Xavier Institute
-
ఆ విద్యార్థులకు 2 నెలలకి రూ.5 లక్షల వేతనం
కోల్కత్తా : జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, జంషెడ్పూర్ విద్యార్థులు సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రొగ్రామ్ కింద భారీ ఎత్తున్న వేతనం పొందుతున్నారు. ఈ బీ-స్కూల్ కేవలం రెండు రోజుల్లో పూర్తిచేసిన ఈ ఇంటర్న్‌షిప్ ప్లేస్మెంట్ ప్రాసెస్‌లో, టాప్ కంపెనీలు పాల్గొన్నాయి. ప్రైస్వాటర్హౌజ్కాపర్స్, కోకాకోలా, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు విద్యార్థులను తమ ఇంటర్న్‌లుగా తీసుకున్నాయి. ఇంటర్న్‌లుగా నియమించుకున్న వీరికి అత్యధిక వేతనం కింద రూ.5 లక్షల వరకు చెల్లిస్తున్నట్టు తెలిసింది. ''2017-19 బ్యాచ్‌కు చెందిన 364 మంది విద్యార్థులు 100 శాతం ప్లేస్మెంట్ పొందారు. వీరికి సగటు వేతనం 20 శాతం పైగా పెరిగి, రెండు నెలలకు గాను రూ.5 లక్షలను టచ్ చేసింది'' అని జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రకటించింది. 90కి పైగా కంపెనీలు ఈ ఇంటర్న్‌షిప్ ప్లేస్మెంట్లో పాల్గొన్నాయి. కన్సల్టింగ్, ఫైనాన్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్, ఆపరేషన్స్, బిజినెస్ డెవలప్మెంట్, హ్యుమన్ రిసోర్స్, ఇండస్ట్రీయల్ రిలేషన్స్ వంటి పొజిషన్లను కంపెనీలు విద్యార్థులకు ఆఫర్ చేశాయి. పలు కొత్త కంపెనీలు కూడా ఈ రిక్రూటర్స్ జాబితాలో ఉన్నాయి. జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్లేస్మెంట్ ప్రొగ్రామ్‌లో టాప్ రిక్రూటర్లుగా బీసీజీ, పీడబ్ల్యూసీ, కోకా-కోలా, హెచ్‌సీసీబీ, హెచ్‌యూఎల్, ఐటీసీ, పీ అండ్ జీ, టీఏఎస్, ఆర్బీ, మైక్రోసాఫ్ట్, ఉబర్, ఏబీజీ వంటి పలు సంస్థలున్నాయి. రంగాల పరంగా ఎఫ్ఎంసీజీ 27 శాతం షేరుతో టాప్‌లో ఉంది. -
'వాట్సాప్' తో నేరుగా ఉద్యోగాలు!
ముంబై: ఉద్యోగాలు సంపాదించడానికి ఆఫీసుల చుట్టూ తిరగడం ఒకప్పటిమాట.. టెలిఫోనిక్ రౌండ్ ద్వారా సెలక్ట్ చేసుకోవడం నిన్నటిమాట.. సోషల్ మీడియా సహాయంతో ఇంట్లో ఉన్న అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి జాబ్స్ కల్పించటం నేటి మాట. ఇంటర్ నెట్ యుగంలో ఈ తంటాలు అవసరం లేదని భావించిన ఓ కంపెనీ సోషల్ మీడియాను తమ అభ్యర్థుల ఎంపికకు మార్గమని భావించింది. గుర్గావ్ కు చెందిన బోధిసత్వాదాస్ గుప్తా అనే క్రియేటివ్ డైరెక్టర్ 'వాట్సాప్'ను తన మాధ్యమంగా తీసుకున్నాడు. వాట్సాప్ లో 'ది ఇంటర్న్ షిప్' అనే గ్రూప్ ఏర్పాటు చేసి ఉద్యోగాల కోసం చూస్తున్న విద్యార్థుల సమాచారాన్ని అప్ డేట్ చేశాడు. ఇటీవల జేవియర్ ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ కు చెందిన ఆరుగురు విద్యార్థులను వాట్సాప్ ద్వారా ఇంటర్వ్యూ చేసి యాడ్ ఏజెన్సీలో ఉద్యోగాలు కల్పించాడు. ఈ నూతన విధానంతో తమకు జాబ్స్ రావడంతో వారు చాలా ఆనందంతో పాటు ఆశ్చర్యానికి లోనయ్యారు. రెస్యూమ్ చూసి విద్యార్థులు, నిరుద్యోగుల టాలెంట్ ఎంటో తెలిసిపోతుందని, తమ చట్టుపక్కల ఉన్న వారికి అవకాశాలు కల్పిస్తే వారికి కూడా జర్నీ టైమ్ కలిసొస్తుందని దాస్ గుప్తా అభిప్రాయపడ్డాడు. ఇంటర్వ్యూల్లో ఇది కొత్త పద్దతి. అయితే ఈ విధంగా ఉద్యోగుల ఎంపిక అనేది సరైన ఇంటర్వ్యూ అని తాను అభిప్రాయపడట్లేదని ఓ ప్రైవేట్ కంపెనీ నిర్వాహకుడు సాయ్ పద్వాల్ అన్నారు. విద్యార్థులు సోషల్ మీడియా మాధ్యమాలైన ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా ఇప్పటికే రిక్రూట్ అవుతున్నారని, రాబోయే రోజుల్లో సోషల్ మీడియా మరిన్ని మాధ్యమాల ద్వారా ఉద్యోగావకాశాలు పొందుతారని క్రియేటివ్ హెడ్ దాస్ గుప్తా వివరించారు.