- అధికారులను శిక్షించాలని గ్రామస్తుల ఆగ్రహం
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో యువ రైతు మృతి
Published Fri, Aug 26 2016 11:19 PM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM
మందమర్రి : విద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష్యంతో శుక్రవారం ఉదయం కరెంట్ షాక్‌తో మందమర్రి మండలంలోని చిర్రకుంట గ్రామానికి చెందిన చిలుకల రాజయ్య (38)అనే యువ రైతు మృతి చెందాడు. రాజయ్య శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో పొలంలో మందు వేసేందుకు నెత్తిపై డబ్బా ఎత్తుకుని వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎజీఎల్ 3 ఫేస్‌కు సంబంధించిన లైన్ వైర్లు వేలాడుతూ నెత్తిపై ఉన్న డబ్బాకు తగిలాయి. విద్యుదాఘాతానికి గురైన రాజయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గుర్తించి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో కరెంట్ వైర్లుకు అంటుకున్న రాజయ్య కిందపడిపోయాడు. కానీ అప్పటికే మృతి చెందాడు. మతుడికి భార్య జయలక్ష్మి, ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్‌చార్జి ఎస్సె లక్ష్మణ్ కేసు నమోదు చేసుకున్నారు. అధికారులు బాధ్యతవహించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన విప్
విద్యుత్ షాక్‌తో మరణించిన రాజయ్య మృతదేహన్ని ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా విప్ ఓదెలు మాట్లాడుతూ, రాజయ్య కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.
Advertisement