- స్టార్టర్ సరిచేసే క్రమంలో ప్రమాదం
విద్యుత్ షాక్‌కు యువlరైతు బలి
Published Mon, Aug 1 2016 11:49 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM
దండేపల్లి : విద్యుదాఘాతంతో యువ రైతు నిండు ప్రాణాలు కోల్పోయిన ఘటన దండేపల్లిలో సోమవారం సాయత్రం చోటుచేసుకుంది. స్థానికులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... దండేపల్లికి చెందిన యువ రైతు చెన్నవేని రమేశ్(22)కు కర్ణపేట సమీపంలో ఎకరం పొలం ఉంది. పొలానికి నీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన వ్యవసాయ మోటారు స్టార్టర్‌ను సరిచేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై పొలంలోనే ప్రాణాలు వదిలాడు.. స్టార్టర్ డబ్బా ఇనుపది. పైగా అందులో ఒక వైరు ఊడి స్టార్టర్ డబ్బాకు తగిలి ఉంది. పొలానికి వెళ్లిన రమేశ్ స్టార్టర్ డబ్బా తలుపు తెరుస్తుండగానే షాక్‌కు గురై డబ్బాపైనే పడిపోయాడు. కింద పొలం నిండా నీళ్లు ఉన్నాయి. దీంతో షాక్ తగిలిన వెంటనే ప్రాణాలు పోయాయి. అతడి వెంట వెళ్లిన ఓ మిత్రుడు గమనించి కర్రతో కొట్టగా పక్కకు పడిపోయాడు. వెంటనే అతడు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. తల్లిదండ్రులు, బంధువులు పొలానికి చేరుకుని బోరున విలపించారు. సంఘటన స్థలానికి ఎస్సై రాములు చేరుకుని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నార. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఒక్కగానొక్క కొడుకు...
చెన్నవేని రాజన్న–పోసవ్వ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. రమేశ్ ఒక్కడే మగ సంతానం. తండ్రి రాజన్న గొర్రెల కాపరిగా పనిచేస్తున్నాడు. దీంతో వ్యవసాయ పనులన్నీ రెండేళ్లుగా రమేశే చేస్తున్నాడు. చేతికి అందివచ్చిన సమయంలో కొడుకు మరణించడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. సంఘన స్థలంలో విగత జీవిగా పడి ఉన్న కొడుకు మతదేహంపై పడి బోరున విలపించారు.
Advertisement