రిసార్టులు, క్యాంపింగ్ టెంట్లు
అరకలోయలో పర్యాటకుల కోసం లాడ్జీలు, రిసార్టులు, క్యాంపింగ్ టెంట్లు, ఏపీ టూరిజం అతిథి గృహాలు సరికొత్త హంగులతో సిద్ధమయ్యాయి. ఏటా నవంబర్ మొదటి వారంలో పర్యాటక సీజన్ ప్రారంభమవుతుంది. టెంట్‌ల నిర్వహణకు అనుమతులు రావడం ఆలస్యం కావడంతో ఇప్పుడిప్పుడే ఏర్పాటు చేస్తున్నారు.
● పాడేరు ఐటీడీఏ పీవో అనుమతితో అరకులోయ పరిసర ప్రాంతాల్లో స్థానికులే అధిక సంఖ్యలో క్యాంపింగ్ టెంట్లు ఏర్పాటు చేస్తుంటారు. ఈ ఏడాది 30 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు ఇప్పటికి అనుమతి ఇచ్చారు.
● యూజర్ చార్జీల కింద ప్రతి టెంట్‌కు రూ.250 చొప్పున నిర్వాహకులు చెల్లించాలి. 10 టెంట్లకు రూ.2,500,.. 20 టెంట్లకు రూ. 5వేల చొప్పున డీడీ రూపంలో గానీ, అరకులోయ ఎంపీడీవో బ్యాంక్ ఖాతాలోగానీ నిర్వాహకులు చెల్లించాలి.
● ఒక్కో ప్రాంతంలో 10 నుంచి 20 వరకు టెంట్ల వరకూ ఏర్పాటు చేస్తారు. రెండు బెడ్‌ల టెంట్‌కు రోజుకు రూ.700, మూడు బెడ్‌ల టెంట్‌కు రూ.1,000, ఆరు బెడ్‌ల టెంట్‌కు రూ.1,800 చొప్పున టూరిస్టుల నుంచి నిర్వాహకులు వసూలు చేయాలి.
● ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధీనంలో అరకులోయలో హరిత వేలి రిసార్ట్స్‌లో 36 గదులు, రెండు వీఐపీ షూట్‌లు, స్విమింగ్ పూల్, గోష్టి కాన్ఫరెన్స్ హాల్ అందుబాటులో ఉన్నాయి.
● మయూరి హిల్ రిసార్ట్స్‌లో 49 రూములు అందుబాటులో ఉన్నాయి.
● అనంతగిరిలోని ఏపీ టూరిజం హరిత హిల్ రిసార్టులో 28 గదులు, తైడా జంగిల్ బెల్స్‌లో 9 గదులు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు రెస్టారెంట్ సౌకర్యం కూడా ఉంది. వెజ్, నాన్ వెజ్ ఆహారపదార్థాలు లభిస్తాయి.
● అరకులోయలో ప్రైవేటు లాడ్జీలు, హోటళ్లు, రిసార్టులు కలిపి మొత్తం 86 ఉన్నాయి. వీటిలో సుమారు 800 రూముల వరకు అందుబాటులో ఉన్నాయి. పర్యాటక శాఖ అతిథి గృహాలతోపాటు దాదాపు అన్ని ప్రైవేటు లాడ్జీలు, రిసార్టులకు ఆన్‌లైన్‌లో బుకింగ్ సౌకర్యం ఉంది.
అరకులోయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన
క్యాంపింగ్ టెంట్లు
Comments
Please login to add a commentAdd a comment