సమాచారం అందించని అధికారులకు జరిమానా
సాక్షి, హైదరాబాద్: సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్న అర్జీదారులకు సకాలంలో సమాచారం అందించని 18 మంది అధికారులకు జరిమానా విధిస్త్తూ రాష్ట్ర సహ చట్టం కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు గురువారం ఉత్తర్వులిచ్చారు.
సమాచార అధికారులైన మెదక్ జిల్లా ఆందోల్-జోగిపేట నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ విజయలక్ష్మి, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూకట్పల్లి సర్కిల్-14కు చెందిన ఎం. అశోక్, టి.పాండురంగారావులకు రూ.10 వేల చొప్పున, జహీరాబాద్, భైంసా మున్సిపల్ కమిషనర్లు ఎన్.మధుసూదన్, మహ్మద్ యూసుఫ్, నిర్మల్ మున్సిపల్ మేనేజర్ ఎంఏ నజీర్, శానిటరీ ఇన్స్పెక్టర్ మహ్మద్ మోయిజ్, నల్లగొండ మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్ బి. అఖీల్, మంచిర్యాల మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ మహేశ్వరరెడ్డి, హైదరాబాద్ ఎల్బీనగర్ ఏసీపీ ఫారుఖీ, కేసముద్రం నగర పంచాయతీ అధికారి రషీద్, సచివాలయంలోని మున్సిపల్ పాలన, పట్టణాభివృద్ధి విభాగం (ఎంఏయూడీ) ఏఎస్వో బి.వెంకటేశ్వర్లుకు రూ.5 వేల చొప్పున, ఆదిలాబాద్ మున్సిపల్ మేనేజర్ జగన్మోహన్రావు, జనగామ మున్సిపల్ కమిషనర్ టి. మనోహర్, నారాయణపేట మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్ రమేష్, సత్తుపల్లి మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్ విజయలక్ష్మిలకు రూ.3 వేల చొప్పున, భూపాలపల్లి బిల్‌కలెక్టర్ శ్రీనివాస్‌కు రూ.4 వేలు జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.