తండ్రికి బదులు నాలుగేళ్ల కుమారుడు అరెస్ట్
టీనగర్: సారారుు వ్యాపారిని అరెస్టు చేయడం వీలుకానందున అతని నాలుగేళ్ల కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. అరక్కోణం ప్రాంతంలో దొంగసారా విక్రయాలను అడ్డుకునేందుకు ఎకై ్సజ్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు జరుపుతూ వచ్చారు. మేల్ఆవత్తం గ్రామానికి చెందిన వేదగిరి (35). ఇతను సారా వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వేదగిరిపై ఇదివరకే సారా విక్రయం, ఇసుక చోరీ కేసులు పెండింగ్లో ఉన్నారుు. ఇలావుండగా ప్రత్యేక దళం పోలీసులు సారా వ్యాపారి వేదగిరిని అరెస్టు చేసేందుకు మేల్ఆవత్తం గ్రామానికి వెళ్లారు. ఆ సమయంలో అతను ఇంట్లో లేడు.
అతని భార్య, నాలుగేళ్ల కుమారుడిని ప్రైవేటు పాఠశాల వ్యానులో ఎక్కించి ఇంటికి చేరుకున్నారు. ఆమె వద్ద పోలీసులు విచారణ జరపగా భర్త ఇంట్లో లేడని, తన కుమారుని పాఠశాల వ్యానులో ఎక్కించి వస్తున్నట్లు తెలిపారు. వెంటనే పోలీసులు పాఠశాల వ్యానును వెంబడించి అందులో ఉన్న వేదగిరి నాలుగేళ్ల కుమారుడిని అరక్కోణం తాలూకా పోలీసు స్టేషన్కు తీసుకువెళ్లారు. అంతేకాకుండా సంగీతతో భర్తను తీసుకువస్తేనే బిడ్డను విడిపిస్తామని తెలిపారు.
వెంటనే సంగీత అన్వర్తిఖాన్పేటలోగల పాఠశాలకు వెళ్లారు. అక్కడ పాఠశాల యాజమాన్యంతో మీ పాఠశాల వ్యానులో తీసుకువెళ్లిన బిడ్డను పోలీసులు పట్టుకువెళ్లారని, ఇందుకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని వాగ్వాదం జరిపారు. దీంతో దిగ్భ్రాంతి చెందిన పాఠశాల యాజమాన్యం పోలీసు స్టేషన్కు వెళ్లి బాలుని రక్షించి సంగీతాకు అప్పగించారు. దీనికి సంబంధించి డీఐజీ తమిళరసన్, పోలీసు సూపరింటెండెంట్ పలగవన్లకు సంగీత ఫిర్యాదు చేశారు. దీనిగురించి విచారణ జరపాల్సిందిగా వారు ఆదేశాలు ఇచ్చారు.