా... లబ్ధిదారులను మళ్లీ ఎంపిక చేస్తారా... అనేది స్పష్టత రాలేదు. సొంతింటి కోసం రచ్చబండ సభల్లో దరఖాస్తు చేసుకున్న వారు జిల్లాలో కోకొల్లలు. వాటి పరిశీలన సైతం పూర్తయింది. లభ్ధిదారులు హౌసింగ్ కార్యాలయూలు చుట్ట ప్రదక్షిణలు చేసినా ఇళ్ల మంజూరుకు నోచుకోలేదు. ఇప్పుడు ఆ దరఖాస్తులనే పరిగణనలోకి తీసుకుంటారా... మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోమంటారా.. అనేది తెలియడం లేదు. 2,18,000 మంది ఎదురుచూపు... ఇందిరమ్మ ఇళ్ల పథకం అసలైన నిరుపేదలకు దూరంగానే ఉంది. ప్రభుత్వ ఆర్థిక సాయం ఎటూ సరిపోకపోవడంతో నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఇందిరమ్మ పథకం అమలు కు నోచుకున్న నాటి నుంచి జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 4.20 లక్షల ఇళ్లు మంజూరయ్యూయి. వీటిలో పూర్తయిన నిర్మాణాలు 2 లక్షలే. మిగిలిన వాటిలో 97 వేల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభానికి నోచుకోలేదు. మిగిలిన ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో మూలుగుతున్నాయి. అదేవిధంగా... ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు మంజూరు చేయూలని రచ్చబండ సభల్లో పేదలు పెట్టుకున్న ఆర్జీలకు మోక్షం లేకుండా పోయింది. సుమారు 1.21 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ లెక్కన ప్రారంభానికి నోచుకోని ఇళ్లతో కలిపి ఇప్పటికిప్పుడు 2,18,000 మంది పేదలు సొంతింటి కల సాకారం కోసం సర్కారు వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. వీరిలో సుమారు లక్ష మందికి స్థలం కూడా లేదు. ఇక... సర్కారు సాయం సరిపోక పునాదులు తీసి, గోడలు పెట్టి నిర్మాణాలను మధ్యలోనే ఆపేసిన 1,23,000 మంది సైతం కేసీఆర్ హామీపై ఆశలు పెట్టుకున్నారు. కాగా, కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత గృహ నిర్మాణ సంస్థ కార్యాకలాపాలకు తాళం పడింది. గత నెల 12వ తేదీ నుంచి ఇందిరమ్మ ఇంటికి ఒక్క రూపాయి బిల్లు కూడా చెల్లించలేదు. తాజాగా ప్రభుత్వ ఆదేశాలతో హౌసింగ్ అధికారులు జాబితా పంపించే పనిలో పడ్డారు. లబ్ధిదారుల పూర్తి వివరాలను మరోసారి చెక్ చేసుకుంటున్నారు. -
దూసుకుపోతున్న మలయాళ బ్యూటీ