అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన కారు
జన్నారం: మండలంలోని చింతగూడ సమీ పంలో ఆదివారం రాత్రి కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాలకు చెందిన పలు వురు యువకులు కారులో జన్నారం నుంచి మంచిర్యాలకు వెళ్తుండగా వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఘటనలో వా హనంలోని ఇంజిన్ ఎగిరిపడింది. ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో చిన్నచిన్న గా యాలతో యువకులు బయటపడినట్లు తెలి సింది. ఘటనపై ఎస్సై రాజవర్ధన్‌ను సంప్రదించగా ప్రమాదం జరిగిన మాట వాస్తవమే కానీ ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు.
తప్పిన పెను ప్రమాదం
సారంగపూర్: మండలంలోని ధని గ్రామ సమీపంలోని కల్వర్టు వద్ద కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఘటన సమయంలో కారులో డ్రైవర్ విష్ణువర్ధన్ ఒక్కడే ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న ఎస్సై శ్రీకాంత్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అతివేగం కారణంగానే కారు అదుపుతప్పినట్లు ఆయన వెల్లడించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment