ఘట్టం.. | - | Sakshi
Sakshi News home page

ఘట్టం..

Published Sat, Nov 11 2023 1:02 AM | Last Updated on Sat, Nov 11 2023 1:02 AM

- - Sakshi

ముగిసిన నామినేషన్ల

సాక్షి,ఆదిలాబాద్‌: శాసనసభ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. వివిధ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి చేరుకున్న అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించడం జరిగింది. రాత్రి వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. ఇదిలా ఉంటే అక్టోబర్‌ 9న ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. నవంబర్‌ 3న ఎన్నికల కమిషన్‌ నుంచి నోటిఫికేషన్‌ జారీ అయింది. ఆ రోజు నుంచి మొదలైన నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో పూర్తయింది. ఈనెల 13న వాటి పరిశీలన చేపట్టనున్నారు. 15న ఉపసంహరణ ఉండనుంది.

రెబల్స్‌.. ఆసక్తికరం..

ఆదిలాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థిగా ఎ.సంజీవ్‌ రెడ్డి శుక్రవారం అట్టహాసంగా నామినేషన్‌ దాఖలు చేశారు. బోథ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిత్వం కోల్పోయిన వన్నెల అశోక్‌ గురువారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. దీంతో కాంగ్రెస్‌ రెబల్‌గా ఆయన బరిలో ఉంటారా అని అందరు భావించారు. అయితే శుక్రవారం ఆయన యుగ తులసీ పార్టీ నుంచి నామినేషన్‌ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి కారణం లేకపోలేదు. ఈ పార్టీ గుర్తు రోడ్‌ రోలర్‌. కారు గుర్తును పోలి ఉందని బీఆర్‌ఎస్‌ పార్టీ ఇదివరకు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. యుగ తులసీ పార్టీతో బీఆర్‌ఎస్‌కు ఒప్పందం జరిగిందనే ప్రచారం సాగింది. అయితే ఆదిలాబాద్‌, బోథ్‌లలో ఈ పార్టీ నుంచి అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతోనే వన్నెల అశోక్‌ స్వతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్‌కు రెబల్‌గా నిలుస్తారా.. లేనిపక్షంలో రోడ్‌ రోలర్‌ గుర్తుపై పోటీ చేయాలనుకోవడంతో ఆయన ఉద్దేశంపై ఆయా పార్టీల్లో గందరగోళానికి గురవుతున్నారు. ఇదిలా ఉంటే బోథ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన అభ్యర్థి ఆడె గజేందర్‌తో పాటు నరేశ్‌జాదవ్‌ నామినేషన్‌ వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఉపసంహరణ రోజు వరకు దీని విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం లేదు.

ఆదిలాబాద్‌ నియోజకవర్గం నుంచి నామినేషన్లు..

జోగు రామన్న (బీఆర్‌ఎస్‌), కంది శ్రీనివాసరెడ్డి (కాంగ్రెస్‌), పాయల్‌ శంకర్‌ (బీజేపీ), సత్యనారాయణ ఎల్చవార్‌ (బలిరాజ పార్టీ), కేమ శ్రీనివాస్‌ (ప్రజా ఏక్తా పార్టీ), సూర్యవంశీ విద్యాసాగర్‌ (బహుజన్‌ ముక్తి పార్టీ), అగ్గిమల్ల గణేష్‌ (ధర్మ సమాజ్‌ పార్టీ), ఉయిక ఇంద్ర (బహుజన్‌ సమాజ్‌ పార్టీ), గుడిపల్లి జ్ఞానేష్‌ (భారత చైతన్య యువజన పార్టీ), కె.భగవాన్‌ (రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండి యా), వాగ్మారే అభిషేక్‌ (ఆర్‌పీఐ), సురేష్‌ (యుగ తులసీ పార్టీ), టి.చంద్రషా (గోండ్వాన గణతంత్ర పార్టీ), స్వతంత్ర అభ్యర్థులు.. నాగన్న గాలిపెల్లి, ముండె ప్రవీణ్‌ కుమార్‌, భాను రాజేశ్వర్‌రావు, షేక్‌ అస్లమ్‌, సుభాష్‌ నవాటే, అన్నం దేవేందర్‌, టి.పండిత్‌ రావు, కె.విజయ్‌ కుమార్‌, గడ్డం సాయిమౌన రెడ్డి, గెడం జనార్దన్‌, ముండె ప్రవీణ్‌ కుమార్‌, తొగరి నిఖిలేష్‌, బెదోడ్కర్‌ గణేశ్‌, అల్లూరి సంజీవ్‌రెడ్డి, నవాటే సుభాష్‌, పాయల్‌ శరత్‌, మాదస్తు భుపేందర్‌, మోరే హరీష్‌చంద్ర, టి.ధర్మపాల్‌.

బోథ్‌ నియోజకవర్గం..

అనిల్‌ జాదవ్‌ (బీఆర్‌ఎస్‌), సోయం బాపురావు (బీజేపీ), ఆడె గజేందర్‌ (కాంగ్రెస్‌), నరేష్‌ జాదవ్‌ (కాంగ్రెస్‌), మెస్రం జంగుబాపు (బీఎస్పీ), ఉయికె ఉమేష్‌ (డీఎస్పీ), వన్నెల అశోక్‌ (యుగ తులసీ పార్టీ, స్వతంత్ర అభ్యర్థి), జాదవ్‌ గోపాల్‌ (భారత చైతన్య యువజన పార్టీ), బడు నైతం (గోండ్వాన గణతంత్ర పార్టీ), ఉయికె హీరాజి (రాష్ట్రీయ జనక్రాంతి పార్టీ), తొడసం ధనలక్ష్మి (స్వతంత్ర), జాదవ్‌ బొజ్జనాయక్‌ (స్వతంత్ర).

ఖానాపూర్‌ నియోజకవర్గం..

భుక్యా జాన్సన్‌ నాయక్‌ (బీఆర్‌ఎస్‌), రమేశ్‌రాథోడ్‌ (బీజేపీ), వెడ్మ బొజ్జు పటేల్‌ (కాంగ్రెస్‌), కె.విజయ (పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా), రాథోడ్‌ బన్సీలాల్‌ (బీఎస్పీ), రాథోడ్‌ కళ్యాణి (బీఎస్పీ), జాదవ్‌ ప్రభాస్‌ (ధర్మ సమాజ్‌ పార్టీ), రితేష్‌ రాథోడ్‌ (బీజేపీ), పెందూర్‌ ప్రియాంక (సీపీఐఎంఎల్‌ –రెడ్‌స్టార్‌), జి.గంగాధర్‌ (భారత చైతన్య యువజన పార్టీ), స్వతంత్ర అభ్యర్థులు.. ఎన్‌.రాజేందర్‌, జె.రవికిరణ్‌, మోహన్‌, బి.ఆశరెడ్డి, ఆత్రం రవీందర్‌, చౌహాన్‌ సేవదాస్‌, ఆత్రం భీంరావు.

ఆసిఫాబాద్‌ నియోజకవర్గం..

కోవ లక్ష్మి (బీఆర్‌ఎస్‌), శ్యామ్‌నాయక్‌ (కాంగ్రెస్‌), అజ్మీరా ఆత్మారాం నాయక్‌ (బీజేపీ), ఇతర పార్టీ లు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 23 మంది ఉన్నారు.

నియోజకవర్గం అభ్యర్థులు నామినేషన్‌ సెట్లు

వివిధ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు దాఖలు

ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌ రెబల్‌గా సంజీవ్‌రెడ్డి

యుగ తులసీ పార్టీ నుంచి వన్నెల అశోక్‌

బోథ్‌లో కాంగ్రెస్‌ నుంచి ఆడె గజేందర్‌తో పాటు నరేశ్‌ జాదవ్‌

13న నామినేషన్ల పరిశీలన, 15న ఉపసంహరణ

ఆదిలాబాద్‌ 32 54

బోథ్‌ 13 27

ఖానాపూర్‌ 17 26

ఆసిఫాబాద్‌ 23 33

No comments yet. Be the first to comment!
Add a comment
బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావ్‌ తరఫున నామినేషన్‌ దాఖలు చేస్తున్న ఆయన కూతురు కృష్టవేణి1
1/2

బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావ్‌ తరఫున నామినేషన్‌ దాఖలు చేస్తున్న ఆయన కూతురు కృష్టవేణి

2
2/2

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement