హర హర మహాదేవ
సాక్షి,పాడేరు: పవిత్ర కార్తీకమాసం చివరి సోమవా రం జిల్లా వ్యాప్తంగా శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు శివాలయాలకు తరలివెళ్లి అభిషేకాలు జరిపారు. హరహర మహాదేవ శంభో అంటూ భక్తిపారవశ్యంతో పూజలు చేశారు. బొర్రాగుహలు, కాశీపట్నం, అరకులోయలోని భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి, మత్స్యగుండంలోని మత్స్యలింగేశ్వరస్వామి,పాడేరులోని ఉమానీలకంఠేశ్వర సమేత రాజరాజేశ్వరి ఆలయం,పాతపాడేరు,లగిశపల్లి,కలెక్టర్ బంగ్లా, వంజంగి,సంగోడి, గెడ్డంపుట్టు, తామరాపల్లి,తురాయిమెట్ట శివాలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి.మహిళలు కార్తీక దీపాలను భక్తిశ్రద్ధలతో వెలిగించారు.
భారీ అన్న సమారాధన
ఉమానీలకంఠేశ్వర సమేత రాజరాజేశ్వరి ఆలయ ప్రాంగాణంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి,ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలంనాయుడులు భక్తులకు భోజనాలు వడ్డించారు. అన్నసమారాధనకు భక్తులు భారీగా తరలివచ్చారు.
పసుపు కుంకుమల పంపిణీ
పట్టణంలోని గౌరీపరమేశ్వరుల నెల రోజుల ఉత్సవాలలో భాగంగా గౌరీసేవాసంఘం ప్రతినిధులు మహిళలకు పసుపు,కుంకుమలను పంపిణీ చేశారు.పాడేరులోని అన్ని వర్గాల మహిళలు పసుపు,కుంకుమలను స్వీకరించారు. ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయంలోను పసుపు,కుంకుమ పంపిణీ చేశారు.
కార్తీక మాసం చివరి సోమవారం ప్రత్యేక పూజలు
కిక్కిరిసిన ఆలయాలు
Comments
Please login to add a commentAdd a comment