కమ్మేసిన పొగమంచు
సాక్షి,పాడేరు/చింతపల్లి: జిల్లాలోని పలుప్రాంతాల్లో పొగమంచు కమ్మేసింది. ఉదయం 10 గంటల వరకూ దట్టంగా కురిసింది. సమీపంలో ఉన్నవి కూడా కనిపించనంతగా మంచు కప్పేసింది. శీతల గాలుల ప్రభావంతో చలితీవ్రంగా ఉంది. సోమవారం జి.మాడుగులలో 11.9, డుంబ్రిగుడలో 12.3, చింతపల్లిలో 13.2, హుకుంపేట 13, మినుములూరులో 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్, ఉష్ణోగ్రతల విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. గత వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉంటున్నాయి.ఉదయం సాయంత్రం వేళల్లో చలి గాలులు అధికంగా వీస్తున్నాయి. లంబసింగికి వచ్చే పర్యాటకులు చలి మంటలు వేసుకుని రక్షణపొందుతున్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు,పొలం పనులకు వెళ్లే రైతులు, కూలీలు చలితో ఇబ్బందులు పడుతున్నారు.
జి.మాడుగుల 11.9..
డుంబ్రిగుడ 12.3..
హుకుంపేట 13.0
పెదబయలు 13.1 డిగ్రీల
కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
పడిపోతున్న ఉష్ణోగ్రతలు
Comments
Please login to add a commentAdd a comment