No Headline
అరకులోయటౌన్: ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఆంధ్రా ఊటీ అరకులోయ పర్యాటకులకు ఆతిథ్యం అందించేందుకు సిద్ధమవుతోంది. పర్యాటక సీజన్ ప్రారంభం కావడంతో ఇక్కడి ప్రకృతి అందాలు తిలకించేందుకు వచ్చే ప్రకృతి ప్రేమికులు బస చేసేందుకు అన్ని రకాల సౌకర్యాలతో రిసార్టులు, హోటళ్లు, క్యాంపింగ్ టెంట్లను నిర్వాహకులు అందుబాటులో ఉంచుతున్నారు. ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్గఢ్, బెంగళూరు, తెలంగాణ రాష్ట్రాల పర్యాటకులతో పాటు దేశ, విదేశాల నుంచి ఈ ప్రాంతానికి వచ్చే ప్రకృతి ప్రేమికులకు ఇక్కడి ప్రకృతి అందాలు, లోయలు, సెలయేళ్లు కట్టిపడేస్తాయి. శీతాకాలంలో దట్టంగా కురుస్తున్న మంచును, చక్కెలిగింతలు పెట్టే చలిగాలలను ఆస్వాదిస్తూ టూరిస్టులు పులకించిపోతారు.
అరకులోయలో పర్యాటక సీజన్ ప్రారంభం
టూరిస్టుల కోసం సిద్ధమవుతున్న రిసార్టులు, క్యాంపింగ్ టెంట్లు
ముసాబవుతున్న లాడ్జీలు, హోటళ్లు
Comments
Please login to add a commentAdd a comment