ప్రకృతి జల ప్రసాదం యూనిట్లు ప్రారంభం
డుంబ్రిగుడ/అరకులోయ టౌన్/అనంతగిరి(అరకులోయ రూరల్): పర్యాటక ప్రదేశాల్లో శుద్ధ జలాలను ప్రకృతి జల ప్రసాదం పేరుతో అందుబాటులోకి తీసుకురావడం హర్షణీయ మని జిల్లా అటవీ శాఖ అధికారి పి.వి.సందీప్‌రెడ్డి తెలిపారు. సుమారు రూ.29.50 లక్షలతో ప్రకృతి జల ప్రసాదం నీటి శుద్ధి యంత్రాలను అరకులోయ అటవీ శాఖ కార్యాలయం, డుంబ్రిగుడ మండలం అరకు పైనరీ ఉద్యానవనం, మరదగుడా ఎకోటూరిజం కార్యాలయం, అనంతగిరి మండలం చిలకల గెడ్డ ఎకో పార్క్‌లలో అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సోమవారం ఆ యూనిట్లను ప్రారంభించిన సందీప్ రెడ్డి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా అరకులోయ వంటి పర్యాటక కేంద్రాల్లో మొట్టమొదటి సారిగా శుద్ధ నీటి జలాలను ప్రకృతి జలప్రసాదం పేరుతో అందుబాటులోకి తీసుకురావడం హర్షణీయమన్నారు. దివీస్ జనరల్ మేనేజర్ వై.ఎస్.కోటేశ్వరరావు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టేందుకు తమ సంస్థ కృషి చేస్తుందన్నారు. సంస్థ ఎండీ మురళీ, కె.దివి, అటవీ శాఖ అదనపు అధికారి ఉమామహేశ్వరి, రేంజ్ ఆధికారి శ్రీనివాసరావు, దుర్గాప్రసాద్, పైనరీ మేనేజర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment