ఉద్యోగ భద్రత కల్పించాలని ఆందోళన
కై లాస్‌నగర్: వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని వైద్యఆ రోగ్య సంఘాల పోరాట కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్‌కుమార్ డిమాండ్ చేశారు. రాత పరీక్ష లేకుండా ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌తో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో 45రోజుల పాటు సమ్మె చేస్తే క్రమబద్ధీకరణ సాధ్యాసాధ్యాల పరిశీలన కోసం ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. అయితే ఆ కమిటీ ఇప్పటి వరకు నివేదికను బహిర్గతం చేయలేదన్నారు. తాజాగా రెగ్యులర్ కోసం ఏఎన్ఎంలకు రాత పరీక్ష నిర్వహించేందకు యోచిస్తుందన్నారు. వెంటనే ఆ నిర్ణయాన్ని మానుకోవాలని లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఇందులో కమిటీ నాయకులు ఆనంద, జ్యోతి, సంగీత, విజయలక్ష్మి, దేవుబాయి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment