పి.యర్రగొండ, డుంబ్రిగుడ ఏకలవ్యలకు పతకాల పంట
వై.రామవరం/డుంబ్రిగుడ: ఇటీవల అనంతగిరి ఏకలవ్య పాఠశాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో డుంబ్రిగుడ, వై.రామవరం మండ లం పి.యర్రగొండ ఏకలవ్య పాఠశాలల విద్యార్థులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. పి.యర్రగొండ ఏకలవ్య మోడల్‌రెసిడెన్షియల్ పాఠశాల నుంచి 39 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొనగా 19 మందికి బంగారు, వెండి, కాంస్య పతకా లులభించాయి.వీరిలో 15 మంది జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ బురారామ్ భైరవ తెలిపారు. విద్యార్థులతోపాటు పీఈటీ ప్రశాంతకృష్ణ, ఉపాధ్యాయులు ప్రసాద్, సాగర్‌లను సోమవారం ప్రిన్సిపాల్ బురారామ్ భైరవ్ అభినందించారు. డుంబ్రిగుడ మండలంలోని ఏకలవ్య గురుకుల పాఠశాల విద్యార్థులు అన్ని విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్టు పిన్సిపాల్ డాక్టర్ సుమన్ కుమార్‌సింగ్ తెలిపారు. 17 మంది విద్యార్థులు ప్రతిభ కనబరిచి బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించినట్టు చెప్పారు. విజేతలను ప్రిన్సిపాల్‌తో పాటు వైస్ ప్రిన్సిపాల్ మురుగేశ్, వ్యాయామ ఉపాధ్యాయుడు సుమిత్‌దేశవాల్, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment