‘హామీల అమలులో కాంగ్రెస్ విఫలం’
ఆదిలాబాద్‌టౌన్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న, పార్టీ జిల్లా ఇన్చార్జి, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే వి.గంగాధర్‌గౌడ్ విమర్శించారు. ఈనెల 29న బీఆర్ఎస్ దీక్షా దివస్‌కు సంబంధించి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్, బీజేపీ తోడుదొంగలని, ఆ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. దీక్షా దివస్ సందర్భంగా ర్యాలీతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్, గ్రంథాలయ మాజీ చైర్మన్ రావుత్ మనోహర్, పార్టీ నాయకులు అజయ్, సాజిదొద్దీన్, నల్ల రాజేశ్వర్, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment