పెళ్లి చేసుకుంటానని మోసం...జైలు
గుత్తి(అనంతపురం): అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని టి కొత్తపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన అదే గ్రామానికి చెందిన ఆది శేషయ్యకు మూడేళ్ల జైలుశిక్ష, రూ. 1500లు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 2010లో ఆ యువతిని ఆదిశేషయ్య మోసం చేయగా బాధితురాలు కోర్టుకు వెళ్లింది. దీంతో స్థానిక కోర్టు శుక్రవారం తీర్పు నిచ్చింది.