'అవార్డు వాపసీ ఓ ఫ్యాషన్ అయింది'
పుణె: అవార్డులు తిరిగి వెనుకకు ఇచ్చేయడం ఓ ఫ్యాషన్‌గా మారిపోయిందని ప్రముఖ భారతీయ ఆంగ్ల రచయిత చేతన్ భగత్ అన్నారు. సోమవారం పుణెలోని పింప్రి వద్ద జరిగిన 89వ ఆల్ ఇండియా మరాఠీ సాహితీ సంగోష్టి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..
'రచయితల్లో భిన్నరకాల వారున్నారు. వారిలో కొందరు అవార్డులను గెలుచుకునేందుకు ప్రయత్నించేవారైతే.. ఇంకొందరు అవార్డులను వెనుకకు ఇచ్చేవారు. నేను నాకోసం రచనలు చేస్తుంటాను. అవార్డు వాపసీ(అవార్డులు వెనుకకు ఇచ్చేయడం) పెద్ద ఫ్యాషన్ గా మారిపోయింది. ఈ విషయం చాలాకాలంగా ఆందోళన కలిగిస్తున్నది. అయితే, నేను ఇటీవల ఎలాంటి అవార్డులను తీసుకోలేదు. అందుకే వెనక్కి తిరిగి ఇచ్చేయడమనే ప్రశ్నకు అవకాశమే లేదు' అని చేతన్ అన్నారు. రచయితలు వారి రచనల ద్వారా పాఠకుల ప్రేమను, అనుబంధాన్ని గెలుచుకుంటారని, అలాంటి వాటిని తిరిగి వెనక్కు ఇచ్చేసినట్లవుతుందని తెలిపారు.