విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
● సబ్‌కలెక్టర్ యువరాజ్ మర్మాట్
నార్నూర్: ప్రభుత్వ వసతి గృహాల్లో చదివే విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సబ్‌కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. నార్నూర్, గాదిగూడ మండలాల్లోని ఆశ్రమ పాఠశాలలను సోమవారం ఆయ న తనిఖీ చేశారు. నార్నూర్, ఝరి ఆశ్రమ పాఠశాలల్లో వంటగది, స్టోర్ రూంలతో పాటు రికార్డులను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించడంతో పాటు పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నా రు. అయిన వెంట ప్రధానోపాధ్యాయులు రవీందర్ రాథోడ్, వసంతరావు, తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment