రైతుకు సాంకేతిక భరోసా
● ఎన్‌పీఎస్‌ఎస్ యాప్‌తో తెగుళ్లు,వైరస్‌లు ఇట్టే పసిగట్టవచ్చు ● నివారణకు సలహాలు, సూచనలు పొందవచ్చు ● సమగ్ర సస్యరక్షణ కేంద్రం అధికారి కె.వీరయ్యచౌదరి
సాక్షి, అనకాపల్లి: పంటల్లో చీడపీడలను త్వరగా గుర్తించి సత్వర సలహాలు, సూచనలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నేషనల్ ఫెస్ట్ సర్వైలెన్స్ సిస్టమ్ (ఎన్పీఎస్‌ఎస్) యాప్ దోహదపడుతుందని విజయవాడ సమగ్ర సస్యరక్షణ కేంద్రం అధికారి కె.వీరయ్యచౌదరి తెలిపారు. మంగళవారం జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో కేంద్ర సస్యరక్షణ విభాగం ఆధ్వర్యంలో జాతీయ చీడపీడల పరిరక్షణ వ్యవస్థ, కేంద్ర వ్యవసాయ శాఖ రూపొందించిన ఎన్పీఎస్‌ఎస్ యాప్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని మండల వ్యవసాయ అధికారులు, ఉద్యాన అధికారులు, శాసీ్త్రయ రైతులు శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. ససస్యరక్షణ కేంద్రం అధికారి వీరయ్య చౌదరి మాట్లాడుతూ రైతులు ఎన్పీఎస్‌ఎస్ యాప్‌ను ఉపయోగించి సలహాలు, సూచనలు పొందవచ్చని అన్నారు. పంట పొలంలోని చీడపీడల ఫొటోలను యాప్లో అప్లోడ్ చేసిన వెంటనే పురుగు, తెగులును త్వరితగతిన గుర్తించడమే కాకుండా సస్యరక్షణ చర్యలను సూచిస్తుందని తెలిపారు. కృత్రిమ మేథస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో ఈ యాప్‌ను రూపొందించారన్నారు. రైతులు సాగు చేసే ప్రధానమైన 15 రకాల పంటల్లో కీలకమైన పురుగులు, తెగుళ్లు ఉధృతి సమాచారం అందించగానే చీడపీడల నివారణ చర్యలను ఈ యాప్ సిఫార్స్ చేస్తుందని వివరించారు. ఈ యాప్ ద్వారా తెగులు, కీటకం హానికరమైందో లేదా ప్రయోజనకరమైందో తెలుసుకోవచ్చన్నారు. క్రిమిసంహారకాల కంటే ముందుగా సస్యరక్షణ యాజమాన్య పద్ధతులను ప్రోత్సహించే విధంగా యాప్ సిఫార్సులు ఉంటాయని తెలిపారు. జిల్లా ఇన్‌చార్జి వ్యవసాయ అధికారి ఎం.ఎస్.వసంతకుమారి మాట్లాడుతూ ప్రతి రైతు వారి పంటల వివరాలను ఈ యాప్‌లో నమోదు చేసుకోవడం ద్వారా వచ్చే ప్రయోజనాలను వివరించారు. అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్ అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డా.ముకుందరావు మాట్లాడుతూ శాసీ్త్రయ పద్ధతులలో రైతులకు ఈ యాప్ ద్వారా సలహాలు, సూచనలు అందుతాయన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా వనరుల కేంద్రం, సహాయ వ్యవసాయ సంచాలకులు పి.శ్రీధర్, భూ సంరక్షణ సహాయ వ్యవసాయ సంచాలకులు కె.మురళి, ఏఎస్సార్ జిల్లా వ్యవసాయఅధికారి ఏఓ సూర్యప్రకాష్, విశాఖ వ్యవసాయ అధికారి సుబ్రహ్మణ్యం, విజయవాడ సహాయ కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం సహాయ వ్యవసాయ సంచాలకులు, కె.సురేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment