young former
-
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో యువ రైతు మృతి
అధికారులను శిక్షించాలని గ్రామస్తుల ఆగ్రహం మందమర్రి : విద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష్యంతో శుక్రవారం ఉదయం కరెంట్ షాక్‌తో మందమర్రి మండలంలోని చిర్రకుంట గ్రామానికి చెందిన చిలుకల రాజయ్య (38)అనే యువ రైతు మృతి చెందాడు. రాజయ్య శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో పొలంలో మందు వేసేందుకు నెత్తిపై డబ్బా ఎత్తుకుని వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎజీఎల్ 3 ఫేస్‌కు సంబంధించిన లైన్ వైర్లు వేలాడుతూ నెత్తిపై ఉన్న డబ్బాకు తగిలాయి. విద్యుదాఘాతానికి గురైన రాజయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గుర్తించి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో కరెంట్ వైర్లుకు అంటుకున్న రాజయ్య కిందపడిపోయాడు. కానీ అప్పటికే మృతి చెందాడు. మతుడికి భార్య జయలక్ష్మి, ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్చార్జి ఎస్సె లక్ష్మణ్ కేసు నమోదు చేసుకున్నారు. అధికారులు బాధ్యతవహించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన విప్ విద్యుత్ షాక్‌తో మరణించిన రాజయ్య మృతదేహన్ని ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా విప్ ఓదెలు మాట్లాడుతూ, రాజయ్య కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. -
విద్యుత్ షాక్‌కు యువlరైతు బలి
స్టార్టర్ సరిచేసే క్రమంలో ప్రమాదం దండేపల్లి : విద్యుదాఘాతంతో యువ రైతు నిండు ప్రాణాలు కోల్పోయిన ఘటన దండేపల్లిలో సోమవారం సాయత్రం చోటుచేసుకుంది. స్థానికులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... దండేపల్లికి చెందిన యువ రైతు చెన్నవేని రమేశ్(22)కు కర్ణపేట సమీపంలో ఎకరం పొలం ఉంది. పొలానికి నీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన వ్యవసాయ మోటారు స్టార్టర్‌ను సరిచేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై పొలంలోనే ప్రాణాలు వదిలాడు.. స్టార్టర్ డబ్బా ఇనుపది. పైగా అందులో ఒక వైరు ఊడి స్టార్టర్ డబ్బాకు తగిలి ఉంది. పొలానికి వెళ్లిన రమేశ్ స్టార్టర్ డబ్బా తలుపు తెరుస్తుండగానే షాక్‌కు గురై డబ్బాపైనే పడిపోయాడు. కింద పొలం నిండా నీళ్లు ఉన్నాయి. దీంతో షాక్ తగిలిన వెంటనే ప్రాణాలు పోయాయి. అతడి వెంట వెళ్లిన ఓ మిత్రుడు గమనించి కర్రతో కొట్టగా పక్కకు పడిపోయాడు. వెంటనే అతడు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. తల్లిదండ్రులు, బంధువులు పొలానికి చేరుకుని బోరున విలపించారు. సంఘటన స్థలానికి ఎస్సై రాములు చేరుకుని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నార. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కగానొక్క కొడుకు... చెన్నవేని రాజన్న–పోసవ్వ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. రమేశ్ ఒక్కడే మగ సంతానం. తండ్రి రాజన్న గొర్రెల కాపరిగా పనిచేస్తున్నాడు. దీంతో వ్యవసాయ పనులన్నీ రెండేళ్లుగా రమేశే చేస్తున్నాడు. చేతికి అందివచ్చిన సమయంలో కొడుకు మరణించడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. సంఘన స్థలంలో విగత జీవిగా పడి ఉన్న కొడుకు మతదేహంపై పడి బోరున విలపించారు. -
అనంతలో యువరైతు ఆత్మహత్య
నార్పల: అనంతపురం జిల్లాలో మరో యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నార్పల మండలం దుగుమర్రి గ్రామానికి చెందిన నాగరాజు (27) ఆదివారం పురుగుల మందుతాగి బలవన్మరనానికి పాల్పడ్డాడు. తనకున్న నాలుగెకరాల భూమిలో పత్తిపంట సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తుపకప నాగరాజు.. పంట వేయడానికి పెట్టుబడి కోసం రూ. 2 లక్షలు అప్పు తెచ్చాడు. పంట ఎండిపోవడంతో అప్పు తీర్చే దారి కనపడక.. ఈరోజు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.