పసుపునకు ప్రత్యేక బ్రాండింగ్
సాక్షి, పాడేరు: జిల్లాలో పండిస్తున్న కాఫీ మాదిరిగానే పసుపునకు ప్రత్యేక బ్రాండింగ్ తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. ఉద్యానవనశాఖ, డిజిటల్ గ్రీన్ సంస్థల ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల సుస్థిర సాధికారతకు కలెక్టరెట్‌లో సోమవారం నిర్వహించిన సాంకేతిక శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏజెన్సీలో పండించే పసుపు లో ఔషధ గుణాలున్నాయని, వాటి శాతాన్ని లెక్కించి అమ్మకాలు చేస్తే రైతులు అధిక ధర పొందేందుకు వీలుంటుందన్నారు. దీనిపై రైతులకు ప్రత్యేక అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. డిజిటల్‌గ్రీన్ సంస్థ రాబోయే రెండు సంవత్సరాల్లో అరకు,పాడేరు,జి.మాడుగుల మండలాల్లోని ఐదు వేల మంది పసుపు రైతులకు సాగులో సలహాలు, సూచనలు అందించేందుకు నిర్ణయించడం అభినందనీయమని చెప్పారు.గిరిజన రైతులు సాగు చేస్తున్న పసుపులో కర్కుమిన్ పెంచడానికి కృషి చేయాలని చెప్పారు. ఉద్యావనశాఖ జిల్లా అధికారి రమేష్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 1.50 వేల ఎకరాల్లో కాఫీ, 75వేల ఎకరాల్లో మిరియాలు, 25వేల ఎకరాల్లో పసుపు పండిస్తున్నారన్నారు. ఇప్పటికే కాఫీ, మిరియాలు సాగును పెంచడంతోపాటు మార్కెటింగ్ చేసేందుకు ప్రత్యేక నెట్‌వర్క్ ఉందన్నారు. పసు పునకు ప్రత్యేకమైన మార్కెటింగ్ సదుపాయం లేక రైతులు నష్టపోతున్నారని చెప్పారు. జిల్లాలోని మూడు మండలాల్లో 5వేల మంది రైతులకు సాగు నుంచి మార్కెటింగ్ వరకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు డిజిటల్ గ్రీన్ సంస్థ నిర్ణయించిందన్నా రు. డిజిటల్ గ్రీన్ రాష్ట్ర ప్రతినిధి సురేంద్ర మాట్లాడుతూ భూసారం నుంచి మార్కెటింగ్ వరకు అవసరమైన సలహాలు, సూచనలను తమ సంస్థ అందిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో పసుపులో ఔషధ గుణాలు తెలిపే విధానా న్ని, మట్టి నమూనాలతో భూసారాన్ని లెక్కించడాన్ని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ను దుశ్శా లువాతో సన్మానించారు. జిల్లా వ్యవసాయ అధికా రి నందు, రైతు సాధికార సంస్థ జిల్లా మేనేజర్ భాస్కరరావు, డీఆర్‌డీఏ జిల్లా అధికారి మురళి, జిల్లా డాట్ సెంటర్ డాక్టర్ ప్రదీప్‌కుమార్, డిజిటల్ గ్రీన్ సంస్థ ప్రతినిధులు శ్రీకాంత్, సురేంద్ర, ఉద్యావనశాఖ మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎ.ఎస్. దినేష్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment